breaking news
Betel nut
-
సనత్ ఇదేం పని..
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, మరో ఇద్దరు క్రికెటర్లు భారత్‌కు కుళ్లిన వక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయని దైనిక్ భాస్కర్ వెల్లడించింది. నాగపూర్‌లో రూ కోట్లు విలువైన ముడి వక్కలను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అక్రమ దందాలో జయసూర్య పేరు వెలుగులోకి వచ్చిందని ఆ కథనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారించేందుకు జయసూర్యను రెవిన్యూ ఇంటెలిజెన్స్ బృందం ముంబైకి పిలిపించినట్టు సమాచారం. అధికారుల కళ్లుగప్పి సాగిన ఈ అక్రమ దందాలో మరో ఇద్దరు క్రికెటర్ల ప్రమేయం ఉన్నా వారి పేర్లు ఇంకా వెల్లడికాలేదని తెలిసింది. డిసెంబర్ 2న జరిగే విచారణకు వారు హాజరయ్యే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ కథనం తెలిపింది. ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తరలించిన వక్కలను తర్వాత వారు భారత్‌కు చేరవేస్తున్నారని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. దక్షిణాసియా స్వేచ్ఛా వర్తక ప్రాంత చట్టాన్ని ఆసరాగా చేసుకుని మాజీ క్రికెటర్లు డమ్మీ కంపెనీలతో అక్రమ లావాదేవీలు సాగించినట్టు సమాచారం. ఈ చట్టం ప్రకారం భారత్, శ్రీలంకల మధ్య దేశీయంగా రూపొందే ఉత్పత్తుల పన్ను రహిత రవాణాకు అనుమతిస్తారు. మాజీ క్రికెటర్లు తమకున్న పలుకుబడితో డమ్మీ కంపెనీల ద్వారా శ్రీలంక అధికారుల నుంచి ట్రేడ్, ఎగుమతి లైసెన్సులు పొంది, వక్కలను శ్రీలంకలోనే తయారైనట్టు నకిలీ పత్రాలు రూపొందించి సరుకును భారత్‌కు తరలిస్తున్నట్టు ఈ కథనం పేర్కొంది. -
తమలపాకుల ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: తమలపాకులు - 2, కొబ్బరి నూనె - 1 టీ స్పూన్, శనగపిండి - అర టీ స్పూన్ తయారీ: ముందుగా తమలపాకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి నూనె, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌తో రోజులో ఎప్పుడో ఒకసారి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. క్రమం తప్పకుండా అలా చేస్తే మొటిమలు, నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి. అంతేకాదు, ముఖం మునుపటి కంటే ఎక్కువగా నిగారిస్తుంది. * ఈ తమలపాకుల్లోని యాంటీ బాక్టీరియల్ లక్షణం ముఖంపై వచ్చే మొటిమలను నివారిస్తుంది. అలాగే కాలిన గాయాలను, వాటి ద్వారా ఏర్పడిన మచ్చలను త్వరగా తొలగించేందుకు తోడ్పడుతుంది. -
నల్ల మచ్చలకు చెక్..
