-
బజ్జీలు వేస్తే... మేఘాలు ఏర్పడతాయా?
బజ్జీలకూ.. మేఘాలకు లింకేమిటబ్బా? ఇదెలా సాధ్యం?... ఇవేగా మీ డౌట్స్! ఒక్క నిమిషమాగితే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక్క బజ్జీలేమిటి.. నూనెలో వేయించే ప్రతి వంటకంతోనూ నగరాల్లో మేఘాలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు యూరోపియన్ శాస్త్రవేత్తలు. నూనెలో ఉండే ట్రైగిజరైడ్ కొవ్వు పదార్థాలు వాతావరణంలోని కణాల చూట్టూ చేరిపోవడం వల్ల ఇలా జరుగుతోందని వీరు అంటున్నారు. ట్రైగిజరైడ్లు అంటుకోవడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి కణాలు ఎక్కువ తేమను ఆకర్శించగలవని.. ఎక్కువ దూరం ప్రయాణించగలవని.. తద్వారా అవి మేఘాలుగా ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయని అంచనా. ఇళ్లల్లో పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఎలాగైతే సోప్ పౌడర్‌కు మట్టి అంటుకుంటందో.. అలాగన్నమాట. లండన్ నగరంలో ప్రతిరోజూ వాతావరణంలోకి చేరే అతిసూక్ష్మ కణాల్లో కనీసం పదిశాతం ఇలా బాగా వేయించిన వంటనూనెల నుంచి వెలువడ్డవేనని అందుకే ఈ నగరంపై మేఘాలు ఎక్కువ ఉంటున్నాయని బాత్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అడమ్ స్కైర్స్ అంటున్నారు. అయితే తాము ల్యాబ్‌లో చేసిన పరిశోధనకు, వాస్తవ పరిస్థితికి మధ్య తేడా ఉండవచ్చునని. ఎంత మోతాదులో ట్రైగిజరైడ్ కొవ్వులు విడుదలైతే మేఘాలు ఎక్కువ అవుతాయన్న కచ్చితమైన అంచనాలకు మరిన్ని పరిశోధనలు అవసరమని ఆడమ్ చెప్పారు. -
చెంచాడు చక్కెర చాలు...
పరిపరి శోధన క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారా..? గెలుపు కోసం కఠోర సాధనే కాకుండా, నానా తంటాలు పడుతూనే ఉంటారు లెండి. శక్తినిచ్చే సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింకులతో గెలుపు బాటలో సాగిపోగలమనే ధీమా పెంచుకునే ఉంటారు లెండి. అయితే, ఎనర్జీ డ్రింకులు క్రీడా పోటీల్లో విజయానికి ఏమంత భరోసా ఇవ్వలేవని, వాటి బదులు ఒక చెంచాడు చక్కెర తీసుకుంటే చాలు, ఎలాంటి క్రీడా పోటీల్లోనైనా గెలుపు బాటలో దూసుకుపోవచ్చని బాత్ వర్సిటీ పరిశోధకులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా విపరీతంగా శక్తిని ఖర్చు చేయాల్సి వచ్చే పరుగు పోటీలు, సైకిల్ రేసుల వంటి వాటిలో పాల్గొనేవారు ఎనర్జీ డ్రింకులను నమ్ముకోవడం కంటే, చెంచాడు చక్కెర తీసుకుంటే చాలు... వెంటనే శక్తి వచ్చి, సునాయాసంగా గెలుపు బావుటా ఎగరేయగలరని వారు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement