breaking news
aziz khureshi
-
‘పుల్వామా దాడికి ప్లాన్ చేసింది ఆయనే’
సిహోర్(మధ్యప్రదేశ్): పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని మిజోరం మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పుల్వామా దాడికి మోదీ ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. మోదీ కుట్రకు ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. 27 స్థానాల్లో 20కిపైగా సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఓటమి ఖాయమన్న భయంతో ఇక్కడ బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఓటు అడిగే హక్కు కమలనాథులకు లేదన్నారు. బీజేపీ పాలనలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, దీంతో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’లో భాగంగానే పుల్వామా దాడి జరిగిందని కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లితోపొరా ప్రాంతంలో ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ ప్రకటించుకుంది. -
తొమ్మిది నెలల్లో ఆరుగురు!
గడిచిన తొమ్మిది నెలల్లో మిజోరాం గవర్నర్లుగా ఆరుగురిగిని మార్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రస్తుత గవర్నర్ అజీజ్ ఖురేషిని కూడా తొలిగించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో తెలపడంతో కేంద్రం శనివారం ఖురేషి తొలిగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన గవర్నర్ ల నియామ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే విమర్శలకు బలం చేకూరినట్లయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీయే హయాంలో నియమితులైన గవర్నర్లను వరుసగా తొలిగిస్తుండటంపై ఆగ్రహించిన ఖురేషీ.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కొంత ఇరకాటంలోపడ్డ కేంద్రం.. అదనుచూసి ఖురేషీపై వేటు వేసింది. జనవరి తొమ్మిదిన మిజోరాం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అజీజ్.. 2017, ఆగస్టు వరకు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండానే కేంద్రం ఆయనను తొలిగించింది.