బ్యూటిప్స్ రెండు తమలపాకులను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. రోజులో ఎప్పుడైనా ఒకసారి ఆ పేస్ట్‌ను నల్లమచ్చలపై స్క్రబ్ చేయాలి. క్రమం తప్పకుండా అలా చేస్తే నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి. తేయాకును రాత్రంతా పాలలో నానబెడ్డండి. అవి దొరక్కపోతే నాణ్యమైన టీ పొడినైనా తీసుకోండి. ఉదయం లేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని మర్దన చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. ఈ నల్ల మచ్చలు పోవాలంటే మరో చిన్న చిట్కా ఉంది. అదేమిటంటే రోజూ ముఖానికి పసుపుకు కొద్దిగా గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక పాలతో కానీ గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
మొటిమలు మాయం కావాలంటే
కొన్ని తమలపాకులను మెత్తగా దంచి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మొటిమలు మటుమాయం.ముఖంపై నల్లమచ్చలు తొలగిపోవడానికి తేయాకు తైలం బాగా పని చేస్తుంది. అందుకు రెండు టీస్పూన్ల టీ పొడిని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టాలి. ఉదయమే ఆ నానిన ఆకులతో నల్లమచ్చలపై ఓ నిమిషం పాటు రుద్దాలి. తర్వాత ఆ పాలతో ముఖాన్ని కడుక్కుంటే మచ్చలు పోతాయి.మోచేతులు, మోకాళ్లు నల్లగా గరుగ్గా ఉండటం సహజం. ఆ నల్లటి మరకలను పోగొట్టుకునేందుకు అనాస పండు గుజ్జును వాటిపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తర్వాత అదే గుజ్జుతో మర్దన చేసి చల్లటి నీటితో కడిగేసుకోండి. -
సర్వం కల్తీమయం
ఆదిలాబాద్ రిమ్స్ : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. మార్కెట్లో లభించే ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. తినే తిండిలో.. తాగే పాలల్లో.. వాడే దినుసుల్లో.. ఇలా.. సర్వం కల్తీమయమే. కళ్లకు కనిపించని విధంగా కల్తీ చేస్తున్నారు. దీంతో మార్కెట్లో లభించే వస్తువుల్లో ఏది స్వచ్ఛమైనదో చెప్పలేని పరిస్థితి ఉంది. కొందరు వ్యాపారులు లాభాపేక్ష కోసం పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పదార్థం వ్యక్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపే ప్రమాదముంది. అయితే కొంత అప్రమత్తత, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కల్తీని గుర్తించడం సాధ్యమే. ఇలా చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా.. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కల్తీ జరిగే వస్తువులు, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు, కల్తీని గుర్తించే విధానంపై కథనం.. నూనెలు.. కొబ్బరి నూనెలో ఆముదం కలిపి కల్తీ చేస్తారు. ఆముదం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. కానీ.. కొబ్బరి నూనె కంటే ఆముదం ధర తక్కువ ఉండడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గుర్తించడం ఇలా.. : ప్రయోగశాలల్లో అయితే రసాయనాలతో పరీక్షిస్తారు. అదే ఇంటి దగ్గరైతే చేతితో పట్టుకున్నప్పుడు బాగా జిడ్డుగా ఉన్నట్లయితే ఆముదం కలిపినట్లుగా గురించొచ్చు. కారం.. కారం ఎర్రగా ఆకర్షణీయంగా ఉండడానికి కొన్ని రకాల రంగులు కలుపుతారు. రంపపు పొట్టుతోనూ కల్తీ చేస్తారు. దీనివల్ల ఎలర్జీ, నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక కూర పొడుల్లోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నారు. ధనియాల పొడిలో