Basaveshwara Circle
-
జహీరాబాద్: బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి, సంగారెడ్డి: జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌లో పర్యటించిన సీఎం.. హుగ్గెల్లి జంక్షన్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని.. భూసేకరణలో అన్యాయం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిమ్జ్‌కు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం పెంచామని చెప్పారు. నిమ్జ్ కోసం భూములిచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. త్వరలోనే 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.నేషనల్ హైవేపై అండర్ పాస్ నిర్మాణాలు చేస్తాం. సింగూరు ప్రాజెక్టును అద్భుతమైన టూరిజంగా తీర్చిదిద్దుతాం. హుండాయ్ కార్ల పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని రేవంత్ అన్నారు. జహీరాబాద్ అభివృద్ధి సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. -
బెంగుళూరు స్టీల్ ఫ్లైఓవర్ రద్దు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య సాగుతున్న అవినీతి ఆరోపణల పర్వంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం బసవేశ్వర కూడలి నుంచి హెబ్బాళ వరకు 6.7 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సర్కారు రద్దు చేసింది. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి ప్రకటించారు. తమ నిబద్దతను చాటుకోవడానికే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం రద్దు చేశామని చెప్పారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య కుటుంబానికి, కాంగ్రెస్ అధిష్టానికి ముడుపులు ముట్టినట్లు బీజేపీ ఆరోపణలు చేయడం తగదన్నారు. రూ. 1,800 కోట్ల విలువైన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన 4 నెలల క్రితం తెరపైకి వచ్చింది. స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 812 చెట్లు నరికేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.