పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా
రెండో ఇన్నింగ్స్‌లో 108/0
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
లార్డ్స్: ‘యాషెస్’ తొలి టెస్టులో ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో పుంజుకుంది. బౌలింగ్‌లో చెలరేగిన కంగారూలు బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణిస్తుండటంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (60 బ్యాటింగ్), రోజర్స్ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా క్లార్క్ సేన 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/4తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ఆసీస్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుక్ (96; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోక్స్ (87; 13 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించాడు. చివర్లో మొయిన్ అలీ (39), బ్రాడ్ (21) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో హాజెల్‌వుడ్, జాన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు.