breaking news
Back lags
-
డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లు
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్‌గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు. -
‘బ్యాక్‌లాగ్స్’ సమస్యను పరిష్కరించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో 12, అంత కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని (బ్యాక్ లాగ్స్) విద్యార్థులను తదుపరి సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి విశ్వవిద్యాలయం అధికారులు నిరాకరిస్తున్న నేపథ్యంలో... ఈ సమస్యకు ఓ పరిష్కారం చూడాలని ఉస్మానియా వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణీయమైన నిర్ణయాన్ని తీసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. 12 అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని తమను తదుపరి సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు గతనెలలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.వాదనలు విన్న హైకోర్టు సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది.