breaking news
Bhimavaram Talkies
-
పంద్రాగస్టుకి పదిహేను చిత్రాలకు శ్రీకారం
భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ పదిహేను సినిమాల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ‘జస్టిస్ ధర్మ’ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించనుండగా, ‘నాగపంచమి’కి ఓం సాయిప్రకాశ్, ‘నా పేరు పవన్ కల్యాణ్’కి జేకే భారవి, ‘టాపర్’కి ఉదయ్ భాస్కర్, ‘కేపీహెచ్‌బీ కాలనీ’కి తల్లాడ సాయికృష్ణ, ‘పోలీస్ సింహం’కి సంగకుమార్, ‘అవంతిక–2’కి శ్రీరాజ్ బళ్లా, ‘యండమూరి కథలు’కి రవి బసర, ‘బి.సి’ (బ్లాక్ కమాండో)కి మోహన్ కాంత్, ‘హనీ కిడ్స్’కి హర్ష, ‘సావాసం’కి ఏకరి సత్యనారాయణ, ‘డార్క్ స్టోరీస్’కి కృష్ణ కార్తీక్, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’కి బి. శ్రీనివాసరావు, ‘ది ఫైనల్ కాల్’కి ప్రణయ్ రాజ్ వంగరి, ‘అవతారం’ సినిమాకి డా. సతీష్ దర్శకత్వం వహించనున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలను 2026 ఆగస్టు 15కి పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్‌లో నమోదు చేశాయి’’ అని చెప్పారు. -
శ్రీవల్లి కళ్యాణంకి శ్రీకారం
చిన్న చిత్రాల నిర్మాతగా కెరీర్‌ని ఆరంభించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ నూరవ చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. భీమవరం టాకీస్‌పై ఈ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని కె. రాఘవేంద్ర రావుతో నిర్మించనున్నట్లు శుక్రవారం రామసత్యనారాయణ తెలిపారు. నేడు రామసత్యనారాయణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘త్వరలోనే ‘శ్రీవల్లి కళ్యాణం’ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది విడుదల చేస్తాం. సుమన్, రవళి జంటగా నిర్మించిన ‘ఎస్.పి. సింహా’తో నిర్మాతగా నా కెరీర్ చిన్నగా ఆరంభమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నిర్మించాను. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తీసిన ‘ఐస్‌క్రీమ్’ పార్ట్ వన్, పార్ట్ టూలతో నిర్మాతగా నా కెరీర్ పుంజుకుంది. ‘ట్రాఫిక్’, ‘వీరుడొక్కడే’, ‘బచ్చన్’, ‘శీనుగాడి లవ్ స్టోరీ’ తదితర అనువాద చిత్రాలు లాభాలతోపాటు ఆత్మసంతృప్తిని ఇచ్చాయి. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో సునీల్–బిగ్ బాస్ కౌశల్‌తో ‘అతడు ఆమె ప్రియుడు’ నిర్మించాను. యండమూరి కథతో వర్మ డైరెక్షన్లో ‘తులసి తీర్థం’ త్వరలో మొదలు కానుంది. అలాగే రాఘవేంద్రరావు డైరెక్షన్లో నిర్మించనున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శ్రీవల్లి కళ్యాణం’ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు. -
యువ హీరోతో సినిమా
తెలుగు తెరపై దర్శకుడు వంశీది ఓ విభిన్నమైన సంతకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి చిత్రాన్ని ఆస్వాదించే అభిమానగణం ఉంది. తాజాగా వంశీ ఓ యువ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీతో సినిమా చేయాలన్నది తన చిరకాల కోరిక అని, పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత చెప్పారు.