breaking news
bike robbery case
-
ఒక్క బైకు దొంగను పట్టుకుంటే.. 77 బైకులు
కంటోన్మెంట్: తీగలాగితే డొంకంతాకదిలింది... ఒక్క బైకు దొంగను పట్టుకుంటే మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన77 బైకు దొంగతనాలు బయటపడ్డాయి. పోలీసుల చాకచక్యంతో బైకు దొంగలముఠా గుట్టు రట్టయింది. గత నాలుగైదు నెలల్లోనే చోరీకి గురైన ద్విచక్ర వాహనాలును స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రధాన నిందితులు మొహసీన్, అమీనుల్లా, అక్బర్ గ్యాంగ్‌లకు చెందిన 15 మంది దొంగలను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవారం కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎలా దొరికారంటే? కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో టీవీఎస్ స్పోర్ట్స్ బైకు చోరీని చేధిస్తున్న క్రమంలో పోలీసులు ముషీరాబాద్‌కు చెందిన ఆదిల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని విచారణలో భాగంగా మోహసిన్ అనే మరో బైకుల దొంగతో కలిసి ఆదిల్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. మోహసీన్ వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు బైకు దొంగతనాలకు పాల్పడి ఈ ఏడాది మార్చి 31 అరెస్టు అయ్యి, మే 21న జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే తన గ్యాంగులోని ఐదుగురు అనుచరులు షోయెబ్, సైఫ్, హఫీజ్, ఫైజాన్, సుభాన్‌లతో కలిసి మరో 15 దొంగతనాలకు పాల్పడ్డాడు. కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ చేసిన వాహనాన్ని మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అబ్దుల్లాకు విక్రయించినట్లు మొహసీన్ వెల్లడించాడు. కార్ఖానా పీఎస్ పరిధిలోని వాహనంతో పాటు అబ్దుల్లా నుంచి మరో నాలుగు చోరీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఉస్మాన్ గంజ్‌లోని హిందుస్థాన్ పార్సిల్ సర్వీసెస్ ద్వారా నిజామాబాద్‌కు చెందిన అక్బర్‌కు ఓ చోరీ వాహనాన్ని తరలించినట్లు గుర్తించారు. ఈ మేరకు హిందుస్థాన్ పార్సిల్‌కు సంబంధించిన గత ఆరు నెలల రికార్డులు పరిశీలించగా అక్బర్, అస్గర్, మన్నన్‌ల పేరిట పలు వాహనాలను నిజాబాబాద్‌కు తరలించినట్లు తేలింది. పదిహేను రోజుల వ్యవధిలోనే అక్బర్‌కు పలు వాహనాలు అప్పగించినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మరికొందరు నిందితులు అబూద్, యాసర్ అరాఫత్ అలియాస్ అప్పూ, అబ్దుల్లా, ఫరూఖ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అమీనుల్లా, మొహసీన్ గ్యాంగుల ద్వారా పలు వాహనాలను తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. మొత్తంగా 77 వాహనాలను స్వాధీనం చేసుకుని 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన వాహనాల్లో 41 వాహనాలు ఫైనాన్స్ ఎగవేతకు సంబంధించినవి ఉన్నాయి. ఖరీదైన వాహనాలే లక్ష్యం నిజామాబాద్‌కు చెందిన అక్బర్, అస్గర్ సోదరులు ఈ భారీ చోరీ ముఠాను నడిపిస్తున్నట్లు తేలింది. హిందూస్థాన్ పార్సిల్ సర్వీసెస్ మేనేజర్ రిజ్వాన్ సహకారంతో చోరీ వాహనాలను నిజామాబాద్‌కు తరలించినట్లు వెల్లడైంది. నిజామాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వాహనాల విక్రయాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న డిమాండ్‌ను బట్టి ఫలానా వాహనం పంపాలంటూ వారు సూచించేవారు. ఆ మేరకే మొహసీన్, అమీనుల్లా గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను చోరీ చేసే వారు. రెసిడెన్షియల్ కాలనీలు, ఖాళీ ప్రదేశాల్లో తాము గుర్తించిన వాహనాల హ్యాండిల్ లాక్‌లను తొలగిస్తారు. అనంతరం ఇగ్నిషన్ కేబుల్స్‌ను తొలగించి, డైరెక్ట్ కనెక్షన్ ద్వారా వాహనాలు స్టార్ట్ అయ్యేలా చేసి తీసుకెళ్తారు. ఇలా వాహనాలు చోరీ చేసి తీసుకొచ్చిన వారికి ప్రధాన నిందితులు గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా అక్బర్, అస్గర్ గ్యాంగుకు చెందిన వ్యక్తులు ఖరీదైన వాహనాలను ఫైనాన్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి ఉద్దేశపూర్వకంగానే ఫైనాన్స్ ఎగ్గొట్టేవారు. అనంతరం ఆ వాహనాలను హిందుస్తాన్ పార్సిల్ సర్వీసెస్ ద్వారా నిజామాబాద్‌కు తరలించేవారు. అక్కడ వీటికి సంబంధించి