-
మీ పోర్ట్‌ఫోలియోకు అస్సెట్ అలోకేషన్..!
దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనుకుంటే అందుకు కీలకంగా తోడ్పడే వాటిల్లో అస్సెట్ అలోకేషన్ కూడా ఒకటి. అస్సెట్ అలోకేషన్ అన్నది ఒక ఇన్వెస్టర్ తన పెట్టుబడులను ఏ మేరకు భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేశారన్నది తెలియజేస్తుంది. ఇది రిస్క్‌ను పరిమితం చేయడంతోపాటు, రాబడుల్లో అనిశ్చితులను కూడా తగ్గిస్తుంది. సరైన విభాగానికి సరైన సమయంలో పెట్టుబడులను కేటాయించడం ప్రభావవంతమైన అస్సెట్ అలోకేషన్ అవుతుంది. ఎందుకంటే కాల క్రమంలో.. ఒక్కో సమయంలో ఒక్కో అస్సెట్ క్లాస్ (పెట్టుబడుల విభాగం) మంచి పనితీరు చూపించొచ్చు. తాము బాగా అర్థం చేసుకోతగిన ఒక అస్సెట్ క్లాస్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు సౌకర్యంగా భావించొచ్చు. అయితే, ఒకే సాధనంలో పూర్తిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలానుగుణంగా, ఆయా విభాగంలో అనిశ్చితుల రిస్క్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారికి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఎంతో సాయపడుతుంది. పోర్ట్‌ఫోలియోలో భిన్న పెట్టుబడుల సాధనాలను అస్సెట్ అలోకేషన్గా పేర్కొంటారు. అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండడంతోపాటు, రిస్క్‌ను సర్దుబాటు చేసుకుంటూ దీర్ఘకాల లక్ష్యాలకు క్రమానుగత పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం సాయపడుతుంది. భిన్న సాధనాల మధ్య.. అస్సెట్ అలోకేషన్ పరంగా ఈక్విటీల్లో తక్కువ విలువల వద్ద కొనుగోలు చేసి, అధిక విలువల వద్ద విక్రయించడం అన్నది అనుసరణీయమే. కానీ, ఆచరణలో అదంత సులభం కాదు. ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా చేస్తుంటారు. అదే డెట్ విభాగంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల గమనం ఏ విధంగా ఉందన్న దానితో సంబంధం లేకుండా తమకు సౌకర్యమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటుంటారు. బంగారం అన్నది భావోద్వేగాలతో ముడిపడినది. ముఖ్యంగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా చూసినప్పుడు పెట్టుబడుల కేటాయింపు ఒకే రంగా ఉండిపోతుంది. దీనివల్ల ఇన్వెస్టర్ ఒక పెట్టుబడి సాధనానికి సంబంధించి మారుతున్న ఆకర్షణను కోల్పోవచ్చు. దీనికి పరిష్కారంగా మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను ఆరంభించాయి. మారుతున్న పవనాలకు అనుగుణంగా ఈ ఫండ్స్ పెట్టుబడుల మార్పుతో ఇన్వెస్టర్లు చెప్పుకోతగిన విధంగా లాభపడేందుకు తోడ్పడతాయి. ఈ విభాగంలో ఒకానొక ప్రముఖ పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ అలోకేషన్ ఫండ్. డెట్, ఈక్విటీ విభాగాలకు వాటి ఆకర్షణీయతకు అనుగుణంగా పెట్టుబడులను ఈ ఫండ్ కేటాయిస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టే ముందు ఈక్విటీ, డెట్ మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ మేనేజర్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లు అనిశ్చితుల్లో ఉన్న సమయాల్లోనూ ఇన్వెస్టర్లు అస్సెట్ అలోకేషన్‌ను కొనసాగించడం అన్నది దీర్ఘకాలంలో... భిన్న సాధనాల్లో జరిగే ర్యాలీల్లో పాలు పంచుకునేందుకు సాయపడుతుంది. జి.వనకృష్ణ వీకీ ఫిన్సర్వ్ ఎల్ఎల్పీ -
డిపాజిట్ రేటు తగ్గించిన ఈసీబీ
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్ 0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. దీనితో బ్యాంకులు ఈసీబీ వద్ద ఉంచే నిధులకు ప్రస్తుతంకన్నా 10 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచకుండా... ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థలో డిమాండ్, వృద్ధికి దారితీసే అంశం. ఈసీబీ బెంచ్‌మార్క్ రీఫైనాన్సింగ్ రేటు (తాను ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీరేటు) చరిత్రాత్మక కనిష్ట స్థాయి 0.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ లేక 19 దేశాల యూరో జోన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం (వార్షికంగా 0.1 శాతం) కూడా అతి స్వల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమలు చేస్తున్న ఉద్దీపన ప్యాకేజీని మరో ఏడు నెలలపాటు పొడిగిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. అంటే నెలకు 60 బిలియన్ యూరోల బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని(ముందుగా నిర్దేశించిన గడువు(2016, సెప్టెంబర్) మార్చి 2017 వరకూ పెంచింది. దీనివల్ల నిధులు మరింతగా వ్యవస్థలోకి వచ్చి వృద్ధికి తోడ్పాటును అందించే అవకాశం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
No Headline
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
జగన్‌తోనే పారదర్శక పాలన
సమరోత్సాహంలో యువత
గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
జనం చిత్రవధ
బాబుది ముమ్మాటికీ నిరాదరణే..
సంక్షేమంలో ఛాలెంజ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement