Bhabanipur
-
బెంగాల్ లో TMCకి గట్టి ఎదురుదెబ్బ
-
భవానీ పూర్ లో మమతా బెనర్జీ వెనుకంజ
-
టీ కొట్టు మూయించిన ‘చాయ్‌వాలా’.. మహువా సెటైర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ.. కోల్‌కతాలో ఓ ఆసక్తికరమైన రాజకీయ వివాదం రేగింది. అదే ప్రముఖ ‘బల్వంత్ సింగ్ చాయ్’ దుకాణం మూసివేత.. ఈ నేపద్యంలో ఇప్పుడు ‘చాయ్‌వాలా’ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరుగా మారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.మహువా మొయిత్రా ఘాటు విమర్శలుకోల్కతాలో ఏప్రిల్ 29న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ‘బల్వంత్ సింగ్ చాయ్’ దుకాణాన్ని రెండు రోజుల పాటు మూసివేశారు. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ, ‘చాయ్‌వాలా మనల్ని బల్వంత్ సింగ్ చాయ్ తాగకుండా ఆపినప్పుడే ఒక విషయం స్పష్టమైంది... కోల్‌కతాలోని ప్రతి సీటులోనూ బీజేపీ ఓడిపోవడం ఖాయం’ అని ఆమె ఘాటుగా విమర్శించారు. When the Chaiwalla stops us drinking Balwant Singh’s Chai, one thing is sure - BJP losing each & every seat in Kolkata. pic.twitter.com/x2zhms8RO6— Mahua Moitra (@MahuaMoitra) April 28, 2026మహువా పంచుకున్న ఒక స్క్రీన్‌షాట్ ప్రకారం.. భవానీపూర్ ప్రాంతంలో ఉన్న ఈ టీ స్టాల్ పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల లోపు ఉండటంతో అధికారులు సెక్షన్ 144 విధించారు. దీనివల్ల బల్వంత్ సింగ్ ధాబా, వారి చాయ్ అండ్ సమోసా కంపెనీలు ఏప్రిల్ 28, 29 తేదీల్లో వినియోగదారులకు నేరుగా సేవలు అందించవు. కేవలం ఆన్లైన్ డెలివరీ ద్వారా మాత్రమే ఈ రెండ్రోజులు తమ వ్యాపారాన్ని కొనసాగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఉదయం పూట ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు నిబంధనల వల్ల నిర్మానుష్యంగా మారింది.భవానీపూర్‌లో భీకర పోరుకోల్కతా నడిబొడ్డున ఉన్న భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (నందిగ్రామ్‌లోనూ పోటీ చేస్తున్నారు) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భవానీపూర్‌తో పాటు మరో 141 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏప్రిల్ 23న 152 స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: గ్రౌండ్లో ప్రధాని మోదీ ‘కిక్’.. గ్యాంగ్‌టక్ షేక్! -
29న కోల్‌కతాలో బిగ్గెస్ట్ ఫైట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సత్యజిత్ రే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో ఉద్దండులకు నిలయమైన కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ‘భవానీపూర్’ నియోజకవర్గం ఇప్పుడు మహా సంగ్రామానికి వేదికగా మారింది. 2026, ఏప్రిల్ 29న జరగనున్న ఈ హై-వోల్టేజ్ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మాజీ ప్రియ శిష్యుడు, ప్రస్తుత బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి మధ్య భీకర పోరు జరగనుంది. బెంగాల్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ స్థానంలో గెలుపు ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది.చారిత్రక వారసత్వం.. ఉద్దండుల నిలయందక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గానికి రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశబంధు చిత్తరంజన్ దాస్, విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే, దిగ్గజ ఫిల్మ్ మేకర్స్ సత్యజిత్ రే, మృణాల్ సేన్, నటుడు ఉత్తమ్ కుమార్, గాయకుడు హేమంత్ కుమార్ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే నివసించారు. ఈ ప్రతిష్టాత్మక స్థానం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకర పోరుకు సాక్ష్యంగా నిలవనుంది. కాళీఘాట్ ఆలయం, గురుద్వారాలు, మసీదులు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలతో కూడిన ఈ ప్రాంతం భిన్న సంస్కృతులకు సజీవ ప్రతీకగా నిలిచింది.సొంత గడ్డపై ‘దీదీ’ వర్సెస్ ‘బయటి వ్యక్తి’2011 నుంచి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్న మమతా బెనర్జీ ఇక్కడి హరీష్ ఛటర్జీ వీధిలోనే నివసిస్తున్నారు. స్థానిక అశుతోష్ కళాశాలలో చదువుకున్న ఆమె కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితురాలు. ప్రచారంలో భాగంగా ఆమె తనకు తెలిసిన పాత పరిచయస్థులను పలకరిస్తూ, వీధుల్లో కలియతిరుగుతున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి వచ్చిన సువేందు అధికారి ఈ పాత కోల్‌కతా ప్రాంతంలో ‘బయటి వ్యక్తి’ అనే ముద్రను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఆయన దీదీని ఓడిస్తే, రాష్ట్రంలో బీజేపీ వెతుకుతున్న తిరుగులేని నాయకునిగా ఆయన అవతరిస్తారు.మమత ఓడిపోయే అవకాశం ఉందా?ఈసారి ఎన్నికల వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు అంటున్నారు. ‘మమత ఇక్కడి నుంచి ఎప్పటికీ ఓడిపోరు. కానీ తొలిసారిగా నాన్-బెంగాలీ ప్రాంతాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బహిరంగ చర్చలు జరుగుతున్నాయి’ అని అదితి సర్కార్ అనే స్థానికురాలు అభిప్రాయపడ్డారు. అయితే మమత విద్యార్థి దశ నుంచి సాగిస్తున్న పోరాటాలను చూస్తున్నామని, ఆమె తమ ప్రాంతపు ఆడపడుచే అని స్థానిక కేఫ్ నిర్వాహకుడు అమోల్ సగర్వంగా చెబుతున్నారు. ఎవరి ధీమా వారికున్నా.. ఉత్కంఠ మాత్రం తారాస్థాయికి చేరుకుంది.కీలక సమస్యలు.. వ్యాపారుల ఆందోళనసరిహద్దు చొరబాట్లు, ఆర్జీ కర్ ఉదంతం, రాష్ట్ర ఆర్థిక మందగమనం లాంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. 1953లో కచ్ నుంచి వలస వచ్చిన వ్యాపారి భరత్ మెహతా మాట్లాడుతూ.. ‘భవానీపూర్‌లో గెలవడం మమతకు ప్రతిష్టాత్మక సమస్య. సువేందు ఇక్కడ పోటీ చేసి తప్పు చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల మమత మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం వల్ల బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌లకు ఇప్పటికే చాలా మంది వ్యాపారులు వలస వెళ్లిపోతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానికత వర్సెస్ వలసదారుల విభజనఈ ఎన్నికల్లో బెంగాలీ, నాన్-బెంగాలీ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలకు బెంగాల్ సురక్షితమైన ప్రాంతమని యువ ఓటరు, బ్యాంకర్ కరబి ఘోష్ బలంగా విశ్వసిస్తున్నారు. మమతా దీదీ తమకు ఎంతో సాయం చేశారని, తమ గురుద్వారాను సైతం సందర్శించారని ట్యాక్సీ డ్రైవర్ సుఖ్విందర్ సింగ్ కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. కానీ బీహార్‌కు చెందిన మరో ట్యాక్సీ డ్రైవర్ రతన్ కుమార్ మాత్రం.. ‘మేము గతంలో తృణమూల్‌కే ఓటేశాం, కానీ ఈసారి ప్రజలు ‘పరివర్తన్’ (మార్పు) కోరుకుంటున్నారు’ అని అన్నారు.ఎన్నికల జ్వరంతో నిద్రలేని రాత్రులుపోలింగ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో భవానీపూర్ వీధులన్నీ రాజకీయ వేడితో మరింత హీటెక్కిపోతున్నాయి. పగటి ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టీఎంసీ, బీజేపీ నాయకులు రాత్రి వేళల్లో సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాషాయ జెండాలతో సువేందు వర్గం, తమదైన శైలిలో దీదీ వర్గం ప్రచారాలు హోరెత్తిస్తుండటంతో ఈ ప్రాంతమంతా అర్ధరాత్రి వరకు కోలాహలంగా ఉంటోంది.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్‌లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్‌లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్‌కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్‌లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. నందిగ్రామ్ నుంచే కాదు భవానీపూర్‌లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు. కాళీఘాట్ వద్ద హైటెన్షన్. బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్‌లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
సిట్టింగ్‌లకు టీఎంసీ షాక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా భారీ మార్పులకు తెరతీసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ మొత్తం ఎమ్మెల్యేల్లో మూడోవంతు మంది, 74 మందికి మొండి చేయి చూపింది. వరుసగా నాలుగోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలని లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ..ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో మంగళవారం విడుదల చేశారు. డార్జిలింగ్ హిల్స్‌లోని మిగతా మూడు స్థానాలను మిత్రపక్షమైన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాకు వదిలిపెట్టారు.ముఖ్యంగా భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారిని నేరుగా ఢీకొనబోతున్నారు. 2007లో టాటా కంపెనీ భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన మమతా బెనర్జీ చేపట్టిన ఉద్యమానికి కేంద్రస్థానంగా నందిగ్రామ్ ఉంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ మమతను సువేందు అధికారి 1,900 స్వల్ప ఓట్ల తేడాతో ఓడించారు. అనంతరం భవానీపూర్ నియోజ కవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మమత 58 వేల మెజారిటీతో గెలిచారు. తాజాగా, నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లోనూ బీజేపీ నేత సువేందు పోటీకి దిగుతుండటం తెల్సిందే. దీంతో వీరిద్దరూ మళ్లీభవానీపూర్ వేదికగా ఢీకొననున్నారు. టీఎంసీకి ప్రస్తుతమున్న 224 మంది ఎమ్మెల్యేలకు గాను 135 మందికి మళ్లీ టికెట్ దక్కింది. వీరిలో 15 మందికి మాత్రం సీట్లను మార్చారు. 