breaking news
based
-
బ్యూటీ విత్ ట్రెండ్ : డీఎన్ఏ ఆధారిత చికిత్సలు, కచ్చిత ఫలితాలు
టీనేజ్ మొదలు పండు ముసలి వరకూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని, నిత్య యవ్వనంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిళ్లు, రాత్రి షిఫ్ట్‌లలో విధులు, ఆహారం, లైఫ్ స్టైయిల్, వాతావరణ పరిస్థితుల్లో అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఖరీదైన బట్టలు, ఫ్యాషన్లుక్ ఉండే ఆభరణాలు ధరించినా ముఖ సౌందర్యం చాలా ముఖ్యం. మగవారిని ప్రధానంగా వేధిస్తున్న జుట్టు సమస్య, మహిళల్లో మొటిమలు, హార్మోన్ సమస్యలు కుంగదీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇటువంటి వారి కోసం ఇప్పటికే మార్కెట్లో పలు రకాల చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా డీఎన్ఏ ఆధారిత చికిత్సలకు భాగ్యనగరం వేదికగా మారింది. డీఎన్ఏ అనాలసిస్‌తో సమస్యకు కచి్చతమైన కారణాలను అన్వేషించడంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీ బ్యూరో ప్రతి వ్యక్తికీ డీఎన్ఏ యూనిక్‌గా ఉంటుంది. జీన్ అనాలసిస్ చేసి, ఆ ఫలితాల ఆధారంగా చికిత్సలు తీసుకునే కొత్త పద్దతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకే రకమైన సమస్యకు అందరికీ ఒకే రకమైన చికిత్సలు అందించడం మంచిది కాదు. ఫలితాల్లోనూ తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాలకు ప్రభావితం కావొద్దు. సౌందర్య రంగంలో అధునాతన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్స్ ఆధారంగా చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. ఖచ్చితత్వంతో పనిచేసే అవకాశం ఉంటుంది. – డా.రేఖా సింగ్, చర్మ సౌందర్య నిపుణురాలుహైదరాబాద్ వాసులు సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అందుకు తగ్గట్లే నగరంలో గల్లీకో బ్యూటీ పార్లర్, స్కిన్ కేర్, ఏస్తటిక్స్ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా డీఎన్ఏ ఆధారిత సౌందర్య కేంద్రాలు వెలుస్తున్నాయి. పురుషుల్లో అత్యధికంగా జుట్టు రాలే సమస్యలు కనిపిస్తున్నాయి. రెండు పదుల వయసులోనే జుట్టు రాలడం మొదలైపోతోంది. వివిధ రకాల నూనెలు, ఇతర థెరఫీలను ఆశ్రయిస్తున్నారు. మహిళల్లో ముఖంపై పింపుల్స్, మచ్చలు రావడం, చర్మ సమస్యలు వస్తున్నాయి. చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!బరువు పెరగడం, నిద్రలేమి, ఆహారం, వయసులో మార్పులు, హార్మోన్ సమస్యలు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీని వల్ల వ్యక్తుల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ దెబ్బతింటున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. డీఎన్ఏ ఆధారిత చికిత్సల్లో వ్యక్తుల లాలాజలం నుంచి నమూనా సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపిస్తాం. నివేదికలు రావడానికి సుమారు నాలుగు వారాలు పడుతుంది. బాడీకాంపొజిషన్ అనాలసిస్ (బీసీఏ) చేపట్టి, వ్యక్తి ఎత్తు, వయసు ఆధారంగా ఏ పరిమాణంలో ఉండాలి, ప్రస్తుతం ఎంత ఉందనేది నిర్ధారించుకుని, ఆపై నిపుణులైన డెర్మటాలజీ, న్యూట్రిషిన్లు పరంగా చికిత్సలు అందిస్తారు. -
రైలు నుంచి అగ్ని వర్షం
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఆరుదైన ఘనత సాధించింది. ఇంటర్మిడియెట్ రేంజ్ అగ్ని–ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. బుధవారం జరిగిన ఈ పరీక్షలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్ఎఫ్సీ) సైతం పాలుపంచుకుంది. అయితే, ఈ పరీక్ష ఎక్కడ చేపట్టారన్నది రక్షణ శాఖ బహిర్గతం చేయలేదు. స్థిరమైన ప్రదేశం నుంచి కాకుండా పట్టాలపై పరుగులు తీస్తున్న రైలు నుంచి మిస్సైల్‌ను పరీక్షించడం భారత క్షిపణి తయారీ రంగంలో ఒక కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు.క్షిపణులను దేశంలో ఎక్కడికైనా రైలులో సులభంగా తరలించే సామర్థ్యాన్ని భారత్ సాధించడం గమనార్హం. తదుపరి తరం అగ్ని–ప్రైమ్ మిస్సైల్ పరిధి 2,000 కిలోమీటర్లు. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. రైలు నెట్వర్క్ నుంచి ఆయుధ వ్యవస్థను ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ సైతం సగర్వంగా చేరిందని పేర్కొన్నారు.ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని–ప్రైమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించినట్లు స్పష్టంచేశారు. అతి తక్కువ సమయంలోనే మిస్సైల్‌ను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించి, ప్రయోగించే సత్తా మన సొంతమని ఉద్ఘాటించారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అత్యాధునిక క్షిపణి అగ్ని–ప్రైమ్ క్షిపణి అత్యాధునికమైనదని రక్షణ శాఖ వెల్లడించింది. అగ్ని బాలిస్టిక్ క్షిపణుల శ్రేణిలో దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో నూతన తరం కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ యంత్రాంగం ఉన్నట్లు పేర్కొంది. గ్రౌండ్ స్టేషన్ నుంచి క్షిపణిని నియంత్రించవచ్చని స్పష్టంచేసింది. భవిష్యత్తులో రక్షణ దళాల్లో రైలు ఆధారిత ఆయుధ వ్యవస్థలు, క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అగ్ని–ప్రైమ్ క్షిపణి పరీక్ష కార్యక్రమంలో డీఆర్డీఓ, ఎస్ఎఫ్సీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘రోడ్ మొబైల్ వేరియెంట్’ అగ్ని–ప్రైమ్ క్షిపణులను ఇప్పటికే రక్షణ దళాల్లో ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరిగిన తర్వాత నాలుగున్నర నెలల్లోగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్‌తో మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గేమ్ చేంజర్ అగ్ని–ప్రైమ్ పరీక్ష కోసం రైలును ప్రత్యేకంగా రూపొందించారు. సాధారణ రైళ్లు ప్రయాణించే పట్టాలపైనే ఇది పరుగులు తీస్తుంది. శత్రు దేశాల రాడార్లు గుర్తించకుండా క్షిపణిని రైలు లోపల దాచిపెట్టి తరలించవచ్చు. వర్షం, ఎండ, చలి వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ తరలించే అవకాశం ఉండడం మరో ప్రత్యేకత. దేశవ్యాప్తంగా రైలు నెట్వర్క్ ఉండడం సైన్యానికి కలిసొచ్చే అంశం. క్షిపణులను రైలు ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇదొక ‘గేమ్ చేంజర్’ అని డీఆర్డీఓ వర్గాలు స్పష్టంచేశాయి. రష్యా, చైనా తదితర దేశాలు రైలు ఆధారిత మొబైల్ మిస్సైల్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి. అణుశక్తి సంపన్న దేశమైన భారత్ బహుళ రీతుల్లో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. -
ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్..
స్మార్ట్ ఫోన్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎస్సెమ్మెస్ రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన లేని యూజర్లకు ఈ రక్షణ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ట్రూకాలర్ అంచనా ప్రకారం 100 మిలియన్లకుపైగా యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారు గత మూడు నెలల్లో కనీసం ఒక మోసపూరిత ఎస్సెమ్మెస్ అందుకున్నారు. ఈ మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు ప్రధానంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్లు, కేవైసీ సంబంధిత, లోన్లు, ఛారిటీ, లాటరీ వంటి అంశాలకు సంబంధించినవి వస్తున్నాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ట్రూకాలర్ ప్రవేశపెట్టిన ఈ ఎస్సెమ్మెస్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఫోన్లకు వచ్చే మోసపూరిత సందేశాలను తెలివిగా గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ట్రూకాలర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్ వచ్చినప్పుడు కొత్త ఫీచర్ ఆధారంగా ట్రూకాలర్ యాప్ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్ పొరపాటున ఆ ఫ్రాడ్ మెసేజ్‌ను ఓపెన్ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్ డిసేబుల్ చేస్తుంది. అయితే ఆ మెసేజ్ సురక్షితమే అని యూజర్ స్పష్టంగా గుర్తించినట్లయితే మాత్రమే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ -
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
నాఫెడ్ కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు హోంశాఖామంత్రి చినరాజప్ప అంబాజీపేట : కొబ్బరి విస్తారంగా సాగవుతున్న కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం అంబాజీపేటలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకొంటామన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సీపీసీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప ఇటీవల కోనసీమలో పర్యటించారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అల్లవరం మండలం సామంతకుర్రులో గుర్తించారని తెలిపారు. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు తీసుకొంటున్నామన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు. ప్రారంభోత్సవాలు అంబాజీపేటలో రూ.18 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాములను హోం మంత్రి చినరాజప్ప బుధవారం ప్రారంభించారు. తొలుత అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలో రూ.20 లక్షలతో నిర్మించిన సామాజిక కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న «వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ భవనాలను దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. అనంతరం స్థానిక వెంకట్రాజు ఆయిల్ మిల్లు వద్ద ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొబ్బరి ఒలుపు యంత్రం (డీ హస్కర్)ను మంత్రి రాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఏడీహెచ్ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, సర్పంచ్‌లు సుంకర సత్యవేణి, కాండ్రేగుల గోపాలకృష్ణ, మట్టపర్తి చంద్రశేఖర్, ఎంపీటీసీలు ఈతకోట సత్యవతి, దొమ్మేటి సాయికృష్ణ, కత్తుల నాగమణి, కోమలి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆ క్యాబ్‌లు గ్యాస్‌తోనే నడవాలి!
భారత రాజధాని ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబ్‌లు కేవలం గ్యాస్‌తో మాత్రమే తిరగాలంటూ హైకోర్టు డెడ్ లైన్ విధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు యాప్ ఆధారంగా ఫ్యూయెల్‌తో తిరిగే క్యాబ్‌లు... నాచురల్ గ్యాస్ వినియోగంతో నడపాలని కోర్టు ఆదేశించింది. మార్చి 2016 నాటికి డీజిల్ క్యాబ్‌లు రోడ్లపై నడిచేందుకు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఓలా, ఊబర్ వంటి కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాబ్‌లు ఇచ్చిన గడువు లోపల తమ తమ క్యాబ్ లను దశలవారీగా డీజిల్ నుంచి గ్యాస్‌తో నడిచేట్టుగా మార్చుకోవాలని జస్టిస్ మన్ మోహన్ ఆదేశించారు. ప్రభుత్వం అమలులోకి తేవాలనుకున్న డీజిల్ టాక్సీల నిషేధం ఆచరణాత్మక పరిష్కారం కాదని కోర్టు అభిప్రాయ పడింది. డీజిల్ క్యాబ్ లు నడుపుతున్న కంపెనీలపై జూలై 29 న ప్రభుత్వం విధించిన నిషేధం నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.