breaking news
bicycles theft
-
నగరంలోని సైకిళ్లన్నీ మాయం.. కారణం తెలిసి పోలీసులే షాక్!
చండీగఢ్: హరియాణాలోని పంచకుల జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా సైకిళ్లు మాయమవుతున్నాయి. ఒక్కసారిగా సైకిళ్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు పెరగటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించారు. అయితే.. పోలీసులే విస్తుపోయే సంఘటన ఎదురైంది. నగరంలోని సైకిళ్లన్నింటిని ఒకే వ్యక్తి ఎత్తుకెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచకుల జిల్లాలోని మంజ్రి గ్రామంలో రవి కుమార్(32) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. పంచకుల జిల్లా మొత్తం తిరుగుతూ సైకిళ్లు ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నాడు. ఇటీవలే సెప్టెంబర్ 14న సెక్టార్ 26లో సుమారు రూ.15,000 విలువ చేసే సైకిల్‌ను మాయం చేశాడు. సెక్టార్స్ 2,4,7,9,10,11,12,12A,20, 21,25లలో సైకిళ్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల తర్వాత రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. నిఘా కెమెరాల ఆధారంగా మొత్తం 62 సైకిళ్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘సీసీటీవీ ఫుటేజ్, సైబర్ టెక్నాలజీ ఆధారంగా పంచకుల జిల్లా మొత్తం ఒకే వ్యక్తి సైకిళ్లు దొంగతనం చేసినట్లు తేలింది. ఈ సైకిళ్లు గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర ఉన్నాయి.’ అని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన సైకిళ్లను అత్యంత తక్కువ ధరకు రూ.2,000లకే అమ్మటం.. వచ్చిన డబ్బును మత్తుపదార్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగించటం చేస్తున్నాడు. ‘2021లో లుథియానా నుంచి చండీగఢ్‌లోని రాయ్‌పుర్ ఖుర్ద్‌కు మకాం మార్చాడు రవి. జిరాక్‌పుర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. తన ఉద్యోగం పోయిన క్రమంలో మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత పంచకులకు మారి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నాడు.’ అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపాడు. ఇదీ చదవండి: భర్తను చితకబాది.. భార్యను లాక్కెళ్లి ఆరుగురు గ్యాంగ్ రేప్! -
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
మైదుకూరు టౌన్: జిల్లాలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప నగరం కటిక వీధికి చెందిన కటిక ఫరూక్ చికెన్షాపు నిర్వహించేవాడు. వ్యసనాలకు బానిసై షాపుల వద్ద ఉన్న ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతూ వాటిని అమ్మిన డబ్బుతో జల్సాలు చేసుకునేవాడు. కడపలో రెండు ద్విచక్ర వాహనాలు దొంగిలించి ఎం. గురవయ్య, ఎస్. నాగరాజు అనే వ్యక్తులకు విక్రయించాడు. అలాగే జిల్లాలో మరో రెండు చోట్ల రెండు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు, మైదుకూరులో రెండు ఎక్సెల్ వాహనాలు చోరీ కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. మంగళవారం కడప- కర్నూలు జాతీయ రహదారిలో సరస్వతీపేట వద్ద నెంబర్‌ప్లేట్ లేని ద్విచక్రవాహనంలో ఫరూక్ వస్తుండగా మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో పట్టుకొని విచారించగా ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించాడు. మూడు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఇప్పటి వరకు 6 వాహనాలను దొంగిలించగా వాటిలో 4 ఫరూక్ వద్దనే ఉన్నట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ వివరించారు. నిందితుడితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఆయన తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, అర్బన్ ఎస్ఐ రామకృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ గుర్రప్ప, కానిస్టేబుళ్లు ఇజ్రాయిల్, సాగర్, శ్రీకాంత్, ఉదయ్‌లు ఉన్నారు.