పత్రాలు సృష్టించి విక్రయించేస్తున్నారు. నార్త్‌జోన్ పోలీసులకు అభినందనలు భారీ వాహనాల చోరీ గుట్టు రట్టు చేసి పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా పనిచేసిన నార్త్‌జోన్ పోలీసులను సీపీ అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా నార్త్‌జోన్ డీసీపీ సూచనలతో కార్ఖానా ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్ స్వామి ఆధ్వర్యంలో సాగిన పూర్తిస్థాయి దర్యాప్తును ఆయన అభినందించారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన అదనపు ఇన్స్పెక్టర్లు ఎం. వెంకటేశం, నేతాజీ, జి.నరేశ్, ఎస్ఐలు ఎన్. సందీప్‌రెడ్డి, ఎస్ఎన్జీ అవినాశ్ బాబు, రవిపాల్, ఎం.మహేశ్, ఏ. మాధవరెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీధర్, రాజశేఖర్, పురుషోత్తం, రాకేశ్, యాదగిరి, శంకర్ నాయక్, హిదయతుల్లాను సీపీ ప్రశంసించారు. -
మోటారు సైకిల్ దొంగల అరెస్టు
గుంటూరు: వ్యసనాలకు బానిసలుగా మారి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్ ఏఎస్పీ రాఘవ తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకా రం... గుంటూరులోని హనుమయ్యనగర్‌కు చెం దిన ముత్తుకూరి సాయిరామ్ తాళం వేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేసిన కేసుల్లో గతంలో విజయవాడలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా డు. క్యాటరింగ్ పనులకు వెళుతున్న క్రమంలో అక్కడ గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్ళపాడుకు చెందిన షేక్ అల్లాభక్షు పరిచయం కావడంతో అతనితో పాటు కలసి ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. గత నెల 8న అల్లా భక్షును పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో సాయిరామ్ తప్పించుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన లంజేపల్లి షడ్రక్ అలియాస్ రవితో కలసి సాయిరామ్ ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై అరండల్‌పేట ఫైఓవర్ వద్ద వేచి ఉన్నారు. వారు పోలీసులను గమనించి పరారవుతుండగా సీసీఎస్ పోలీసులు ఇద్దరినీ వెంటాడి అదుపులోకి తీసుకొని, వారి దైనశైలిలో విచారించారు. చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. రూ.5 లక్షల విలువ చేసే బుల్లెట్‌తో పాటు ఐదు యాక్టివాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీతో పాటు డీఎస్పీ డి.ప్రసాదు, సీఐ లు సీహెచ్‌వీబీ సుబ్రహ్మణ్యం, ఆర్.సురేష్‌బాబు, ఎస్సైలు కిషోర్, మహేంద్ర పాల్గొన్నారు. -
పొద్దంతా పోలీసు.. రాత్రంతా చోరీలు
హైదరాబాద్ రక్షకభటులకు చిక్కిన మాజీ మిలటరీ మ్యాన్ వేములవాడ : జల్సాలకు అలవాటు పడిన వేములవాడకు చెందిన ఓ యువకుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఈ విషషయం మంగళవారం ఆలస్యం గా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చజరుగుతోంది. వేములవాడ పట్టణానికి చెందిన ఓ యువకుడు నాలుగేళ్ల క్రితం మిలటరీలో చేరాడు. తుపాకీ మిస్‌ఫైర్ అరుున కేసులో అతడిని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి సదరు యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో హైదరాబాద్, చుట్టుపక్క ప్రాంతాల్లో రాత్రి పూట ద్విచక్ర వాహనాలు అపహరించడంతోపాటు దొం గతనాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు తనిఖీ లు నిర్వహించిన క్రమంలో తన మిలటరీ కార్డు చూపించడం లేకపోతే ఎస్సైనంటూ, డిపార్టుమెం టు మనిషినని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా తనకున్న బొలెరోపై ప్రభుత్వ వాహనమని రాయించుకుని తిరుగుతున్నాడు. ఇతడికి వేములవాడకు చెందిన మరో యువకుడు సైతం తోడు కావడంతో వీరి ఆగడాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ బైక్ దొంగతనం కేసులో ఆనవాళ్లు దొరకడంతో సదరు యువకుడిని సికింద్రాబాద్ పోలీసులు పట్టుకుని కూపీ లాగారు. దీంతో డొంకంతా కదలింది. పూర్తి వివరాలు సేకరించిన సికింద్రాబాద్ పోలీసులు కరీంనగర్ పోలీ సులకు సమాచారం అందించగా అతడిని కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. అతడితో ఉన్న మరో యువకుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.