breaking news
Australia fast bowler
-
కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్
ఆస్ట్రేలియా స్పీడస్టర్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్‌లో పదును మాత్రం పోలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా 45 ఏళ్ల బ్రెట్ లీ తన కొడుకు ప్రీస్టన్తో కలిసి ఇంటి ఆవరణలోని గార్డెన్లో సరదాగా క్రికెట్ ఆడాడు. ఈ నేపథ్యంలో బ్రెట్ లీ బంతి విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న ప్రీస్టన్కు కనీసం టచ్ చేసే అవకాశం రాలేదు. ఈలోగా బంతి వేగంగా పాదాల మధ్య నుంచి వచ్చి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' వయసు పెరుగుతున్న బ్రెట్ లీ బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదు. బంతిని వదిలేశారో ఇక అంతే సంగతులు.. కొడుకనే కనికరం లేకుండా క్లీన్ బౌల్డ్ చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడిన బ్రెట్ లీ అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్నాడు. Blink and you'll miss it 😳 Brett Lee has shown no mercy to his son 😂 👉 https://t.co/PytmEwGeQa pic.twitter.com/bWcQQ9WAnw — Fox Cricket (@FoxCricket) December 30, 2021 -
భారత మోడల్‌ను పెళ్లాడిన టెయిట్
ముంబై: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ పెళ్లి కొడుకయ్యాడు. తన స్నేహితురాలు, భారత మోడల్ మాషూమ్ సింఘాను అతను గత వారం వివాహమాడాడు. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ముంబైలోనే జరిగిన ఈ పెళ్లికి భారత క్రికెటర్లు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.