ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డుపై శనివారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అతివేగంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.