breaking news
army air force
-
ఆఫ్ఘనిస్థాన్‌కు టెన్షన్.. పాక్ వద్ధ న్యూక్లియర్ వార్ హెడ్లు
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరు దేశాల మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్ట్‌లు లక్ష్యంగా పరస్పరం దాడులు చేసుకున్నాయి. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీకి పెద్దగా యుద్ధ విమానాలు లేకపోవడం గమనార్హం. కానీ, పాక్ ఆర్మీ అమ్ముల పొదిలో వందలాది ఫైటర్ జెట్స్ ఉన్న కారణంగా బార్డర్లో సైనిక ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలం, ఆయుధ సంపత్తిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఆయుధాలు, అధునాతన సాంకేతిక విషయంలో ఆఫ్ఘనిస్థాన్ కంటే పాకిస్తాన్ చాలా బలంగా ఉంది. కాగా, 2021 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటివరకు తాలిబన్ ప్రభుత్వానికి చాలా దేశాల నుంచి గుర్తింపు లభించలేదు. ఆయుధాల సంగతిని అలా ఉంచితే, తాలిబన్లకు కనీసం అప్పులు ఇవ్వడానికీ ఏ దేశాలూ ముందుకు రావడం లేదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై రష్యా సేనలు, అమెరికా సేనలు సైనిక స్థావరాలను నిర్వహించాయి. అవి అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో కొన్ని యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రైఫిల్స్, ఫిరంగులను వదిలి వెళ్లాయి. ఇప్పుడు వీటినే తాలిబన్ ఆర్మీ వినియోగిస్తోంది. ప్రస్తుతం అవన్నీ మరమ్మతు దశలో ఉన్నట్టు తెలిస్తోంది.మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం ఆయుధాల విషయంలో బలంగానే కనిపిస్తోంది. చైనా నుంచి పాక్‌కు పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు అందుతున్నాయి. అటు అమెరికా నుంచి ఆయుధాలు సేకరించినట్టు తెలుస్తోంది. అలాగే, పాక్ తన ఆయుధాలను పాక్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ మేరకు లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డేటాను వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పాక్‌ను తాలిబన్లు సైనికంగా దీర్ఘకాలం పాటు ఎదుర్కోవడం కష్టమేనని చెప్పుకొచ్చింది.ఇరు దేశాల సైనిక శక్తి ఇలా..పాకిస్తాన్..సైనిక శక్తిపరంగా ప్రపంచంలో పాకిస్థాన్‌కు 14 స్థానంలో(145 దేశాలకు గాను) ఉంది. పాక్‌కు 6.60 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. వీరిలో 5.60 లక్షల మంది ఆర్మీలో, మిగతావారు ఇతర సరిహద్దు భద్రతా విభాగాల్లో ఉన్నారు. పాక్ వద్ద 6వేలకుపైగా సాయుధ వాహనాలు, 4,600కుపైగా ఫిరంగి(ఆర్టిల్లరీ) యూనిట్లు ఉన్నాయి.పాక్ వద్ద 465 యుద్ధ విమానాలు ఉన్నాయి.పాక్ వద్ద 260కిపైగా సైనిక హెలికాప్టర్లు ఉన్నాయి.పాక్ వద్ద 170 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి.వందల సంఖ్యలో యుద్ధ విమానాలు (F-16s, JF-17s), హెలికాప్టర్లు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి ఇలా..సైనిక శక్తిపరంగా ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ స్థానం 121వ స్థానం(145 దేశాల్లో)సైనికుల సంఖ్య ఆప్ఘనిస్తాన్‌కు దాదాపు 1.72 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారుగతంలో అమెరికా వదిలివెళ్లిన హై మొబిలిటీ మల్టీ పర్పస్ వీల్డ్ వెహికల్ (హమ్వీ) సాయుధ వాహనాలు, ఎం4 కార్బైన్లను తాలిబన్లు వినియోగిస్తున్నారు.తాలిబన్ల వద్ద అతికొద్ది సంఖ్యలో సాయుధ వాహనాలున్నాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. కచ్చితంగా వాటి సంఖ్య తెలియదుతాలిబన్ల వద్ద సోవియట్ కాలం నాటి 6 యుద్ధ విమానాలు ఉన్నాయి. అవి పనిచేయడం లేదని సమాచారం. ఈ లెక్కన వాళ్ల దగ్గర ఫైటర్ జెట్స్ లేనట్టే. అలాగే, సోవియట్ కాలం నాటి 23 హెలికాప్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో ఎన్ని ఎగిరే స్థితిలో ఉన్నాయో తెలియదుఆప్ఘనిస్తాన్ వద్ద అణ్వాయుధాలు లేవు.గెరిల్లా పోరాట వ్యూహం: గెరిల్లా పోరాట వ్యూహ రచనను పకడ్బందీగా అమలు చేసే విషయంలో తాలిబన్లు దిట్టలు. ఈ వ్యూహంతోనే వాళ్లు గతంలో 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీతో తలపడ్డారు. ఈ అంశం సరిహద్దుల్లో పాక్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తెలిపింది. పాక్‌కు చెందిన సరిహద్దు ఆర్మీ పోస్ట్‌లకు తాలిబన్లు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇందుకోసం గెరిల్లా పోరాట వ్యూహాలను తాలిబన్లు అమలు చేస్తున్నారు. -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చితా...
