breaking news
appeard
-
పార్లమెంటరీ కమిటీ ముందుకు ఎఫ్బీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికపై కొన్ని సిద్ధాంతాలు, భావజాలం పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఫేస్బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ బుధవారం పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. భావప్రకటన స్వేచ్ఛను సోషల్‌మీడియా దిగ్గజం హరిస్తోందనే విమర్శల మధ్య సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట అజిత్ మోహన్ హాజరయ్యారు. పౌరుల హక్కుల పరిరక్షణ, ఆన్లైన్..సోషల్‌మీడియా వేదికల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం, డిజిటల్ వేదికపై మహిళల భద్రత వంటి విషయాలపై చర్చకు ఎఫ్బీ అధికారిని సమావేశానికి పిలిచినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఫేస్బుక్ ఇండియాలో సీనియర్ సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర కేబినెట్ మంత్రులను దూషించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన మరుసటి రోజు ఎఫ్బీ అధికారి పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఫేస్బుక్ వేదికపై బీజేపీ నేతలను విద్వేష ప్రసంగాలు, సందేశాలు పోస్ట్ చేసేందుకు సోషల్‌మీడియా దిగ్గజం అనుమతించిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. వాల్‌స్ట్రీట్ కథనంతో ఫేస్బుక్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చదవండి : ఫేస్‌బుక్‌కు తృణమూల్ కాంగ్రెస్ లేఖ -
ధర్మపురి గోదావరిలో మొసలి కలకలం
ధర్మపురి : గోదావరిలో మొసలి కనిపించిందన్న విషయం ఆలస్యంగా కలకలం సృష్టిస్తోంది. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో ధర్మపురి వద్ద గోదావరికి నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ క్రమంలో వారం క్రితం గోదావరిలో నీరు తాగడానికి వెళ్లిన ఓ పందిని మెుసలి లాక్కొని వెళ్లిందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. నీరు బాగా ఉండడంతో ఎగువప్రాంతాల నుంచి నదిలో చేరి ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. 2012లో దమ్మన్నపేట రేవులో పట్టుబడిన మొసలి ధర్మపురికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్మన్నపేట రేవులో 2012లో నిండువేసవిలోనే ఓ మడుగులో మూడు మెుసళ్లు కనిపించాయి. వాటిలో ఓ మెుసలిని అటవీశాఖ అధికారులు అతికష్టంమీద పట్టుకున్నారు. మరో రెండు తప్పించుకుని పారిపోయాయి. పట్టుబడిన మెుసలిని ఫారెస్టు అధికారులు హైదరాబాద్‌లోని జూకు తరలించారు. అప్పట్లో తప్పించుకున్న మెుసళ్లే ప్రస్తుతం గోదావరిలో తిరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మెుసలి విషయం బయటకు పొక్కడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.