breaking news
Bhagirath
-
కాటేసిన కలుషిత నీరు
ఇండోర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ చెప్పారు.మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్ మేయర్ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్ జిల్లాలోని జలూద్ నుంచి పైప్‌లైన్ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు. -
మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది
సమాజానికి ఎప్పుడూ మంచే చేసేవాడు.. తన గ్రహపాటు బాగుండక ఓ పొరపాటు చేస్తే... అంతవరకూ చేసిన మంచి అంతా హుష్ పటాక్ అయిపోతుంది. ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి తన వంతు కృషి చేస్తున్నారు ఆమిర్. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. అయితే... ఇటీవల ఆయన విషయంలో ఓ పొరపాటు దొర్లింది. దాంతో నిందల్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళ్తే- ‘సత్యమేవ జయతే’ షోలో భాగంగా బీహార్‌లోని ఓ పల్లెటూరికి వెళ్లారు ఆమిర్. అక్కడ భగీరథ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిశారు. భగీరథది చాలా బీద కుటుంబం. అతని భార్య పేరు బసంతీదేవి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం తయారు చేయడం ఈ దంపతుల పని. ఓ వైపు ఆర్థిక బాధలు, మరో వైపు బసంతీదేవి ఆనారోగ్యం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇదంతా దగ్గరుండి తెలుసుకున్నారు ఆమిర్. ‘మీ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాను’ అని భగీరథకు మాటిచ్చేశారు. త్వరలోనే తన మనుషులు కొంతమంది మిమ్మల్ని కలుస్తారని, మీ ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో... వాటన్నింటినీ తొలగించి, మీకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా సమకూరుస్తారని ఆమిర్ మాటివ్వడంతో భగీరథ కుటుంబం ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. కట్ చేస్తే... రోజులు గడిచిపోతున్నాయి. ఆమిర్ దగ్గర్నుంచి ఎవ్వరూ భగీరథను కలవడానికి రాలేదు. ఓ వైపు బసంతీదేవి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమీర్ నుంచి మాత్రం ఎలాంటి వర్తమానం లేదు. బసంతీదేవి పరిస్థితి విషమించి, చివరకు ఆమె చనిపోయింది. తన భార్యకు అంతిమ సంస్కారం చేయడానికి కూడా భగీరథ దగ్గర డబ్బుల్లేవు. చివరకు ఓ స్వచ్ఛంద సేవాసంస్థ అందించిన సాయంతో ఆంత్యక్రియలు పూర్తి చేశాడు భగీరథ. ‘‘ఆమీర్ సకాలంలో సాయం అందించి ఉంటే... నా భార్య నాకు దక్కేది. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు’’ అని బాహాటంగా విమర్శలు గుప్పించాడు భగీరథ. నిజానికి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్లో తిరుగులేని సూపర్‌స్టార్. క్షణం తీరిక లేని జీవితం ఆయనది. అంత బిజీలో కూడా సమాజానికి ఏదైనా చేయాలనే దృక్పధం ఆమిర్‌లో కనిపిస్తుంది. దానికి ఉదాహరణే ‘సత్యమేవ జయతే’. దాని ద్వారా ఎందరినో ఆదుకున్నారాయన. అంత చేసినా... మరపు వల్ల తాను చేసిన ఓ చిన్న పొరపాటు ఆయనకు ఈ మచ్చను తెచ్చిపెట్టింది. పాపం ఆమిర్.


