ఎన్ఎస్ జీకు మరో మిత్రుడి సాయం
జెనీవా: న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్ జీ)లో భారత్ స్థానానికి తాము అండగా నిలుస్తామని స్విట్జర్లాండ్ ప్రకటించింది. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జాన్నన్ ను సోమవారం కలిసిన భారత ప్రధాని నరేంద్రమోదీ 48 సభ్య దేశాల గ్రూప్ లో భారత్ ను కూడా చేరేందుకు సహాకారం అందించాలని కోరారు. దీనికి స్పందించిన జాన్నన్ ఎన్ఎస్ జీ లో భారత్ స్థానం కోసం తాము సాయంగా ఉంటామని ప్రకటించారు. పన్ను ఎగవేత, నల్లధనం తదితరాలపై ఇరువులు సంప్రదింపులు జరిపారు. ఎన్ఎస్ జీలో మెంబర్ షిప్, నల్లధనంపై సమాచారాన్ని పరస్పరం మార్చుకునే విధంగా ఒప్పందాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. గత నెల మే12న భారత్ ఎన్ఎస్ జీ లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుపై జూన్ 9న వియన్నాలో, జూన్ 24న సియోల్ లో నిర్వహించే ప్లీనరీ సమావేశాల్లో చర్చిస్తారు.