Bangaru Bathukamma
-
అమెరికాలో బంగారు బతుకమ్మ సందడి (ఫొటోలు)
-
తానా ఆధ్వర్యంలో అమెరికాలో బంగారు బతుకమ్మ ఉత్సవం
అమెరికాలోని న్యూయర్క్ టైమస్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తేదీన బంగారు బతుకమ్మ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో 20 అడుగులఎత్తున తీర్చిదిద్దిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా, విదేశీయులను సైతం ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన బతుకమ్మ అలంకరణ, పాటలు, ఆటలు పండగ కాంతులు పంచాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ లతో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. బతుకమ్మలతో ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రకరకాల పూలతో అలంకరిచిన బతుకమ్మల అలంకరణ అందర్నీ విశేషంగా ఆకర్షించింది. తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, దీపిక సమ్మెట ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు వైవిధ్యభరితమైన టైమ్ స్క్వేర్‌ని పూలవనంగా మార్చాయి. ఈ వేడుకలలో పాల్గొన్న తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రత్యేక ఉపన్యాసం చేసారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని కొనియాడారు. అలాగే సహకరించిన ఆడపడుచులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ మాట్లాడుతూ దేవుళ్ళని పూలతో పూజించే పూలనే దేవుళ్లుగా చేసి పూజించటంలోని విశిష్టతను గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు వినూత్నమైన కార్యక్రమాలతో సంస్థ ప్రతిష్టని మరింత పెంచే విధంగా బంగారు బతుకమ్మ ఉత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ కనులవిందుగా అలంకరించిన బతుకమ్మ టైమ్ స్క్వేర్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఇంత మంచి కార్యక్రమాన్ని న్యూయార్క్ నగరంలో చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. భారతీయ సంప్రదాయాలను, పండుగల గురి౦చి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తానాకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి, దక్షిణ ఆసియా వ్యవహారాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్.. తానా సంస్థకు మేయర్ జారీ చేసిన అభినందన పత్రాన్ని అందించారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన ప్రఖ్యాత టీవీ, సినీనటి అనసూయ, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, తమ ఆటపాటలతో హోరెత్తించారు. అలాగే మిమిక్రీ రమేష్ తమదైన హాస్యంతో ఆహుతులకు హాస్యాన్ని పంచారు. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టి పడేలా సంప్రదాయమైన అలంకరణలతో తెలుగు ఆడపడుచులు ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అలాగే సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించి ఆహూతులని ఆనందింపజేశారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ ట్రస్టీ విశ్వనాథ్ నాయునిపాటి, ఫౌండేషన్ ట్రస్టీలు సుమంత్ రామిశెట్టి-విద్య గారపాటి-శ్రీనివాస్ ఓరుగంటి, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూయార్క్ దిలీప్ ముసునూరు, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూ ఇంగ్లాండ్ ప్రదీప్ గడ్డం, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కిరణ్ పర్వతాల ఆధ్వర్యంలో విశ్వవేదికపై కలకాలం గుర్తుండిపోయేలా తానా సంస్థ బతుకమ్మ సంబరాలను దిగ్విజయంగా నిర్వహించారు. అమెరికాలోని వివిధ నగరాలనుండి తానా సంస్థ నాయకులు నిర్మాత విశ్వప్రసాద్ పాటు ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, EVP నిరంజన్ శృంగవరపు, వెంకట్ చింతలపల్లి,సునీల్ కోగంటి, రవి పొట్లూరి, రవి మందలపు, సంస్థ ట్రస్టీ సభ్యులు రవి సామినేని, పద్మజ బెవర, మాధురి ఏలూరి, రాంచౌదరి ఉప్పుటూరి,శ్రీ అట్లూరి, ధృవ నాగండ్ల పాల్గొన్నారు. అతిధులకు ‘బీంజ్ హోటల్’ న్యూయార్క్ వారి ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. అలాగే సహచర అమెరికా తెలుగు సంఘాలు TLCA, TTA, NYTTA సంస్థలకు, సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వారందరికీ తానా సంస్థ తరఫున తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని ధన్యవాదాలు తెలియజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఘనంగా బంగారు బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కవిత ► ‘జాగృతి’తో బతుకమ్మకు జీవం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ►వేలాదిగా తరలి వచ్చిన మహిళలు ►కిక్కిరిసి పోయిన కలెక్టరేట్ మైదానం నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో సోమవారం అధికారికంగా నిర్వహించిన ‘బంగారు బతుకమ్మ’ వేడుకలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో పాల్గొన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు,అధికారులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ అద్దం పడుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడానికి తనకు జిల్లా ప్రజలు ప్లాట్‌ఫాం ఇచ్చారని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమం బతుకమ్మకు ప్రాణ ం పోసిందన్నారు. అందరూ పుట్టింటిలో బతుకమ్మ ఆడితే తాను అత్తగారింటిలో బతుకమ్మ ఆడుతున్నానని చమత్కరించారు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా రూపొందిస్తామని పేర్కొన్నారు. ‘జాగృతి’తో బతుకమ్మకు జీవం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ‘తెలంగాణ జాగృతి’ని ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగకు ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాణం పోశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంలో బతుకమ్మకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంగా ఈ కార్యక్రమం చేపట్టడంతో తెలంగాణలో ఆడపడుచులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత,ఎమ్మెల్యేలు, ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ఉత్సవాలు సక్సెస్... మహిళలు, యువతులు, చిన్నారులు, ఉద్యోగినులతో కలెక్టరేట్ మైదానమంతా నిండిపోయింది. సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఉత్సవాలు జరిగాయి. ఎంపీ కవిత తోటి మహిళలలో బతుకమ్మ ఆడి జోష్‌ను నింపారు. ప్రతి గ్రూపు వద్దకు వెళ్లి వారి మధ్యలో బతుకమ్మ ఆటపాటలాడారు. బతుకమ్మ ఆడిన అనంతరం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తొట్టెలో ఎంపీతో పాటు మహిళలందరూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, రవీందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి , అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా పూలోత్సవం
కొత్తగూడెం : ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యా లో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాటతో కొత్తగూడెం పట్టణం మార్మోగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ ఉత్సవాలు స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. తొలుత మేదర్‌బస్తీలో జేఏసీ నాయకులు మేరెడ్డి జనార్థన్‌రెడ్డి ఇంట్లో ఆమె బతుకమ్మలను అలంకరించారు. మహిళలకు బొట్టు పెడు తూ బతుకమ్మ ప్రాచుర్యాన్ని వివరించారు. అనంతరం సింగరేణి మహిళా కళాశాలలో విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత రుద్రంపూర్‌లో తెలంగాణ జాగృతి కో-కన్వీనర్ బండారు సాగర్ ఇంటి వద్ద బతుకమ్మను అలంకరించారు. అనంతరం రుద్రంపూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి రామవరంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు ఆకునూరి కనకరాజు ఇంట్లో బతుకమ్మను పేర్చారు. ఆ తర్వాత వివేకవర్థిని డిగ్రీ కళాశాలలో విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. పట్టణంలో ఉత్సవ శోభ.. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు నిర్వహించిన ప్రదర్శనలతో కొత్తగూడెం ప్రత్యేక శోభను సంతరించుకుంది. కొమ్ముడోలు, ఒగ్గు కళాకారుల డప్పునృత్యాలు, మహిళల ఆటపాటలతో పట్టణం కళకళలాడింది. స్థానిక ముర్రే డు వాగు నుంచి ప్రకాశం స్టేడియం వరకు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక వాహనాల్లో విద్యుద్దీపాలతో అలంకరించిన బతుకమ్మలు ఆకర్షించాయి. బతుకమ్మలతో నిండిన ప్రకాశం స్టేడియం.. స్థానిక ప్రకాశం స్టేడియం రంగురంగు పూలతో అలంకరించిన బతుకమ్మలతో నిండిపోయింది. కూరగాయలు, బంతి, తామరపూలతో ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టేడియంలో బతుకమ్మ ఆడేందుకు అధికారు లు 22 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన కల్వకుంట్ల కవిత అన్ని సర్కిళ్ల వద్దకు వెళ్లి మహిళలతో బతుకమ్మ ఆటలు ఆడారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బతుకమ్మ పాటలతోప్రకాశం స్టేడియం మార్మోగింది. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, బానోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ ఎ.వి.రంగనాధ్, జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఐటీడీఏ పీవో దివ్య, కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్, ఎమ్మెల్సీ బాలసాని ల క్ష్మీనారాయణ, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. ఉద్యమంలో బతుకమ్మ ఆటలే కీలకం తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆటలు కీలకంగా నిలిచాయని, అలాంటి బతుకమ్మను ఘనంగా నిర్వహించుకోవడం మన బాధ్యత అని కవిత అన్నారు. గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ సంబరాలలో ఆమె మాట్లాడుతూ కొత్తగూడెంలో సీమాంధ్రులు అధికంగా ఉన్నారని, వారు కూడా బతుకమ్మ ఉత్సవాలలో మమేకం కావడం హర్షణీయమని అన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. మహిళలకు భద్రతతో కూడిన బంగారు తెలంగాణను నిర్మిస్తామన్నారు. -
బంగారు బతుకమ్మ
-
బతుకమ్మా..బతుకమ్మా మాతల్లి బతుకమ్మా!
-
బెల్లంపల్లిలో బంగారు బతుకమ్మ వేడుకలు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లిలో బంగారు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పద్మశాలి భవన్ నుంచి బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని వేలాది మంది మహిళలతో కవిత ర్యాలీగా తిలక్ స్టేడియంకు చేరుకున్నారు. డోలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, బతుకమ్మ పాటలు, చిన్నారుల కోలాటం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పద్మశాలి భవన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన కాంటా చౌరస్తా, బజార్‌ఏరియా, పాతబస్టాండ్ మీదుగా తిలక్ స్టేడియంకు చేరుకుంది. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో నిర్వహించిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నాయి. తిలక్‌స్టేడియంలో కవిత ఆడపడుచులతో ఉత్సాహంగా కోలాటం ఆడిపాడారు. స్టేజీ మీద పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద సతీమణి సరోజ, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలకీష్మ, ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పేర్చిన కవిత బంగారు బతుకమ్మను పురస్కరించుకొని కవిత పలువురి ఇళ్లలో బతుకమ్మలను పేర్చారు. పట్టణంలోని స్టేషన్‌రోడ్ కాలనీలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రైల్వే రడగంబాలబస్తీలోని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, రాంమందిర్ఏరియాలో ఉన్న టీఆర్ఎస్ నాయకుడు ఎం.సత్తిబాబు ఇండ్లకు వెళ్లి పెద్దపల్లి ఎంపీ వివేకానంద సతీమణి సరోజతో కలిసి కవిత బతుకమ్మలు పేర్చారు. అంతకుముందు కవిత కన్నాల శివారులోని శ్రీ బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ నాయకులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద, రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జి.వినోద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలకీష్మ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కె.మల్లయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్ , నాయకులు బి.రమేశ్, జి.చంద్రశేఖర్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు. రెండు నెలల్లో ‘తెలంగాణ’ సాకారం మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాబోతుందని, ఏదేని పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడితే టీజేఏసీ, టీఆర్ఎస్ ఇచ్చే పిలుపు మేరకు ఉద్యమంలో మహిళలు ముందుండాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తిలక్ స్టేడియంలో బతుకమ్మ ఆడిన అనంతరం ఆమె మాట్లాడారు. సీమాంధ్ర ప్రభుత్వం జనావాసాల మధ్య ఓపెన్కాస్టలను ఏర్పాటు చేసి ప్రజలను నిర్వాసితులను చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జనావాసాలకు దూరంగా బొగ్గు గనులను ఏర్పాటు చేసుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలన్నారు. కొత్త గనుల ఏర్పాటుతో నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణి యాజమాన్యమే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలకు అందులో ప్రత్యేక కోటా కల్పించాలన్నారు. సీఎం వైఖరితోనే ఏపీఎన్జీవోలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమం డ్రామా అని కొట్టిపడేశారు. సీమాంధ్ర సీఎంను తొలగించాలి.. మంచిర్యాల టౌన్ : మొదటి నుంచి కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్న వాస్తవాలు డీజీపీ వ్యాఖ్యలతో తేలిపోయాయని కవిత అన్నారు.