breaking news
Blusmart suitcases
-
టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా!
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు భారీ ఆర్డర్లతో కాసుల వర్షం కురుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం టెస్లాకు 1,00,000 ఎలక్ట్రిక్ కార్లు కావాలని అమెరికా రెంటల్ కార్ కంపెనీ హెర్జ్ ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మన దేశానికి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు కూడా ఒక భారీ ఆర్డర్ వచ్చింది. రైడ్-హైలింగ్ ఫ్లాట్ ఫారం బ్లూస్మార్ట్ మొబిలిటీ 3,500 టాటా ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ యూనిట్లు కావాలని ఆర్డర్ చేసినట్లు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సంస్థ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల సరఫరా కోసం బ్లూస్మార్ట్ మొబిలిటీతో అవగాహనపూర్వక ఒప్పందాన్ని(ఎంఓయు) కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. బ్లూస్మార్ట్ మొబిలిటీ ఒప్పందం: "ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ కార్లను కంపెనీ ఫ్లీట్ కస్టమర్ల కొరకు టాటా ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. బ్లూస్మార్ట్ మొబిలిటీతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది" అని టాటా మోటార్స్ హెడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (కమర్షియల్) రమేష్ దొరైరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. టాటా టిగోర్ ఫేస్ లిఫ్ట్ ఆధారంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన ఎక్స్‌ప్రెస్-టీ ఎలక్ట్రిక్ వాహన ఎక్స్ టీ+ ధర రూ.9.9 లక్షలుగా ఉంది. ఎక్స్‌ప్రెస్-టీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 200కి పైగా కిలోమీటర్లు వెళ్లనుంది. దీనిలో 21.5కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 40హెచ్ పీ, 105 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును 110 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. (చదవండి: ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ మరిచిపోయారా? ఇలా చేయండి!) "మేము గత కొద్ది రోజుల 10,000 ఈవీల కీలక మైలురాయిని చేరుకున్నాము. ఇది మా సృజనాత్మక ఎలక్ట్రిక్ వాహనాలకు బలమైన నిదర్శనం. భవిష్యత్ లో మరిన్ని ఎలక్ట్రిక్ వహాలనాలతో ముందుకు వచ్చేందుకు మేము సిద్దంగా ఉన్నాము" అని దొరైరాజన్ తెలిపారు. ట్యాక్సీ కంపెనీ బ్లూస్మార్ట్ మొబిలిటీ ఫౌండర్ సీఈఓ అన్మోల్ సింగ్ జగ్గీ మాట్లాడుతూ.. కంపెనీ తన ఇటీవల "సిరీస్ A" ఫండ్ సేకరణలలో భాగంగా 25 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఈ నిదులతో ద్వారా మరిన్ని వాహనాలను రహదారుల మీదకు తీసుకొనిరావడానికి టాటా మోటార్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. (చదవండి: బిలియనీర్స్.. 42 మిలియన్ల మందిని కాపాడండి!) -
జీపీఎస్ టెక్నాలజీ సూట్‌కేసులు వచ్చేస్తున్నాయ్
కాలిఫోర్నియా : మనం సాధారణంగా మొబైల్స్, కార్లలో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఒక సూట్‌కేస్‌కి జీపీఎస్ ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మన సామాన్లు భద్రంగా ఉండటమే కాదు.. అది ప్రపంచంలో ఎక్కడున్నా లొకేషన్‌ను ట్రేస్చేసి తెలుసుకోవచ్చు. అదే బ్లూస్మార్ట్ సూట్‌కే సు. ఇది మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో ఓ పవర్‌బ్యాంక్ కూడా ఉంటుంది. దీనిద్వారా మొబైల్ చార్జింగ్ చేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ సూట్కేసుకు డిజిటల్ లాక్ కూడా ఉంది. దానిని పగలగొడితే తప్ప దొంగలు ఓపెన్ చేయలేరు. త్వరలోనే ఇండియాలో ఈ బ్లూస్మార్ట్ సూట్‌కేసులు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.