breaking news
amniotic sac
-
ఉమ్మనీటి సంచితో కవలల జననం
బ్రెజీలియా: కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ (ముసుగు జననాలు) అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది. -
ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాడు..!
సాక్షి, ప్రత్యేకం: నెలలు నిండకుండా బిడ్డ జన్మించడమంటే తల్లి, బిడ్డా చచ్చి బతికినట్లే! అని పెద్దలు అంటారు. వారం నుంచి నాలుగు వారాల ముందుగా బిడ్డ జన్మించడం అప్పుడప్పుడూ జరగుతుంటుంది. అయితే, దాదాపు మూడు నెలల ముందే బిడ్డ జన్మించడం అసాధారణం. ఓ మహిళ 11 వారాల ముందుగానే బిడ్డను ప్రసవించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరింత విస్తుగొలిపే విషయం ఏంటంటే.. సదరు మహిళ కారు ముందు సీట్లో కూర్చుని బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆమె చేతిలో పడినప్పుడు రక్షణ పొర(తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటూ ఇటూ కదలడానికి, ఒత్తిడి నుంచి రక్షణగా, ఆహారం, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది)తో ఉన్నాడు. రేలిన్ స్కర్రీ, ఇయాన్ దంపతులకు కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి తొలి సంతానంగా పాప జన్మించింది. 2016లో స్కర్రీ మళ్లీ గర్భం దాల్చింది. నెలలు పూర్తిగా నిండకపోవడంతో స్కర్రీ.. సాదాసీదాగా కారులో బయటకు బయల్దేరారు. ఇంతలో పొత్తి కడుపులో కొద్దిగా నొప్పి వచ్చినట్లు అనిపించింది. గర్భం దాల్చిన తర్వాత ఇలాంటి మామూలేనని తొలుత భావించినా.. నొప్పి ఎక్కువ అవుతుండటంతో ఆసుపత్రికి కారును మరల్చారు స్కర్రీ. ఇంతలో భర్త ఇయాన్కు ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని చెప్పారు. ఆసుపత్రికి చేరే లోపే కారు డ్రైవింగ్ సీటులో ప్రసవం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను స్కర్రీ తన ఇన్స్టా గ్రాంలో పోస్టు చేసింది. బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. తక్కువ నెలలకే జన్మించిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాడు. ప్రతి 80 వేల కేసుల్లో ఒకటి ఇలా జరుగుతుంటుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.