breaking news
army areas
-
HYD: ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్ల కలకలం..
సాక్షి, మల్కాజ్గిరి: హైదరాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్లు కలకలం రేపాయి. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఓ ప్లాస్టిక్ బకెట్లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా, ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఉన్న బకెట్లో మొత్తం 8 బండిల్స్‌లో 160 డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి 33A సైజు కమర్షియల్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లుగా అధికారులు గుర్తించారు. ఆర్మీ సిబ్బంది సమాచారంతో బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిటోనేటర్లను పరిశీలించేందుకు మల్కాజ్గిరి బాంబ్ డిస్పోజల్ టీమ్‌కు సమాచారం అందించారు. డిస్పోజల్ టీమ్ సూచనల మేరకు డిటోనేటర్లను ఆర్మీ సిబ్బంది సురక్షితంగా భద్రపరిచారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో ఆర్మీ క్యాంప్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు? -
నగరంలోని ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
-
నగరంలోని ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ : నగరంలోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేశారు. కంటోన్మెంట్, ఏవోసీ గేట్ తదితర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్మీ పాసులున్న వారికి మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తున్నారు. ఆర్మీ పాస్‌లు లేని వాహనాలు వేరే మార్గంలో వెళ్లాలని ఆర్మీ సిబ్బంది సూచిస్తున్నారు. ఉడీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని పాక్ మిలిటెంట్ల స్థావరాలపై సునిసిన దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.


