breaking news
appropriate advice
-
ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్)ను దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల బాధ్యత. అయితే, తెలియక చేసిన తప్పులు, ముఖ్యంగా విదేశీ ఆస్తుల వంటి కీలక వివరాలను వెల్లడించకపోవడం వంటి అంశాల్లో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు (లేదా ఎస్ఎంఎస్/ఈ-మెయిల్స్) అందుకునే అవకాశం ఉంది. 2025–26 అసెస్మెంట్ ఇయర్ (ఏవై)కి సంబంధించిన ఐటీఆర్‌ల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని పన్నుదారులకు ఇలాంటి నోటీసులు పంపబోతున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.ఐటీ డిపార్ట్మెంట్ అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ సమాచార మార్పిడి ఒప్పందాల (ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ - ఏఈఓఐ) ద్వారా పన్నుదారుల ఆర్థిక లావాదేవీల గురించి సులభంగా తెలుసుకోగలుగుతోంది. విదేశీ జ్యూరిస్డిక్షన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి కూడా ఐటీఆర్‌లో ఆ వివరాలను పేర్కొనని వారికి ఐటీ శాఖ ఎస్ఎంఎస్లు/ఈ-మెయిల్స్ పంపడానికి సిద్ధమైంది.‘హై–రిస్క్’ కేసులుతొలి దశలో భాగంగా దాదాపు 25,000 ‘హై–రిస్క్’ కేసులుగా పరిగణిస్తున్న వారికి త్వరలో ఎస్ఎంఎస్లు/ఈ–మెయిల్స్ పంపనున్నారు. చట్టపరమైన చర్యలను నివారించడానికి వీరు 2025 డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్ (Revised ITR)ను దాఖలు చేయాలని సూచించారు. గత ఏడాది కూడా ఇలాగే నోటీసులు పంపినప్పుడు మొత్తం 24,678 మంది పన్నుదారులు రూ.29,208 కోట్ల విలువైన విదేశీ అసెట్స్ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్‌లను దాఖలు చేశారు. ఇది పన్ను ఎగవేతదారులను గుర్తించే విషయంలో డిపార్ట్మెంట్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.ఐటీ శాఖ ఇప్పటికే జూన్ వరకు 1,080 కేసులను మదింపు చేసి రూ.40,000 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు పంపింది. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో సోదాలు కూడా నిర్వహించారు.నోటీసులకు ఎలా స్పందించాలి?ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లేదా అధికారిక నోటీసు అందుకున్నప్పుడు పన్ను చెల్లింపుదారుడు భయాందోళనకు గురికాకుండా చట్టబద్ధంగా స్పందించాలి. నోటీసులు ఏ సెక్షన్ కింద వచ్చింది? (ఉదాహరణకు, సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమని తెలిపే సమాచార మెయిల్ కావచ్చు, లేదా సెక్షన్ 143(2) కింద మదింపు నోటీసు కావచ్చు.) అనే వివరాలు తెలుసుకోవాలి. నోటీసు దేని గురించి.. ఆదాయం తక్కువగా చూపడం, ఖర్చులను ఎక్కువగా చూపడం లేదా విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం వంటివాటిలో ఏది? అనే దాన్ని పరిశీలించాలి. నోటీసుకు స్పందించడానికి నిర్దిష్టంగా ఇచ్చిన గడువును గుర్తించాలి.సవరించిన ఐటీఆర్ దాఖలువిదేశీ ఆస్తుల వెల్లడి విషయంలో డిపార్ట్మెంట్ స్నేహపూర్వకంగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమంటూ ఎస్ఎంఎస్/ఈ-మెయిల్ పంపినట్లయితే అది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన ఒక అవకాశంగా భావించాలి. పన్ను చెల్లింపుదారు తక్షణమే తన ఐటీఆర్‌ను సమీక్షించి విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, మూలధన లాభాలు లేదా ఇతర విదేశీ ఆదాయాల వివరాలను తప్పనిసరిగా చేర్చి సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. సవరించిన రిటర్న్ ద్వారా అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే ఆలస్య రుసుముతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఈ చర్య చట్టపరమైన చర్యలను (పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ వంటివి) నివారించడానికి ఉపకరిస్తుంది.చట్టపరమైన చిక్కుల నివారణసమయానికి స్పందించడం అనేది జరిమానాలు, ప్రాసిక్యూషన్ వంటి తీవ్ర పరిణామాలను నివారించడానికి దోహదం చేస్తుంది. నోటీసులో పేర్కొన్న గడువులోగా స్పందించడం అత్యంత ముఖ్యం. గడువు దాటితే డిపార్ట్మెంట్ ఏకపక్షంగా మదింపును పూర్తి చేసే అవకాశం ఉంది. నోటీసులు క్లిష్టంగా లేదా పెద్ద మొత్తాలకు సంబంధించినవైతే పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల (సీఏ) సహాయం తీసుకోవడం ఉత్తమం. వారు నోటీసును విశ్లేషించి చట్ట ప్రకారం సరైన స్పందనను సిద్ధం చేయడంలో సహాయపడతారు. ఐటీ డిపార్ట్మెంట్ విచారణలో పూర్తి సహకారం అందించాలి. అడిగిన అన్ని పత్రాలను, వివరాలను ఆలస్యం చేయకుండా సమర్పించాలి.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది? -
బాబుకు ఈ వయసులోనే జీర్ణ సమస్య... తగ్గేదెలా?
