breaking news
anusha reddy
-
వీడియో కాల్ ద్వారా గర్భిణికి వైద్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏడేళ్ల నిరీక్షణ తర్వాత గర్భం దాల్చిన ఓ ఇల్లాలి మాతృత్వపు కలను వైద్య నిర్లక్ష్యం విచ్ఛిన్నం చేసింది. గర్భస్థ పిండాల (మగ కవలలు) మృతికి కారణమై కాబోయే తల్లికి అంతులేని వేదనను మిగిల్చింది. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన గర్భిణికి వాట్సాప్ వీడియో కాల్లో ఓ డాక్టర్ చేపట్టిన వైద్యం వికటించి ఐదు నెలల గర్భస్థ పిండాలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వైద్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆస్పత్రిని సీజ్ చేశారు. పెళ్లయిన ఏడేళ్లకు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తికి చెందిన కీర్తికి ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన బుట్టి గణేశ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు పుట్టకపోవడంతో చంపాపేటలోని ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడి చికిత్సలతో చివరకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతిలో ఐదు నెలల క్రితం కీర్తి గర్భం దాల్చింది. తొలి మూడు నెలలు చంపాపేట ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్న ఆమె తరచూ అక్కడకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అనూషరెడ్డిని సంప్రదించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన మహిళా డాక్టర్... కీర్తి గర్భసంచి వదులుగా ఉన్నట్లు గుర్తించి ఏప్రిల్ 6న కుట్లు వేసింది. అయితే అప్పటి నుంచే బాధితురాలికి రక్తస్రావం మొదలైంది. తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు మందులు తీసుకొని ఇంటికి వెళ్తోంది. ఇంటి నుంచే చికిత్స అందించడంతో.. ఆదివారం తెల్లవారుజామున కీర్తి రక్తస్రావంతోపాటు భరించలేని నొప్పులతో బాధపడుతుండటంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఉదయం 5:45 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ అనూషరెడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు సమాచారం అందించారు. అయినా వైద్యురాలు ఆస్పత్రికి రాకుండా ఇంటి నుంచే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్టాఫ్‌నర్సు, ఆయాలతో చికిత్స ప్రారంభించింది. స్టాఫ్ నర్సు, ఆయాలకు అనుభవం లేకపోవడం, అప్పటికే పరిస్థితి విషమించడంతో గర్భ సంచి సహా గర్భంలోని కవల పిండాలు బయటకొచ్చేశాయి. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ బాధితురాలి బంధువులు సోమవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు, జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రికి చేరుకొని సీజ్ చేశారు. ఆస్పత్రిలోని ముగ్గురు బాలింతలను వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలేశారు.నిర్లక్ష్యం లేదన్న ఆస్పత్రి.. అధిక రక్త స్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన తల్లి ప్రాణాలను కాపాడేందుకు అప్పటికే గర్భంలో మృతి చెందిన కవల పిండాలను అబార్షన్ ద్వారా తొలగించాల్సి వచి్చందని.. ఇందులో ఎలాంటి వైద్య నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మానవతా దృక్పథంతో చికిత్స అందించామని.. ఆస్పత్రి బిల్లు చెల్లించడం ఇష్టంలేకే కుటుంబ సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్ (ఫొటోస్)
-
సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య
ఆమెను కిడ్నాప్ చేసి మోసగించిన ఆలయ చైర్మన్ నిందితుడికిప్పటికే రెండు పెళ్లిళ్లు.. భూ సెటిల్మెంట్ల కేసులు అతన్ని అరెస్టు చేసిన ఐదు రోజులకే ఘటన సాక్షి, హైదరాబాద్: రాజధానికి చెందిన అనూష (22) అనే యువతి బుధవారం తెల్లవారుజామున నాగార్జునసాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కారులో ఓ దర్గాకు వెళ్తూ మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడింది. ఆమెను మాయమాటలతో కిడ్నాప్ చేసి మోసగించిన ఓ చీటర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదు రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన అనూష ఇంజనీరింగ్ చేసి, స్థానికంగా బోటిక్ షాప్ నిర్వహిస్తోంది. ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ గుంటి రాజేశ్ (33) ఆమెను మాయమాటలతో లోబర్చుకుని ఫిబ్రవరి 27న కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అయిన రాజేశ్‌కు వివాదాస్పద స్థలాలు కొనే, సెటిల్మెంట్లు చేసే చరిత్ర కూడా ఉంది. అతనికిప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. 2003లో భారతి అనే ఆమెను పెళ్లి చేసుకోగా ముగ్గురు పిల్లలు కలిగారు. 2010లో మన్సూరాబాద్‌లో ఉండే రోమాసింగ్ అనే ఇద్దరు పిల్లల తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. తనను మోసగించి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె నెల క్రితమే సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్‌పై ఫిర్యాదు చేసింది. అతనిపై హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పోలీసుస్టేషన్లలో భూ వివాదాల కేసులు కూడా ఉన్నాయి. అతనిపై పీడీ చట్టం ప్రయోగించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పెళ్లి చేసుకునేందుకు వేట ప్రారంభించిన రాజేశ్, ఆ క్రమంలోనే అనూషతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో లోబర్చుకుని ఫిబ్రవరి 27న ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి మార్చి 14న రాజేశ్‌ను అరెస్టు చేశారు. అనూష వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి జైలుకు తరలించారు. రాజేశ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో డిప్రెషన్‌కు లోనైన అనూష కొద్ది రోజులుగా తనలో తాను కుమిలిపోసాగింది. దాంతో తండ్రి శ్యాంసుందర్‌రెడ్డి, తమ్ముడు రాజేంద్రనాథ్, నాయనమ్మ లక్షీనర్సమ్మ ఆమెను తీసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కారులో నెల్లూరు జిల్లా రహమతాబాద్ దర్గాకు బయల్దేరారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సాగర్ నూతన బ్రిడ్జి వద్దకు చేరుకోగానే బహిర్భూమికని చెప్పి కారు దిగిన అనూష ఎంతసేపటికీ తిరిగిరాలేదు. చుట్టుపక్కలంతా వెదికిన అనంతరం విజయపురిసౌత్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెల్లవారాక అనూష మృతదేహం బ్రిడ్జి కింద నీటిలో పోలీసులకు కనబడింది. ఆమెకు పాదాలు, నడుము దగ్గర తీవ్రగాయాలయ్యాయి. అనూష మృతదేహాన్ని సాగర్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అనూష మృతితో గ్రీన్‌పార్క్ కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నట్లు ఎస్ఐ తెలిపా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ జా యింట్ పోలీస్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీ పీ తస్వీర్ ఇక్బాల్, ఏసీపీ సీతారాం చైతన్యపురి ఠాణా కు చేరుకుని రాజేశ్ కేసు విషయంపై ఆరా తీశారు.