breaking news
archana pande
-
బాయ్ ఫ్రెండ్ కారణమంటూ మోడల్ ఆత్మహత్య
ముంబై: ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న ముంబై కి చెందిన మోడల్ అర్చనా పాండే అనుమానస్పదకరమైన రీతిలో మరణించారు. ముంబైలోని వెర్సోవాలో అద్దెకు ఉంటున్న ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అర్చనా ఉంటున్న ఫ్లాట్ నుంచి వాసన వస్తోందంటూ అపార్ట్ మెంట్ లోని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అర్పనా పాండే మత దేహం వద్ద సూసైట్ నోట్ పోలీసులకు దొరికింది. తన బాయ్ ఫ్రెండ్ ఓమర్ పఠాన్ తన ఆత్మహత్యకు కారణం సూసైడ్ నోట్ లో అర్చన పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. పఠాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రియుడి వేధింపులతో మోడల్ ఆత్మహత్య
ప్రముఖ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చనా పాండే (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఆమె ఆత్మహత్య చేసుకున్నా.. ఆ విషయం ఎవరికీ తెలియలేదు. చుట్టుపక్కల వాళ్లకు ఆమె ఇంటినుంచి దుర్వాసన రావడంతో వాళ్లు పోలీసులకు చెప్పగా విషయం బయటపడింది. తానింత తీవ్రనిర్ణయం తీసుకోడానికి తన బోయ్ ఫ్రెండు ఒమర్ పఠాన్ కారణమని అర్చనా పాండే తన ఆత్మహత్యలేఖలో పేర్కొంది. ముంబై వెర్సోవా ప్రాంతంలోని న్యూ మహాడా కాలనీలోని ఓ అపార్టుమెంట్ 12వ అంతస్థులో అర్చనా పాండే ఉండేది. బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె మృతదేహం బాగా డీకంపోజ్ అయిపోయింది. పఠాన్ తనను తరచు వేధించేవాడని, అవమానించేవాడని, దాంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 2009లోనే మోడలింగ్ వదిలేసిన అర్చనా.. ప్రస్తుతం మీర్జా ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తోంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)