మా అబ్బాయికి ఐదేళ్లు. ఇటీవల వాడికి ఏం తినిపించినా జీర్ణం కావడం లేదు. ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటోంది. ఏదైనా తినిపించిన కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటున్నాడు. ఎప్పుడూ నీరసంగా ఉంటున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్. కుమార్, విజయవాడ చిన్న పిల్లలు వాంతులు చేసుకోవడం అన్నది తరచూ చూసే సమస్యే అయినా మీరు చెబుతున్నట్లుగా ఈ వయసులో అరుగుదలలో లోపాలు ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, తిన్న వెంటనే వాంతులు కావడం అన్న విషయాలను కాస్త సీరియస్‌గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఈ వయసు పిల్లల్లో... గాస్ట్రో ఎంటిరైటిస్, గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్, ఎక్కువగా తినేయడం, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, పొట్టలో అల్సర్స్, కొన్ని మెటబాలిక్ కండిషన్స్ వల్ల తరచూ ఈ తరహా లక్షణాలను చూస్తుంటాం. అలాగే మాల్ అబ్జార్ప్షన్ (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం) కూడా ఒక కారణం కావచ్చు. అయితే మీ అబ్బాయి విషయంలో అతడి సమస్యకు గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్ లేదా శరీర నిర్మాణపరమైన అడ్డంకులు (అంటే... పేగు తిరగబడటం లాంటి మాల్రొటేషన్, హయటస్ హర్నియా, కంజెనిటల్ బ్యాండ్) వంటివి కారణాలు కావచ్చా అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రొటీన్ ఇవాల్యుయేషన్స్తో పాటు బేరియం మీల్ పరీక్షలు చేయించడం కూడా అవసరం. ఆ పరీక్షలతో చాలావరకు సమాచారం తెలుసుకోవచ్చు. పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స తీసుకోండి. మా బాబుకు ఏడేళ్లు. పుట్టుకతోనే రక్తంలో తెల్లరక్తకణాలు లేవని డాక్టర్లు చెప్పారు. దాంతో తరచూ రక్తం ఎక్కిస్తూ తెల్లరక్తకణాలను భర్తీ చేయాల్సి వస్తోంది. మా బాబుకు ఇలా ఎన్నాళ్లు ఎక్కించాలి? అతడి కండిషన్‌కు శాశ్వత చికిత్స లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - ఎమ్. నారాయణరావు, రాజమండ్రి మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ బాబుకి థ్రాంబో సైటోపీనియా ఉన్నట్లు అందులోనూ... ఏమెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపీనియా అనే కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ కండిషన్ ఉన్నవాళ్లలో సాధారణంగా రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉంటారుు. ఇది వురికొన్ని జన్యుపరమైన సవుస్యలతోనూ ఇది కలిసి ఉండవచ్చు. ఇలాంటి సవుస్య ఉన్నవారిలో దాదాపు 20 శాతం వుంది పిల్లల్లో ఇది ఎప్లాస్టిక్ అనీమియా అనే వురింత తీవ్రమైన పరిస్థితికి దారితీయువచ్చు. అంటే... సాధారణ అనీమియూలో ఎర్రరక్తకణాలు వూత్రమే తగ్గితే... ఈ ఎప్లాస్టిక్ అనీమియూలో రక్తంలోని అన్ని రకాల కణాలూ తగ్గుతారుు. అరుదుగా ఒక శాతం వుంది పిల్లల్లో ల్యూకేమియూ కూడా రావచ్చు. మీ బాబుకు పీడియూట్రిక్ హివుటాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స అందించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్