74 మందికి మొండిచేయి చూపారు. జాబితాలో 52 మంది మహిళలతోపాటు పిర్హాద్ హకీం, అనూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్య, తదితర మంత్రులు కూడా ఉన్నారు. బీజేపీ కోసమే ఈసీ బదిలీలు: మమతఅభ్యర్థుల జాబితా విడుదల అనంతరం ప్రసంగించిన సీఎం మమత ఎన్నికల కమిషన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ ఉన్న ఫళంగా బదిలీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈసీ ఈ బదిలీలన్నిటినీ కేంద్రంలోని బీజేపీ కోసమే చేసిందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో బదిలీల జాబితా తయారు కాగా, ఆ మేరకు ఈసీ అమలు పర్చిందని మమత విమర్శించారు. రాష్ట్రంలోకి బీజేపీ డబ్బు, ఆయుధాలను నిరాటంకంగా తరలించేందుకే బదిలీలు చేపట్టారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో బీజేపీకి సాయపడేలా రాష్ట్రం వెలుపలి నుంచి కూడా కొందరు అధికారులను తీసుకువచ్చారన్నారు. బీజేపీ తరపున తమాషా ఆట ఆడుతున్న ఈసీ నేరుగా బీజేపీ తరపునే ప్రచారం చేసుకోవచ్చు కదా అంటూ మమత ఎద్దేవా చేశారు. -
అక్టోబరు 7న ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ప్రమాణం
కోల్‌కతా: భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సీఎం మమతా మంగళవారం గవర్నర్ జగదీప్ ధన్కర్కు లేఖ రాశారు. అక్టోబరు 3న విడుదలైన భవానీపూర్, జంగీపూర్, షంషేగంజ్ ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. ప్రియాంక టిబ్రేవాల్‌కు 26,428 ఓట్లు సాధించింది. ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్‌ఖేరీ ఘటనను టీఎంసీ ఖండించింది. విపక్షనేతలు.. రైతులను పరామర్శించకుండా అడ్డుకోవడంపై ఛటర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Bhabanipur Bypoll: భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం -
భవానీపూర్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్: భవానీపూర్ ఉపఎన్నికలలో తృణముల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన భవానీపూర్ ఓటర్లకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నందిగ్రామ్‌లో ఓడించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో.. బీజీపీ ప్రభుత్వం తరచు వివాదాలను సృష్టించిందని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని మమత మండిపడ్డారు. భవానీపూర్‌లో.. తాను బరిలో దిగకుండా బీజీపీ అనేక కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీమెజార్టీతో గెలిపించారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఎన్నికలను నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం మమత అన్నారు. చదవండి: Mamata Banerjee: భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం
కోల్‌కతా: భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం
భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి 21వ రౌండ్ వరకూ మమత స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతాకు 84,709 ఓట్లు రాగా, ప్రియాంక టిబ్రీవాల్కు 26,320 ఓట్లు వచ్చాయి. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ►19 రౌండ్లు ముగిసేసరికి మమత 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►11 రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 34వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►11వ రౌండ్ ముగిసే సమయానికి మమతకు 45,874 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు 11,892 ఓట్లు వచ్చాయి. ►బెంగాల్లో ఉపఎన్నిక జరుగుతున్న మరో రెండు చోట్ల జంగీపుర్, సంషేర్‌గంజ్ స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 25వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ► నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 14,435 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై మమత 6,146 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►భవానీపూర్ అసెంబ్లీ నియోజకరవర్గ ఉపఎన్నికలో మమతా బెనర్జీ 2,799 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సెప్టెంబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నికలో మమతపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక పోటీలో ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