బుధవారం మంచిర్యాలలోని టీఆర్ఎస్ భవన్లో జరిగిన బంగారు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో బతుకమ్మ, కోలాటం ఆడిపడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మంచిర్యాలలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడంతో ముందుంటారని, ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న బంగారు బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ వేడుకలు హైదరాబాద్ మాది అని సీమాంధ్రులకు బతుకమ్మ సంబరాలతో తెలియజేస్తామన్నారు. అయితే సీఎంకు సహకరించిన డీజీపీ కూడా అవినీతిపరుడేనని అన్నారు. కేంద్రం రాష్టప్రతి పాలన విధించడమా లేదా సీమాంధ్ర సీఎంను తొలగించడమా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత వెంట ఎమ్మెల్యే సతీమణి హేమానళిని అరవిందరెడ్డి, జాగృతి మహిళా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, మండల కన్వీనర్ పుష్ప, పట్టణ కన్వీనర్ తిరుమల, టీఆర్ఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ, స్నేహ ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలకిష్మ, ప్రధాన కార్యదర్శి చందన, సభ్యులు మణిమాల, సంగీత, మహిళలు పాల్గొన్నారు. -
నేడు ఖమ్మంలో ‘బంగారు బతుకమ్మ’
ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ‘బంగారు బతుకమ్మ’ను భారీగా నిర్వహించనున్నట్టు ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ కన్వీనర్ ఈశ్వరప్రగడ హరిబాబు తెలిపారు. ఆయన శనివారం ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాపరిషత్ వద్ద ఆదివారం సాయంత్రం బతుకమ్మల శోభాయాత్రను తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారని చెప్పారు. ఈ యాత్ర నయాబజార్ కళాశాల వరకు సా గుతుందని, అనంతరం అక్కడ బతుకమ్మ ఆట-పాట, సభ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్య లో మహిళలు, 250మంది కళాకారులు పాల్గొంటారని చె ప్పారు. కార్యక్రమంలో ఉత్తమంగా ఎంపిక చేసిన నాలుగు బతుకమ్మలకు వరుసగా 5000, 3000, 2000, 1000 రూ పాయల నగదు బహుతులను డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కెవి.కృష్ణారావు సహకారంతో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పలు కార్యక్రమాలలో కల్వకుంట్ల కవిత పాల్గొంటారని చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు స్థంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తారని, 10:30 గంటలకు బైపాస్ రోడ్డులో తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 11 గంటలకు టీఎన్జీఓ కార్యాలయంలో బతుకమ్మల పేర్పులో, మధ్యాహ్నం 12 గంటలకు సంభాని నగర్లో టీజేఏసీ నిర్వహించే బతుకమ్మ సంబురాలలో పాల్గొంటారని అన్నారు. మూడు గంటలకు మామిళ్ళగూడెంలోని రామాలయం వద్ద బతుకమ్మ సంబురాలలో, సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కోర్టు ప్రాంతంలో న్యాయవాదుల జేఏసీ నిర్వహించే బతుకమ్మ ఆట-పాట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా నాయకుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఉస్మాన్ పాషా, కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు తానిపర్తి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ సం సృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నగరంలో ఆదివారం జరిగే ‘బంగారు బ తుకమ్మ’ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిం డిగల రాజేందర్ ఒక ప్రకటనలో కోరా రు.కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మహి ళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
బతుకమ్మ సిడిని విడుదల చేసిన కెసిఆర్