breaking news
banglades coach
-
తినే అలవాట్లు బట్టి ఏ దేశమో చెప్పొచ్చు..
భోపాల్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బంగ్లాదేశీయలు ఎక్కడున్నా వెంటనే గుర్తించవచ్చని, వారి అలవాట్ల ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా నిర్ధారించవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే ఆ దేశానికి చెందిన కొందరు కేవలం అటుకులు మాత్రమే తింటారని, వారు తినే విధానం ద్వారా కూడా ఆ దేశ పౌరులను కనిపెట్టవచ్చని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన సీఏఏ, ఎన్ఆర్సీ మద్దతు సభలో ఆయన ప్రసంగించారు. పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని.. ఆహారపు అలవాట్ల ఆధారంగా గుర్తించాలని పేర్కొన్నారు. దేశంలో అనేక మంది భవన నిర్మాణ కూలీలు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ సరిహద్దుల్లో ద్వారా దేశంలోకి చొరబడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనికి నివారించడానికే కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని వివరించారు. దీనికి దేశ పౌరులంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు. -
బాగా ఆడాం కాబట్టే వచ్చాం
క్వార్టర్స్‌కు చేరడంపై బంగ్లాదేశ్ కోచ్ మెల్బోర్న్: ఎవరికో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం బంగ్లాదేశ్‌కు లేదని, బాగా ఆడినందుకే క్వార్టర్స్‌కు వచ్చామని ఆ జట్టు కోచ్ హతురసింఘ అన్నారు. జట్టులో ఆటగాళ్లంతా ఆత్మవిశ్వాసంతో భారత్‌తో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగుతారని చెప్పారు. ‘మా జట్టులో క్రికెటర్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఎవరికీ గాయాల బెడద లేదు. తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప ఘనత. క్రికెట్లో రికార్డులు, చరిత్రల కంటే ఆ రోజు బాగా ఆడటమే ముఖ్యం. భారత జట్టు చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పేస్ విభాగం చక్కగా రాణిస్తోంది. మా బలానికి తగ్గట్లుగా రాణించడంపైనే మా దృష్టి’ అని హతురసింఘ చెప్పారు.