breaking news
Border Defence Cooperation Agreement
-
భారత్ - చైనా సరిహద్దు రక్షణ ఒప్పందం
చైనాతో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం ( బీడీసీఏ)పై సంతకం చేసినట్లు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు. దాంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా ప్రధాని లి కెషాంగ్తో మన్మోహన్ సింగ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఇరుదేశాల ప్రధానులు మీడియా ఎదుట మాట్లాడారు. చైనాతో ప్రధానితో భేటీలో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని మన్మోహన్ వివరించారు. అలాగే తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు చైనాతో కలసి పని చేస్తామన్నారు. మన్మోహన్ పాలనలో భారత్, చైనా సంబంధాలు త్వరితగతిన మరింత మెరుగుపడటమే కాకుండా కొత్త పుంతలు తొక్కుతాయని చైనా ప్రధాని లి కెషాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్తో జరిగిన భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాకిక్ష సంబంధాలతోపాటు పలు అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించినట్లు చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం సాయంత్రం చైనా చేరుకున్నారు. -
చైనా ప్రధానితో మన్మోహన్ భేటీ
భారత్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చైనా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఆ దేశ ప్రధాని లి కెకియాంగ్తో భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య వివిధ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ విషయాలు ఆ భేటీలో చర్చకు రానున్నాయి. అంతకు ముందు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో సింగ్ గార్డ్ ఆఫ్ హానర్ గౌరవాన్ని అందుకున్నారు. ఈ భేటీలో భాగంగా బోర్డర్ డిఫెన్స్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ ( బీడీసీఏ) పై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం రాత్రి చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. మన్మోహన్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ... పోరుగు దేశమైన చైనాతో భారత్కు గల శతాబ్దాల బంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు.