breaking news
BAS
-
మన అంతరిక్ష కేంద్రం!
ఇదేమిటో తెలుసా? రోదసిలో మన దేశాన్ని అమెరికా, రష్యా, చైనా సరసన నిలిపే ప్రతిష్టాత్మక భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) తొలి నమూనా! దేశమంతా చిరకాలంగా ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న ఈ బీఏఎస్–01ను భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) శుక్రవారం సగర్వంగా ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇందుకు వేదికైంది. దేశీయంగా రూపకల్పన చేసిన బీఏఎస్ తొలి మాడ్యూల్ (01)ను 2028 కల్లా భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో కృషి చేస్తుండటం తెలిసిందే. 2035కల్లా దాన్ని ఐదు మాడ్యూళ్లకు విస్తరించాలన్నది లక్ష్యం. – న్యూఢిల్లీఎన్నో విశేషాలు.. బీఏఎస్–01⇒ బరువు 10 టన్నులు⇒ పొడవు 8 మీటర్లు⇒ వెడల్పు 3.8 మీటర్లు⇒ దీన్ని భూమికి 450 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు⇒ అంతరిక్షంలో స్పేస్–లైఫ్ సైన్సెస్, ఔషధ, గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనుంది. ⇒ వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్ పూర్తిస్థాయిలో కాలూనేందుకు వీలు కల్పించనుంది. ⇒ అంతరిక్ష పర్యాటకంతో పాటు అంతర్జాతీయ సహకారాలకు వేదిక కానుంది. ⇒ స్పేస్ టెక్నాలజీ, రీసెర్చ్‌ను కెరీర్‌గా మలచుకునేలా భావి తరాలకు స్ఫూర్తినివ్వనుంది. ⇒ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, లైఫ్ సపోర్ట్ సిస్టం (ఈసీఎల్ఎస్ఎస్), భారత్ డాకింగ్ సిస్టం, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హాచ్ సిస్టం వంటి హంగులెన్నో దీని సొంతం. ⇒ ఇవన్నీ పూర్తిగా దేశీయంగా తయారు చేసుకున్న ఫీచర్లే కావడం విశేషం. ⇒ అంతరిక్షంలో మనుషుల ఆరోగ్యంపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావంతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రీయ ఇమేజింగ్ తదితరాలు బీఏఎస్‌లో జరగనున్నాయి. ⇒ రోజువారీ కార్యకలాపాలకు తోడు రీఫిల్లింగ్ ప్రొపల్లెంట్, ఈసీఎల్ఎస్ఎస్ ఫ్లూయిడ్లు, రేడియేషన్, థర్మల్ ప్రభావం, మైక్రో మీటరాయిడ్ ఆర్బిటల్ వ్యర్థాల (ఎంఎంఓడీ) నుంచి రక్షణ తదితరాలకు అవసరమైన హంగులన్నీ బీఏఎస్‌లో ఉండనున్నాయి. ⇒ స్పేస్ సూట్లు, ఎయిర్ లాక్స్, ప్లగ్ అండ్ ప్లే తరమా ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వ్యవస్థలకు దన్నుగా నిలుస్తుంది.ఆ దేశాల సరసన... బీఏఎస్–01 భారత్‌ను సొంత అంతరిక్ష కేంద్రాలున్న అమెరికా, రష్యా, చైనా సరసన నిలపనుంది. అయితే ప్రస్తుతం రెండే అంతరిక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి. మొదటిది అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ⇒ గతంలో తొలుత అమెరికా, అనంతరం సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్–ప్రస్తుత రష్యా) సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి. ⇒ అమెరికా స్కైలాబ్ పేరిట, యూఎస్ఎస్ఆర్ మిర్ పేరిట అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి. ⇒ ఇటీవల టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మించిన చైనా అంతకుముందు టియాంగాంగ్–1, టియాంగాంగ్–2 పేరుతో మాడ్యూళ్లను ఏర్పాటు చేసుకుంది. -
ఉచిత ఇంటర్‌కు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి సూచన కర్నూలు(అర్బన్): కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీ మాట్లాడుతూ జిల్లాలోని జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఏఎస్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశం: జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 11 బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో 100 మంది ఎస్సీ బాల బాలికలకు 1వ తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి తెలిపారు. ఇందులో 33 సీట్లను బాలికలకు, 67 సీట్లను బాలురకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి స్కూల్ ఫీజులు, పుస్తకాలు ఇతరత్రా ఖర్చుల కింద ఎంపికైన పాఠశాలలకు ఏడాదికి రూ.20 వేలను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. 1వ తరగతిలో తమ చిన్నారులకు చేర్చబోయే తల్లిదండ్రుల నివాసం ఆయా పాఠశాలలకు సమీపంలో ఉండాలన్నారు. ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నివాస, కుల, తల్లిదండ్రుల ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులు 01-06-2008 నుంచి 01-06-2009 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్లు సంబంధిత మునిసిపల్‌కమిషనర్, తహశీల్దార్లు జారీ చేసినవై ఉండాలన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో, జిల్లాలోని ఏడు సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో లభ్యమవుతున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిన విద్యార్థులకు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. బీఏఎస్గా ఎంపికైన పాఠశాలలు: జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి విద్యాలయం క్రిష్ణానగర్, జీసస్ మేరీ జోసఫ్ ఇంగిషు మీడియం స్కూల్ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో, కాకతీయ పబ్లిక్ స్కూల్ మద్దూర్‌నగర్, నందికొట్కూరు నవనంది హైస్కూల్, నంద్యాల సమతా విద్యానికేతన్, కాల్వబుగ్గ బుగ్గరామేశ్వర హైస్కూల్, డోన్ సుధ హైస్కూల్, ఎమ్మిగనూరు ఆదర్శ విద్యా పీఠం, నలంద హైస్కూల్, ఆళ్లగడ్డ శ్రీ రాఘవేంధ్ర పబ్లిక్ స్కూల్, కోవెలకుంట్ల సెయింట్ జోసఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఎంపికైనట్లు డీడీ శోభారాణి తెలిపారు. -
అంబేద్కర్ బ్యాంక్ కోసం ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంక్ తరహాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ‘భారతీయ అంబేద్కర్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద ఆదివారం ఉదయం భారతీయ అంబేద్కర్ సేన(బీఏఎస్) ఆంధ్రప్రదేశ్ సభ్యులు ధర్నా చేశారు. ఇప్పటిదాకా తమ డిమాండ్ నెరవేర్చనందుకు అరగుండు, అరమీసంతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాల్లో బ్యాంకులు 10 శాతం కూడా రుణాలను లబ్ధిదారులకు అందజేయడం లేదని బీఏఎస్ రాష్ట్ర కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ అన్నారు. దీంతో బ్యాంక్ రుణాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఎస్సీ, ఎస్టీలకు చేర డం లేదన్నారు. కుల వివక్షతో బ్యాంకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్తితి తలెత్తుతోందని ఆరోపించారు. దీంతో వారంతా ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని నిరోధించేందుకు భారతీయ అంబేద్కర్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీలు పాల్గొన్నారు.