ఎక్కువ ఉప్పు కలుపుతారు. గుర్తించడం ఇలా.. : రెండు గాజు పాత్రల్లో నీళ్లు తీసుకుని కారం, ధనియాల పొడిని చెంచా చొప్పున వేయాలి. కల్తీ జరిగి ఉంటే రంపం పొట్టు నీటిపై తేలుతుంది. ఇటుక పొడి వంటివి అడుగున పేరుకుంటాయి. ఇలా కాకుండా నీటిలో కలిసిపోతే అవి స్వచ్ఛమైనవని గుర్తించాలి. నెయ్యి.. స్వచ్ఛమైనదని మురిసిపోతూ మనం తెచ్చుకునే నెయ్యిలో ఎక్కువ భాగం వనస్పతి కలుపుతున్నారు. వనస్పతి వంటి నెయ్యి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుర్తించడం ఇలా.. : ఐదు మిల్లీలీటర్ల నెయ్యిలో 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోమిక్ ఆమ్లం కలపండి. కొద్దిగా చక్కెర చేర్చండి. అప్పుడు నెయ్యి ఇటుక రంగులోకి, ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే. కాఫీ పొడి.. కాఫీ పొడిలో సాధారణంగా వేయించిన ఈత గింజల పొడి, చింత గింజల పొడి కలిపి కల్తీ చేస్తుంటారు. గుర్తించడం ఇలా..: కొంచెం కాఫీ పౌడర్‌ను నీళ్లలో వేస్తే.. మంచిదైతే పైన తేలుతుంది. లేదంటే అడుగున పేరుకుపోతుంది. కందిపప్పులో కేసరి.. కందిపప్పులో కేసరి పప్పు (లంకపప్పు ) కలిపి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ పప్పును ఆహారంగా తీసుకోవడం ద్వారా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కందిపప్పులో కలిపే గడ్డిశెనగ పప్పు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. గుర్తించడం ఇలా.. : కొద్దిగా కందిపప్పు తీసుకొని నీళ్లలో పది నిమిషాలు ఉంచాలి. నీరు రంగు మారితే కల్తీ జరిగినట్లే. తేనె.. మార్కెట్లో సీలు లేకుండా పెద్దపెద్ద సీసాల్లో తేనె అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా బెల్లం పానకమే ఉండే అవకాశం ఉంది. గుర్తించడం ఇలా.. : ముందుగా శుభ్రమైన వస్త్రం ముక్కను మీరు కొన్న తేనెలో కలిపి అగ్గిపుల్లతో వెలిగించండి. స్వచ్ఛమైన తేనె అయితే మంట పెరుగుతుంది. లేదంటే కొంచెం కాలిన తర్వాత ఆరిపోతుంది. లేదా గాజు పాత్రలో నీళ్లు తీసుకొని అందులో చెంచా తేనె వేయండి. పాకం అయితే కరిగిపోయి నీటి రంగులోకి మారుతుంది. అదే స్వచ్ఛమైన తేనె అయితే వేసినచోటే అలా ముద్దలా ఉండిపోతుంది. పాలు.. పాలు చిక్కగా కనిపించడం కోసం బియ్యం పిండి గంజి కలుపుతారు. ఇలా చేస్తే చూడడానికి చిక్కగా ఉంటాయి. ఆరోగ్యపరంగా నష్టం కలగకపోయినా ఆర్థికంగా నష్టమే. ఇలా గుర్తించాలి..: చిన్న పాత్రలో కాచి చల్లార్చిన పాలు తీసుకుని దానికి నాలుగైదు చుక్కల అయోడిన్ కలపాలి. అప్పుడు పాలు నీలి రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే. చక్కెర.. చక్కెరలో ఎక్కువ బొంబాయి రవ్వ కలిపి కల్తీ చేస్తారు. గుర్తించడం ఇలా.. : పాలు లేదా నీళ్లలో చెంచా చక్కెర వేయాలి. అందులో రవ్వ కలిపి ఉంటే అడుగున తెల్లని పొర ఏర్పడుతుంది. కోవా, జున్ను, పాలపొడి.. కోవా, జున్నుల్లో బియ్యం పిండితో కల్తీచేస్తారు. పాల పొడిలోనూ బియ్యం పిండి కలుపుతారు. గుర్తించడం ఇలా..: కొద్దిగా జున్ను తీసుకుని అయోడిన్ కలపాలి. నీలం రంగు కనిపిస్తే అందులో బియ్యం పిండి కలిపినట్లే. వక్కపొడి.. వక్కపొడిలో రంపపు పొట్టు కలుపుతారు. వీటికి ముదురు రంగలనూ కలుపుతారు. గుర్తించడం ఇలా..: కొద్దిగా వక్కపొడి చేతిలో తీసుకుని గట్టిగా నలిపితే రంగు అంటుకుంటే కల్తీ జరిగిందని భావించాలి. లేదా నీటిలో వేసి చూసినా రంగు వెంటనే కరిగిపోతుంది. నీళ్ల రంగు మారుతుంది.