breaking news
Appudala Ippudila
-
‘కాఫీడే’... నా జీవితాన్ని మలుపు తిప్పింది!
- హర్షికా పూనచ్చా ‘‘కన్నడంలో ఇప్పటివరకూ 12 సినిమాలు చేశాను. పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ వంటి సూపర్‌స్టార్స్‌తో నటించా. తెలుగులో నాకిది తొలి సినిమా. రిలీజ్ దగ్గరవుతుంటే నెర్వస్‌గా ఉంది’’ అని నాయిక హర్షిక అన్నారు. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో సూర్య, హర్షికా పూనచ్చా జంటగా పుల్లరేవు రామచంద్రారెడ్డి, కల్యాణ్ ధూళిపాళ సమర్పణలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మించిన చిత్రం ‘అప్పుడలా...ఇప్పుడిలా’. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హర్షిక మాట్లాడుతూ- ‘‘నేను పుట్టింది, పెరిగింది బెంగళూరులోనే. నిజం చెప్పాలంటే, నేను హీరోయిన్ని అవుతానని కలలో కూడా అనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. టెన్త్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్‌తో కలిసి ‘కాఫీడే’కి వెళ్లాను. అక్కడికి ఓ సినిమా డెరైక్టర్ వచ్చి నన్ను చూసి, ‘యాక్ట్ చేస్తావా?’ అని సడన్‌గా అడిగారు. మొదట షాక్ అయ్యాను. కానీ తర్వాత కథ నచ్చి, వెంటనే ఒప్పుకున్నా. అలా ‘కాఫీడే’ నా జీవితాన్ని మలుపుతిప్పింది. 15 ఏళ్ల వయసులో సినిమాల్లోకొచ్చా. కానీ, చదువు కొనసాగిస్తూనే, సినిమాల్లో కూడా నటించాను. గత ఏడాదే నా ఇంజినీరింగ్ పూర్తయింది. ఇక నుంచి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్న సమయంలోనే ఈ తెలుగు ఛాన్స్ వచ్చింది. తెలుగులో అందరి సినిమాలూ చూస్తుంటా. ముఖ్యంగా పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్ర నిర్మాత ప్రదీప్‌కుమార్ జంపా నా సినిమాలు చూసి నన్నీ చిత్రానికి రికమెండ్ చేశారు. అప్పుడే దర్శకుడు విష్ణు ఈ కథ చెప్పడం, ఆ కథ బాగా నచ్చడంతో మొదటిసారి తెలుగులో నటించ డానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నేను రిచ్గాళ్గా కనిపిస్తాను. ఇందులో సీనియర్ నరేశ్ నాకు తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో క్యారెక్టర్ నా నిజజీవిత స్వభావానికి దగ్గరగా ఉంటుంది. కానీ నా పాత్ర పేరు సస్పెన్స్. ఈ సినిమా చిత్రీకరణప్పుడే తెలుగు మాట్లాడటం నేర్చేసుకున్నా. నా నెక్స్ట్ సినిమాకు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నా’’ అని చెప్పారు. -
నవ్వించే... ప్రేమకథ
సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో జంపా క్రియేషన్స్ పతాకంపై కె.ఆర్ విష్ణు దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ జంపా నిర్మించిన చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. సునీల్ కశ్యప్ స్వరాలు అందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. సునీల్ కశ్యప్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు. ‘‘వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రం ఇది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. సూర్యతేజ, హర్షికా పూంచా, సునీల్ కశ్యప్, రామచంద్రారెడ్డి, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
కడుపుబ్బా నవ్వించేలా.....!
ప్రతి క్షణం ప్రేక్షకులను కడుపుబ్బా న వ్వించేలా, కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. సూర్యతేజ, హర్షిక జంటగా జంపా క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్‌కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఆర్ విష్ణు దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీ మంచు ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ- ‘‘మొదటి సినిమా చేసేటప్పుడు ఎంత టెన్షన్‌గా ఉంటుందో నాకు తెలుసు. ఈ చిత్రం ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. ఓ మంచి సినిమా తీస్తున్న చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్’’ అని చెప్పారు. ఈ సినిమాలో నరేశ్‌గారు ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం చాలా ఆనందంగా ఉందనీ, కచ్చితంగా అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉందని దర్శక , నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు పీసీ ఖన్నా, కథా రచయిత బ్రహ్మారెడ్డి కమతం తదితరులు పాల్గొన్నారు.