breaking news
birth and death
-
మహామేధావికి రెండు జననమరణాలు!
ఐజాక్ న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళశాస్త్రాల్లో మహనీయునిగా పేరొందారు. ఆయన ప్రపంచానికి అందించిన పలు ఆవిష్కరణలు కొత్తదారులను చూపాయి. న్యూటన్ జననమరణాలకు సంబంధించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి.బహుముఖ ప్రజ్ఞాశీలిగా..ఐజాక్ న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. యాపిల్ కిందనే పడటానికి న్యూటన్ చెప్పిన కారణం, ఆయన అందించిన చలన నియమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ న్యూటన్ ప్రపంచానికి అనేక ఇతర ఆవిష్కరణలను కూడా అందించారు. గణిత శాస్త్రజ్ఞునిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా న్యూటన్ ప్రపంచానికి సుపరిచితమే. న్యూటన్ అందించిన ఆవిష్కరణలు కొన్నిరంగాల్లో సమూల మార్పులను తీసుకువచ్చాయి.రెండు పుట్టినరోజులున్యూటన్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అతనికి రెండు పుట్టినరోజులున్నాయి. న్యూటన్ జీవించివున్న కాలంలో వినియోగంలో ఉన్న క్యాలెండర్ల కారణంగా అతని పుట్టిన తేదీలలో పది రోజుల వ్యత్యాసం కనిపిస్తుంది. న్యూటన్ పుట్టినరోజు జనవరి 4 అని కొందరు పరిణిస్తుండగా, డిసెంబర్ 25న అతని పుట్టినరోజును జరుపుకునేవారున్నారు. నిజానికి న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4న చేసుకుంటారు.అధికారిక జన్మదినంన్యూటన్ ఇంగ్లాండ్‌లోని వూల్స్టోర్ప్లోని మనోర్ హౌస్‌లో జన్మించారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించేవారు. ఇది యూరప్‌కు భిన్నంగా ఉండేది. దీని ప్రకారం చూస్తే న్యూటన్ 1642, డిసెంబర్ 25న జన్మించారు. అయితే అదే కాలంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ఆమోదం లభించింది. ఇదే నేడు అందరూ ఉపయోగిస్తున్న క్యాలెండర్. దీని ప్రకారం చూసుకుంటే న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. ఇదే తరువాతి కాలంలో న్యూటన్ అధికారిక పుట్టిన తేదీగా పరిగణించారు.కెమిస్ట్రీలో అమితమైన ఆసక్తిగురుత్వాకర్షణ భావన న్యూటన్ సిద్ధాంతానికి ముందే ఉన్నప్పటికీ, న్యూటన్ అందించిన సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపధ్యంలో న్యూటన్ సైన్స్‌లో కొత్త శకాన్ని ప్రారంభించారని అంటారు. ఆయన కాలిక్యులస్ని కనిపెట్టడం ద్వారా గణితానికి కొత్త శాఖను అందించారు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్‌ను తయారు చేసిన మహనీయునిగానూ న్యూటన్ పేరొందారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది అయిన ప్రిజం ద్వారా తెల్లని కాంతితో కూడిన రంగుల వర్ణపటాన్ని మొదటిసారి న్యూటన్ ప్రపంచానికి చూపించారు. న్యూటన్‌కు కెమిస్ట్రీలో ఎంతో ఆసక్తి ఉంది. ఆయన రసాయన శాస్త్రంపై పలు రచనలను సాగించారు. రచయితగానూ పేరొందారు.ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలుజూలియన్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం న్యూటన్ 1727, మార్చి 20న మరణించారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే ఏడాది మార్చి 31న న్యూటన్ కన్నుమూశారు. న్యూటన్ నిద్రలో మరణించారని చెబుతారు. అతని మరణం తరువాత అతని శరీరంలో పెద్దమొత్తంలో పాదరసం కనుగొన్నారని అంటారు. న్యూటన్ తన జీవితంలోని తుదిదశలో మానసిక ఆరోగ్యంతో బాధపడ్డారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు. చుట్టుపక్కలవారిని కలుసుకోవడం మానేశారు. న్యూటన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగాయి.ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం -
ఒకేరోజు జననం.. ఒకేరోజు మరణం
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు. మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
అనంతపురం మెడికల్ : జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీటింగ్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాల్లో తేడాలు లేకుండా చూడాలన్నారు. ఆధార్ నంబర్ తీసుకుని పేర్లు సరిచూసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన వారందరికీ ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాలు కూడా నమోదు చేయాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఎస్ఓ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ కార్యాలయ ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.