breaking news
Bhuma nagai reddy
-
బడ్జెట్ లొసుగుల్ని ఎండగడతాం
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టీకరణ నంద్యాల: ఎన్ని కుట్రలు పన్నినా.. అడ్డంకులు సృష్టించినా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లోని లొసుగులను శాసనసభలో ఎండగడతారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. నంద్యాలలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఏ మాత్రం అనుకూలంగా లేని బడ్జెట్‌ను రూపొందించిందని ఆయన మండిపడ్డారు. దీనిపై శాసనసభ సమావేశాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలిపారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా కూడా పదేళ్ల అనుభవం ఉన్నందువల్ల.. విపక్షానికి గౌరవం ఇచ్చి జగన్ ప్రసంగానికి అడ్డుతగలకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. విపక్షగళం ప్రజలకు వినిపించేలా స్పీకర్ కోడెల శివప్రసాద్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ నాయకులు చిన్న ఆరోపణలనే తట్టుకోలేకపోతుంటే.. ఇక బడ్జెట్లోని ఘోరాలను ఎలా జీర్ణించుకుంటారనేది సమావేశంలో తేలుతుందన్నారు. ప్రతిపక్ష నేత 4 రోజుల ముందే బడ్జెట్‌పై అధికార పార్టీని కడిగి పారేస్తానని వెల్లడించడంతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు. దీంతో జగన్ ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొందన్నారు. సమావేశాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నట్లు చెప్పారు. శోభానాగిరెడ్డి వర్ధంతి వాయిదా: తెలుగు సంవత్సరం ప్రకారం తన సతీమణి దివంగత శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం (16న) నిర్వహించాల్సి ఉందని భూమా నాగిరెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ‘తెలుగు’ పంచాంగాన్ని అనుసరిస్తుండటంతో ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించాల్సిన కార్యక్రమాలను సోమవారం జరుపుకోవాల్సి ఉందన్నారు. అయితే కార్యక్రమం నిర్వహిస్తే తనతో పాటు, కర్నూలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, అఖిలప్రియ కూడా అసెంబ్లీకి వెళ్లే అవకావం ఉండదని వివరించారు. శోభా నాగిరెడ్డి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే వారు కాబట్టి కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేసుకొని శాసనసభకు వెళుతున్నట్లు తెలిపారు. -
అళ్లగడ్డలో ముగిసిన అంత్యక్రియలు
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తల్లి ఈశ్వరమ్మ(80) అనారోగ్యంతో సోమవా రం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అక్కడి నుంచి ఈశ్వరమ్మ పార్థివదే హాన్ని ఆళ్లగడ్డలోని భూమా స్వగృహా నికి తీసుకొచ్చారు. హైకోర్టు స్టే ఇచ్చిన తరువాత తల్లి మృతి వార్త తెలుసుకున్న భూమా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ సర్పంచ్ ఎస్వీ నాగిరెడ్డి, ఎ.వి. సుబ్బారెడ్డి, తదితర ప్రముఖులు ఈశ్వరమ్మకు నివాళులర్పించారు. పట్టణంలోని శ్మశానవాటికలో ఈశ్వరమ్మ మృతదేహానికి భూమా నాగిరెడ్డి కర్మకాండ నిర్వహించారు. -
‘పచ్చ చట్టమే’ చుట్టం!
కర్నూలు జిల్లాలో పోలీసుల ప్రతాపం అధికార పార్టీ సేవలో నిబంధనలకు తిలోదకాలు ప్రతిపక్ష నేతలను అణగదొక్కడానికి, కేసుల్లో ఇరికించడానికీ ప్రయత్నాలు అధికార పార్టీ నేతల అరెస్టుపై మీనమేషాలు.. సాక్షి, కర్నూలు: చట్టాలను నిష్పక్షపాతంగా అమ లు చేయాల్సిన పోలీసు యంత్రాంగం కర్నూలు జిల్లాలో అధికార పార్టీ అక్రమ సేవలో చట్టవిరుద్ధంగా, న్యాయబాహ్యంగా, అధర్మంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో మసలుతూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బం ది పెట్టడానికి చట్టాలను తుంగలో తొక్కుతోంది. చట్టాలను అతిక్రమించినప్పటికీ అధికార పార్టీకి చెందిన వారైతే పోలీసులే వారికి చుట్టాలై కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చట్టాలు తమ చేతుల్లోకి తీసుకున్న అధికార పార్టీకి చెందిన వారిపై కేసులు పెట్టడానికి సైతం పోలీసులు వెనుకాడటమే కాకుండా వారి కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న వైనం సర్వత్రా విస్మ యం కలిగిస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే వారిని వేధించడానికి, దారుణంగా అణగదొక్కడానికి, కేసుల్లో ఇరికించడానికీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కర్నూలులో గత కొద్ది రోజు లుగా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ వారి వైఖరిలో మార్పు రావడం లేదు. న్యాయస్థానం ఆదేశించినప్పటికీ విచారణ పేరు తో సాగదీస్తున్నారే తప్ప అధికార పార్టీ నేతలను అదుపులోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నేతల ఒత్తిళ్ల మధ్య జిల్లాలో కొద్ది రోజులుగా ‘పచ్చ చట్టమే’ చెల్లుబాటవుతోంది. గత నెల 31వ తేదీన నం ద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటనపై ఆగమేఘాల మీద ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు.. అదే సంఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ మీనమేషాలు లెక్కించడం వెనుక అధికార పార్టీ పెద్దల ఆదేశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫిర్యాదులు ఉండీ కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోగా ఆ నేతలు యధేచ్చగా జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భాల్లో పోలీసులు వారికి కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించడం విస్మయం కలిగిస్తోంది. కౌన్సిల్ మీట్‌కు భారీ భద్రత.. తాజాగా నంద్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసెంబ్లీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసి.. