breaking news
beggers mafia
-
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్‌కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్‌కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్‌ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్‌లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్‌కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్‌వర్క్‌ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. -
రిచ్ బెగ్గర్ భరత్ జైన్.. నెల సంపాదన ఎంతంటే?
మాఫియా తెలుసు.. ముష్టియా తెలుసా... అంటాడు ఆలీ ఓ సినిమాలో.. ఆయన చిటికేస్తే వందమంది బిచ్చగాళ్ల బిలబిలమంటూ వస్తారు. రూపాయి గట్రా ఇస్తే తీసుకోడు.. ఓన్లీ కరెన్సీ నోట్లు మాత్రమే బొచ్చెలో వేయాలి. హార్లిక్స్ మాత్రమే తాగుతాడు.. ఆరోగ్యం కోసం అంత జాగ్రత్త మరి. బిచ్చగాళ్ళు అంటే అందరికీ లోకువే. బిచ్చగాడు అంటే డబ్బులు లేని వాళ్ళని అనుకోకండి. ముంబై కి చెందిన భారత్ జైన్ అనే ఓ బిచ్చగాడు మహా రిచ్.. రిచ్ అంటే అలాంటి ఇలాంటి రిచ్ కాదమ్మా.. కోటీశ్వరుడు.. అక్షరాల రూ.7.50 కోట్ల ఆస్తులు.. షాపులు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన రోజువారి సంపాదన రెండున్నర వేల పైనే. నెలకు 75000 సంపాదిస్తాడు. అంటే దాదాపుగా ఓ ఐటీ ఉద్యోగి సంపాదన అంత.. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ జీతం అంత ఉంటుంది ఈ బెగ్గర్ గారి ఆదాయంఆరోజు తాను తిరిగిన ప్రాంతం.. జనంలో ఉన్న దాతృత్వపు లక్షణాన్ని బట్టి తన ఆదాయంలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయని ఆయన అంటున్నారు. బాల్యం నుంచే ఇదే వృత్తిని నమ్ముకున్న ఈ 54 ఏళ్ల భరత్ జైన్ ముంబై లోని చత్రపతి శివాజీ టెర్మినస్, అజాద్ మైదాన్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం యాచిస్తూ తిరుగుతుంటారు. రోజులో 10-12 గంటలు ఈ పనిలో ఉంటూ ఒక్కోరోజు 4000 వరకూ సంపాదిస్తారట. ఇన్నేళ్ల సంపాదనతో వచ్చిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారు.రూ.1.4 కోట్లతో ముంబాయిలో రెండు ఫ్లాట్స్ కొన్నారు. తండ్రి, తమ్ముడు, భార్య, ఇద్దరు పిల్లలతో సొంత ఫ్లాట్ లో విలాసంగా బతికే బెగ్గర్ గారికి రెండు దుకాణాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తున్నాయి. పేదరికం కారణంగా తాను సరిగా చదువుకోలేకపోయినా తన ఇద్దరు బిడ్డలను మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. భవిష్యత్తు కోసం ఇంకొన్నాళ్ళు ఇదే వృత్తిలో ఉంటానని అంటున్నారు.ఇదే సమయంలో తనకు ఆశ.. దురాశ లేదని.. పిసినారిని కూడా కానని చెప్పిన జైన్ అప్పుడప్పుడు గుళ్లలో దానాలు.. విరాళాలు కూడా ఇస్తుంటానని అన్నారు. దేశంలో మొత్తం 4,13,670 మంది బిచ్చగాళ్ల ఉన్నట్లు జనగణనలో తేలింది. జైన్‌తో పాటు సంభాజి కాలే రూ.1.5 కోట్ల ఆస్తులు.. లక్ష్మి దాస్ రూ.1 కోటి ఆస్తులతో బిచ్చగాళ్లలో రిచ్చు గాళ్ళుగా రికార్డు సాధించారు. సో.. బిచ్చగాళ్లను తేలికగా చూడకండి. వాళ్ళు మీకన్నా రిచ్చు గాళ్ళు కూడా కావచ్చు. -సిమ్మాదిరప్పన్న. -
బిచ్చగాళ్ల మాఫియా లేదు: కమిషనర్
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియాపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేష్‌కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల మాఫియా లేదని ఆయన అందులో తెలిపారు. వీధుల్లో, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బిచ్చం ఎత్తుకుంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అన్నారు. బిచ్చగాళ్లకు పునరావాసం కోసం కార్పొరేషన్ చేపడుతున్న చర్యలను కోర్టుకు తెలిపారు. 'గౌరవం' పేరుతో వారికి కేంద్రాలు ఏర్పాటుచేసి, జీవనోపాధి మార్గాలను కూడా అందజేస్తున్నామన్నారు.


