breaking news
Black and White Photo
-
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
-
1950లో విరాట్ కోహ్లీ యంఎస్ ధోనీ
ఇప్పటి క్రికెటర్లు 1950 నాటి లుక్‌తో ఎలా ఉంటారు? ఎలా ఉంటారంటే...అని ఊహించనవసరం లేకుండానే ‘ఏఐ’ టెక్నాలజీ చేసి చూపించింది. ఈ వీడియో మొదట విరాట్ కోహ్లీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోతో ఓపెన్ అవుతుంది. ఆ తరువాత రోహిత్ శర్మ స్పోర్టింగ్ కోట్తో, యంఎస్ ధోనీ బ్యాటు పట్టుకొని కనిపిస్తారు. హార్దిక్ పాండే కెమెరా ముందు చిరునవ్వులు చిందిస్తాడు. ఈ ఫొటోలు అలనాటి ఫొటోలే అని భ్రమింపజేసేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రాజ్‌కపూర్ పాపులర్ పాట ‘ప్యార్ హువా’ వినిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 19 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంతర్జాలంలో ఆరంభం అయ్యాయి. ఆనాటి దేశభక్తి గీతాల నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల వరకు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు... వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడి వడి స్వేచ్ఛా వాయువు పీల్చి – రాట్నగీతము (గురజాడ రాఘవశర్మ) వీరభారతి సందేశం పరదేశీయులు తొలగండి ఈ భారతదేశం మా దేశం వినండి! వినండి! విశ్వప్రజలు వీరభారతి సందేశం – వానమామలై వరదాచార్యులు చిత్రం: 1857 సిపాయి తిరుగుబాటు ఉప్పోయమ్మ ఉప్పు ముప్పది కోట్ల ప్రజల ముప్పు దీర్చే ఉప్పు ఉప్పుగాదిది రత్నపు తిప్ప మన పాలిటికి – ఉప్పుపాట (గరికపాటి మల్లావధాని) ఫోటో: దండి సత్యాగ్రహం: ఏప్రిల్6, 1930 చెప్పరా...లేకున్న ముప్పురా! చెప్పరా! నీ కన్నులిటపై/ విప్పరా! ఆ ప్రభుత నింతట త్రిప్పరా! లేకున్న–నీకగు ముప్పురా! మాయప్ప ఇప్పుడు – పాంచాలము (గరిమెళ్ల) ఫొటో: సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో బాంబేలో బ్రిటిష్ వారి వస్తువులతో ఉన్న ఎడ్లబండి ముందుకు పోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్న ఉద్యమకారుడు -
ఎవడ్రా అక్కడ?
‘ఎవర్గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా’గా మహాత్ముని చేత పిలవబడిన త్రివేండ్రంలో సొంత ఇల్లు ఒకటి ఉండాలనే మా కల, నాన్న రిటైర్మెంట్ తరువాతగానీ సాధ్యం కాలేదు. కొద్దిరోజుల్లోనే తంపనూర్లో ఒక ఇంటిని కొన్నాం. మంచి ముహూర్తం చూసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యాం. ‘‘ఈ ఇంటాయన భార్య చనిపోయిందట. ఒంటరిగా ఉండలేక అమెరికాలో ఉన్న కొడుకు దగ్గర ఉండటానికి ఇల్లు అమ్మాడు. లేకుంటే ఇలాంటి ఇంటిని అమ్మడానికి ఎవరైనా ఇష్టపడతారా?’’ కాఫీ తాగుతూ అన్నాడు నాన్న. ‘‘మన అదృష్టం’’ అంది అమ్మ. ఇంట్లో మా సామాన్లు సర్దడం అనే కార్యక్రమం మొదలైంది. పాతసామాన్ల రూమ్‌లో పెద్ద బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి కనిపించింది. ఫొటోలో ఉన్నావిడ చాలా అందంగా నవ్వుతోంది. ‘‘ఈ ఇంటి యజమాని భార్యలా ఉంది. ఈ ఫొటో గురించి ఆయన మరిచిపోయినట్లు ఉన్నాడు. ఇది ఎలాగైనా సరే ఆయనకు చేరవేయాలి. అప్పటి వరకు ఈ చీకట్లో ఉండటం ఎందుకు?’’ అని ఆ ఫొటోను ఇంట్లో గోడకు తగిలించాడు నాన్న. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న నేను రాత్రి ఒంటి గంటా రెండు గంటల వరకు మెలకువతోనే ఉండేదాన్ని. ఒకరోజు ఒంటిగంట సమయంలో రిలాక్స్ కావడం కోసం ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. గోడ మీద ఉన్న ఫొటో కనిపించింది. ‘‘ఈవిడ నవ్వు ఎంత అందంగా ఉంటుంది’’ అని ఒకసారి పరిశీలనగా చూశాను. అంతే...ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఫొటోలో ఆమె నవ్వు కనిపించడం లేదు. నాలుక మాత్రం ఎర్రగా ఫొటో నుంచి ఫ్లోర్‌ను తాకుతోంది. ఆమె కళ్లు చింత నిప్పుల్లా ఉన్నాయి. విషయం ఎవరితో చెప్పలేదు. లైట్లు ఆఫ్ చేసి పడుకున్నాను. ఉదయాన్నే లేచి ఫొటో చూస్తే ఎప్పటిలాగే అదే అందమైన నవ్వు. ‘‘ఈరోజు ఎలాగైనా సరే.. సంగతేమిటో తేల్చుకుందామని రాత్రి ఒంటగంట వరకు మేలుకొని గుండెలు దడదడలాడుతుండగా ఆ ఫోటో దగ్గరికి వెళ్లి చూశాను. ఫ్యాన్ ఎలా తిరుగుతుందో... అలా తిరుగుతుంది ఫోటో! ఆ రాత్రి నాకు ఎలా నిద్ర పట్టిందో ఆ దేవుడికే తెలుసు! జస్ట్ రెండు రోజుల తరువాత...‘‘యంజీ రోడ్ దగ్గర మంచి ఇల్లు ఒకటి కొన్నాను. రేపే మనం ఇల్లు ఖాళీ చేయాలి’’ అన్నాడు నాన్న. మరో సందర్భంలోనైతే ‘మీకేమైనా పిచ్చిపట్టిందా? ఈ ఇల్లు కొని నెల రోజులు కాలేదు. అప్పుడే కొత్త ఇల్లా?’’ అని అరిచేదాన్ని. కానీ ఒక్కమాట మాట్లాడలేదు. కొత్త ఇంట్లోకి మారాం. ఆ ఇంటితో పోల్చితే ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఒకరోజు నాన్న నా దగ్గరకు వచ్చి ‘‘నీకో విషయం చెప్పాలి దీప్తి’’ అన్నాడు. ‘‘పాత ఇంటి గురించేనా. నాకేమీ కోపం లేదు. ఈ ఇల్లు బాగానే ఉంది’’ అన్నాను. ‘‘నేను చెప్పదల్చుకుంది అది కాదు...ఒకరోజు పాత ఇంట్లో..’’ అనబోయాడు. ‘‘ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో నుంచి ఒక నాలుక బయటికి వచ్చింది, ఫ్యాన్‌లా గిర్రున తిరిగింది’’ అన్నాను. ‘‘కాదు... ఒకరోజు అర్ధరాత్రి... మనోహర్ అనే పిలుపుతో నిద్ర లేచాను. డ్రాయింగ్‌రూమ్‌లో ఉండాల్సిన ఫొటో బెడ్రూమ్ గోడకు కనిపించింది. ఫొటోలో ఉన్న ఆమె నన్ను చూపుడు వేలుతో ఏదో హెచ్చరిస్తోంది. ఆ భయంలోనే కళ్లు తిరిగి పడిపోయాను. ఎలా నిద్రపోయానో తెలియదు. తెల్లారి లేచి చూస్తే... ఆ ఫొటో ఎప్పటిలాగే డ్రాయింగ్ రూమ్‌లో ఉంది’’ అని చెప్పాడు. పాత ఇంట్లో ఉన్నరోజుల్లో... ఒకరోజు అర్ధరాత్రి బాగా దాహమేసి ఫ్రిజ్ తలుపులు తెరిచిన అమ్మ గట్టిగా అరవడంతో మేమందరం పరుగెత్తుకు వచ్చాం. ‘‘బొద్దింక కనిపించింది’’ అనడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఆమెకు బొద్దింకలంటే చాలా భయం. అమ్మ ఆరోజు అరిచింది బొద్దింకను చూసి కాదని, ఫ్రిజ్ తలుపులు తీయగానే వికృతంగా నవ్వుతున్న ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని చూసి అని కొన్ని రోజుల తరువాతగానీ మాకు తెలియలేదు! – దీప్తి మీనన్, త్రివేండ్రం -
కొన్ని అలవాట్లు అంతే... మారవ్!
మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయ్. వాటిని మార్చుకోవాలనుకున్నా సాధ్యం కాదు. అమితాబ్ బచ్చన్‌కి అలా మార్చుకోలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కుర్చీలో కూర్చునే విధానం గురించి చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా కూర్చోవడం అమితాబ్ అలవాటు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో 1975కి సంబంధించినది. ‘షోలే’ చిత్రం షూటింగ్లో అమితాబ్ అలా కూర్చున్నారు. ఇటీవల ఓ యాడ్‌లో నటించారాయన. చిత్రీకరణ సమయంలో దొరికిన విరామంలో ఎప్పటిలానే కూర్చున్నారు. పాత ఫొటోకి తాజా ఫొటో మ్యాచ్ చేసి, ‘‘కొన్ని అలవాట్లు మారవ్... 35 ఏళ్లయినా కూడా’’ అని అమితాబ్ పేర్కొన్నారు.