breaking news
Anil Sahani
-
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో అనిత్ సహానీ బీజేపీలో చేరు. -
నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన ఎంపీ
న్యూఢిల్లీ: జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) రాజ్యసభ సభ్యుడు అనిల్ సహానీ(53) సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. పార్లమెంటుకు సమర్పించిన ట్రావెల్ అలవెన్స్ లో నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ ఉత్తర్వులను జారీ చేశారు. సహానీ రెండో సారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనపై చర్యలకు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ వెనకాడుతున్నట్టు సమాచారం. నకిలీ ఎయిర్ ఈ- టికెట్లు, బోర్డింగ్ పాసులు మొత్తం కలిపి రూ.23 లక్షల బిల్లులను ఆయన పార్లమెంటుకు సమర్పించారు. ఆయన ఎక్కడికీ ప్రయాణం చేయకుండానే ఈ బిల్లులను సమర్పించారని ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ స్కామ్ లో ఢిల్లీ ఎయిర్ ఇండియా అధికారి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతీ పార్లమెంటు సభ్యునికి దేశంలో ప్రయాణించడానికి 34 విమాన టికెట్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తనను అక్రమంగా కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తోందని సహానీ మండిపడ్డారు.