అప్డేట్స్ ► భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6.30గంటల వరకు 60 శాతంపైగా పోలింగ్ శాతం నమోదైంది. ►ఉదయం 11 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 21.73 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 11 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 40.23 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 11 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 36.11 శాతం ఓటింగ్ నమోదు. ఉదయం 9 గంటలు ► ఉదయం 9 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 7.57 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 9 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 17.51 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 9 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 16.32 శాతం ఓటింగ్ నమోదు. ► భవనీపూర్‌లో ఓటర్లకు శానిటైజర్లు, గ్లోవ్స్ పంపిణీ చేస్తున్న ఈసీ ► భబానీపూర్‌లోని మిత్రా ఇన్స్టిట్యూషన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కను వినియోగించుకున్న 90 ఏళ్ల మనోభాషిణి చక్రవర్తి. #WestBengalBypolls | 90-year-old Manobashini Chakrabarty casts her vote at Mitra Institution polling booth in Bhabanipur pic.twitter.com/mMiAbWOoPx — ANI (@ANI) September 30, 2021 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలిగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భవానీపూర్‌తోపాటు జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ! ఇక భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. ఉప ఎన్నిక ఫలితాలు అక్టోబరు 3న వెల్లడికానున్నాయి. కాగా భవానీపూర్‌లో మమతకి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా ..బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా మమతా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో దీదీ పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో కూడా మమత.. భవానీపూర్ నుంచే గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలిచి.. సీఎంగా కొనసాగాలనుకుంటున్నారు. -
కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్ కిషోర్.. పక్కా ప్లాన్‌తోనేనా?!
కోల్‌కతా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రపోషించారు. ఆయన ఇదివరకు బీహార్‌లోని ససారాం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటరుగా ఉన్నారు. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్‌కిషోర్ తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. IUI0656683 ఎపిక్ నెంబర్‌తో ఉన్న నివాసం ఆయన శాశ్వత నివాసంగా చూపబడింది. నియోజకవర్గ పరిధిలోని రాణిశంకరి లేన్‌లోని బూత్ నెం-2222లో పోలింగ్ స్టేషన్ ఉంది. భవానీపూర్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో ప్రశాంత్ కిషోర్ కోల్‌కతాలో ఉండకుండా బయటకు తీసుకురావడానికి బీజేపీ ఎన్నికల కమిషన్ని బలవంతం చేయొచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. భవానీపూర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అడ్వయిజర్‌గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఓటరుగా నమోదు చేసుకోవడంపై బీజేపీ మీడియాసెల్ ఇన్చార్జ్ సప్తర్షి చౌదరి ఫైర్ అయ్యారు. 'చివరికి బహిరాగాటో (బయటివ్యక్తి) భవానీపూర్ ఓటర్ అయ్యారు. కాబట్టి, బెంగాల్ కుమార్తె ఇప్పుడు బహిరాగాటో (బయటి) ఓటర్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) కిషోర్‌ను భవానీపూర్ ఓటర్ జాబితాలో చేరడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలుసుకున్నారు. దీంతో అతను కాంగ్రెస్‌లో చేరవచ్చు అనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అయితే ఆయన పార్టీలో చేరే నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని పార్టీ వర్గాలు సూచించాయి. ప్రశాంత్ కిషోర్ మొదట్లో 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీ(యు)లో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వేదికను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అతను పంజాబ్‌లో పార్టీ విజయానికి తోడ్పాటునందించాడు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారుగా ఉంటూ, అతను ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు)


