breaking news
bhagmati movie
-
దుర్గావతి కాదు దుర్గామతి
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భాగమతి’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్. అశోక్ జి. దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అయింది. అనుష్క పోషించిన పాత్రలో భూమి ఫెడ్నేకర్ నటించారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశోక్ ఈ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఇది వరకు ‘దుర్గావతి’ అని టైటిల్ పెట్టారు. తాజాగా ‘దుర్గామతి: ది మిత్’గా మార్చారు. అలాగే ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతల్లో ఒకరైన అక్షయ్ కుమార్. డిసెంబర్ 11న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
టాప్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
చెన్నై: ‘ఇప్పటి దాకా చాలా సహనం పాటించాను. ఇక ఉపేక్షించేది లేదు.. గాసిప్స్ పుట్టించే వారిపై ఇక చర్యలు తప్పవ’ని అంటోంది అగ్ర కథానాయకి అనుష్క. ఆ ముద్దుగుమ్మ గురించి ఇది వరకే చాలా గాసిప్స్ షికార్లు చేశాయి. అయితే బాహుబలి 2 చిత్రం తరువాత అనుష్కపై వదంతుల పర్వం మోతాదు మించిందనే చెప్పాలి. ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే ప్రభాస్ ఇంట్లో అనుష్కను కోడలిగా అంగీకరించడం లేదన్న ఊహాగానాలు కోకొల్లలుగా ప్రచారం చేశారు. అన్నిటికీ మౌనం పాటిస్తూ వచ్చిన అనుష్క ఇక లాభం లేదని భావించి.. ‘నేను, ప్రభాస్ హిట్ పెయిర్. అయితే పర్సనల్‌గా మా మధ్య ఉన్నది స్నేహమే..’ అంటూ కుండబద్దలు కొట్టారు. అయినా ఈ జంటపై వదంతుల ప్రవాహం ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఈ స్వీటీ ఇక లాభం లేదనుకుందో ఏమో తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇకనైనా గాసిప్స్‌కు పుల్‌స్టాప్ పడుతుందో, లేదో చూడాలి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.