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ శుక్రవారం రాత్రి మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని పోలీ సులు అధీనంలోకి తీసుకున్నారు. కౌన్సిలర్లు, మీడియా ప్రతినిధులు, అధికారులు మినహా ఇతరులు సమావేశంలోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. నలుగురు సీఐలు, పదిమంది ఎస్ఐలు దాదాపు 100 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డు లు, మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు నియమించారు. గత నెల 31వ తేదీన మున్సిపల్ సమావేశంలో ఘర్షణల కు కారకులైన వారిని అరెస్ట్ చేయకుండానే మున్సిపల్ సమావేశానికి బందోబస్తును ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. నాన్ బెయిలబుల్ కేసులే అయినా.. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, దేశం సులోచనతో పాటు ఇతర టీడీపీ నేతలపై గత మున్సిపల్ కౌన్సిల్ ఘటనకు సంబంధించి నాన్-బెయిలబుల్ కేసులే నమోదయ్యాయి. శిల్పా మోహన్‌రెడ్డి, దేశం సులోచన, దేశం సుధాకర్ రెడ్డి, అమృతరాజు, పెదకండిగ సుబ్రమణ్యం, రంగాప్రసాద్, కష్ణ మోహన్ మరియు ఇతరులపై ఈ నెల 18వ తేదీన....సెక్షన్లు 120 (బి), 324, 307 ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ మరియు సెక్షన్ 156(3) సీఆర్పీసీ కింద కేసులను నమోదు చేశారు. మరో కేసులో (227/14) దేశం సులోచన, వెంకట సుబ్బయ్య, గొల్ల లక్ష్మీనారాయణ, జాకీర్ హుస్సేన్, తెలుగు కష్ణమోహన్, అమీర్ బాషాలపై సెక్షన్లు...323, 354, 427, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. ఇందులో 354, అట్రాసిటీ కేసులు... రెండూ కూడా నాన్-బెయిలబుల్ కేసులే. తెలుగు కృష్ణమోహన్‌పై నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటు కూడా ఉంది. అయినప్పటికీ వారికి వత్తాసు పలికేవిధంగా పోలీసుల చర్యలు ఉన్నాయి. కేసులో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి ఈ నెల 22న బెంగళూరు నుంచి నంద్యాలకు రావడం, పురపాలక సంఘం చైర్-పర్సన్, టీడీపీ నేత దేశం సులోచన కూడా అదే రోజు జరిగిన స్వచ్ఛభారత్ లో పాల్గొన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. దర్జాగా తిరుగుతున్న టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులే టీడీపీ నేతలపై నమోదైనా.. టీడీపీవారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. జెడ్పీ చైర్మన్, తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ ఏకంగా కల్తీ మద్యం కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి పక్కా ఆధారాలున్నా అరెస్టుకు పోలీసులు వెనుకాడుతున్నారు. అంతేకాదు ఏకంగా సీఎం చంద్రబాబు నుంచే తనకు అభయం ఉందని ఆయన చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో గత శనివారం నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో ఆయన కలెక్టర్ పక్కనే కూర్చున్న సంగతి తెలిసిందే. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ రాంపుల్లయ్యయాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నేతలు.. అది సాధ్యంగాకపోవడంతో ఆయన ఆ సంఘం డెరైక్టర్ ను కిడ్నాప్ నాటకానికి తెర తీశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను రాంపుల్లయ్యే కిడ్నాప్ చేశారంటూ ఆయన ఇంట్లో లేని సమయంలో శుక్రవారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. ఈ విధంగా అధికార పార్టీ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. -
విభజన డ్రామాలో కిరణ్ ఒక ఎపిసోడ్
నంద్యాల, : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా రాష్ట్ర విభజన కోసం సోనియాగాంధీ ఆడించిన డ్రామాలో ఒక ఎపిసోడ్ అని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. విభజన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రిగా కిరణ్‌ను కొనసాగించడం ద్వారా అధిష్టానం లక్ష్యం నెరవేర్చుకుందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో నాటకాన్ని ఆయన రక్తి కట్టించారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నేత మోడీ సీమాంధ్రకు మద్దతు ప్రకటిస్తుండగా.. సుష్మాస్వరాజ్, అరున్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తెలంగాణకు మద్దతిస్తూ ద్వంద్వ నీతిని అవలంబించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే విభజన చేస్తామని లోక్‌సభలో బిల్లును బీజేపీ వ్యతిరేకించి ఉంటే ఆ పార్టీ విలువ రెట్టింపయ్యేదన్నారు. చంద్రబాబు సమైక్య లేఖ ఇవ్వకుండా సీమాంధ్రను మోసగించారన్నారు. బీజేపీతో బాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా విభజనకు మార్గం సుగమమం చేసిందన్నారు. ఇన్నివిధాల ద్రోహం చేసిన బాబుకు సీమాంధ్రలో పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ డెరైక్షన్‌లో కిరణ్ సమైక్యవాదిగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూనే విభజనకు సహకరించారన్నారు. మీడియాలో ప్రకటనలు తప్పిస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరు సాగించారని.. విభజన వాదుల దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన కోరారు.