-
ఆ వీడియో వాస్తవమేనా..?
Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం. పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్‌రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
Bipin Rawat: ఎంఐ హెలికాప్టర్.. మృత్యువుకి మరో పేరు.. 42 మందికి పైగా దుర్మరణం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చివరి సారిగా ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్లో ప్రయాణం చేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉన్నాయి. ఒకేసారి 30 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు క్యారియర్లుగా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే గత పదేళ్లుగా ఈ హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ క్రాష్లలో 42 మందికి పైగా సైనికులను దేశం కోల్పోయింది. - 2021 డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన క్రాష్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన భార్య మధుళికతో కలిపి మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారు. సీడీఎస్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. - 2019 ఫిబ్రవరి 27న శ్రీనగర్ ఎయిర్ బేస్ స్టేషన్ నుంచి రోటీన్ వర్క్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం పది నిమిషాలకే శ్రీనగర్ సమీపంలోని బుడ్గామ్ దగ్గర కూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. - 2018 ఏప్రిల్ 18న ఉత్తర్ఖండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుప్తకాశి నుంచి కేదార్నాథ్ బయల్దేరిన చాపర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. పైలెట్లు ఏంతో నేర్పుగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆరుగురు క్రూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. - 2017 అక్టోబరు 6న అరుణాచల్ ప్రదేశ్‌లో వివాస్పద తవాంగ్ ఏరియాలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో అడవుల్లో కూలిపోయింది. సమయానికి సహాయ కార్యక్రమాలు కూడా అందలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సిబ్బంది మరణించారు. - 2013 జూన్ 25 వదర సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కేథార్నాథ్ నుంచి గుప్తకాశికి వస్తుండగా గౌరీకుండ్ దగ్గర క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. - 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన హెలికాప్టర్ కొద్ది సేపటికే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. - 2010 నవంబరు 19న తవాంగ్ నుంచి గువహాటికి బయల్దేరిన ఐదు నిమిషాలకే బొందిర్ అనే కొండల నడుమ హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. చదవండి:హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత -
హమ్మయ్య.. ఎగిరింది...!
సాంకేతిక లోపంతో ఇల్లెందులో దిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ వారం రోజులపాటు సిబ్బంది నిరీక్షణ మరమ్మతులు పూర్తవడంతో గమ్యానికి పయనం ఇల్లెందు, న్యూస్‌లైన్ ‘హమ్మయ్య... ఎగిరింది..’- ఇల్లెందులో వారం రోజుల నిరీక్షణ తరువాత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో వ్యక్తమైన అనుభూతి ఇది. ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్ (జె.4064) ఈ నెల 19న ఉదయం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని ఇల్లెందులోని సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో పైలట్ సురక్షితంగా దింపారు. మరమ్మతుల కోసం బెంగుళూరు నుంచి మరుసటి రోజున సాంకేతిక సిబ్బంది వచ్చి పనులు మొదలుపెట్టారు. ఇవి బుధవారం పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 11:20 గంటల సమయంలో గాలి లోకి ఎగిరింది. కొద్దిసేపు ట్రయల్ చేసి, అంతా బాగుందని నిర్థారించుకున్నాక గమ్యస్థానానికి పంపించారు. దీంతో, ఎయిర్‌ఫోర్స్ అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లెందులో నిలిచిన ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు, పరిసర గ్రామాల వాసులు ఈ వారం రోజులపాటు జాతరకు వచ్చినట్టుగా తరలివచ్చారు. వీరి తాకిడి ఎక్కువవడంతో గ్రౌండ్ ముఖద్వారం గేట్లను పోలీసులు మూసివేశారు.


