breaking news
allocation of employees
-
ఉద్యోగుల కేటాయింపు పూర్తికి షెడ్యూల్
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను మార్చి మొదటి వారంలోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల విభాగాధిపతులను ఆదేశించింది. ఇప్పటికే కేటాయింపు ఎలా జరపాలనే దానిపై మార్గదర్శకాలు ఇచ్చి అందుకనుగుణంగా కేటాయింపుల జాబితాలు పంపాలని సూచించింది. ఇందుకు టైమ్ షెడ్యూల్‌ను కూడా నిర్దేశించింది. దీంతో.. ► ఫిబ్రవరి 28లోపు జిల్లా, డివిజనల్ కార్యాలయాలు, పీఏఆర్ (ప్రొవిజినల్ అలొకేషన్ రేషియో–తాత్కాలిక కేటాయింపు నిష్పత్తి), పూర్తి జాబితాలను ఆయా శాఖలు పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు సంబంధిత శాఖల కార్యదర్శుల ద్వారా ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాల్సి వుంటుంది. ► ఆర్థికశాఖ మార్చి 3లోపు ఆ జాబితాలను పరిశీలించి తుది కేటాయింపు జాబితాలను సిద్ధంచేయాలి. అలాగే, మార్చి 7లోపు ఈ జాబితాలను ఖరారు చేసి తిరిగి ఆయా శాఖల కార్యదర్శులకు ఆర్థిక శాఖ పంపుతుంది. ► వీటిలో కార్యదర్శులు ఏమైనా మార్పులు సూచిస్తే వాటిని బట్టి చివరిగా మార్చి 11కల్లా ఆర్థిక శాఖ తుది కేటాయింపు జాబితాను ఆమోదిస్తుంది. ► ఆ తర్వాత కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ వెలువడే రోజునే ఉద్యోగుల కేటాయింపుపైనా ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు జారీచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. సర్వీస్ డెలివరీ యూనిట్ల కేటాయింపు ఇలా.. ఇక కొత్త జిల్లాల వారీగా ఏ జిల్లాలకు ఏ నిష్పత్తి ప్రకారం సర్వీస్ డెలివరీ యూనిట్లు (అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు వంటివి) కేటాయించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. జిల్లా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు రేషియో, డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు రేషియోను ఏవిధంగా చేయాలో ఉదాహరణలతో సూచించింది. జిల్లా కార్యాలయాలను ఎలా చేయాలో వివరిస్తూ.. ఉదా : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోని మండలాలు, డివిజన్లు, జిల్లా మ్యాప్‌లను పరిశీలించి కొత్త జిల్లాల ప్రకారం ఏ మండలాలు, ఏ డివిజన్లు ఏ జిల్లా పరిధిలోకి వెళ్లాయో నిర్థారించి విభజించాలని సూచించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 3,130 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆ జిల్లా కొత్తగా కర్నూలు, నంద్యాల జిల్లాలుగా ఏర్పడుతుండడంతో వాటి పరిధిలోకి వచ్చే మండలాలు, డివిజన్ల ప్రకారం వాటిని విభజించినప్పుడు కర్నూలు జిల్లాకు 1,806, నంద్యాల జిల్లాకు 1,324 అంగన్వాడీ కేంద్రాలు వచ్చాయి. నిష్పత్తి ప్రకారం 57.70 శాతం కేంద్రాలు కర్నూలుకు, 42.30 శాతం నంద్యాల జిల్లాకు వెళ్తాయి. అలాగే.. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ షాపుల వంటి సర్వీసెస్ డెలివరీ యూనిట్లన్నింటినీ విభజించాలని ప్రభుత్వం నిర్దేశించింది. -
ఉద్యోగుల బదిలీల్లో బీసీలకు అన్యాయం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ విధానంప్రకారం ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపుల్లో బీసీలు తీవ్రంగా నష్టపోయారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం జరిగిన బీసీ ఉద్యోగ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 25 శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆప్షన్ ఫారంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టలేదని తెలిపారు. మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో జిల్లా కేటాయింపులు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. కేవలం సీనియార్టీని ప్రామాణికంగా తీసుకోవడంతో మెరిట్ ఉన్న ఉద్యోగులు, జూనియర్లు తీవ్రం గా నష్టపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ తప్పిదాలను సవరించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ మెరిట్, రోస్టర్ పద్ధతిని, స్థానికతను పాటించాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై వారి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమైంది. కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై చర్చించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లో ఈ కింది అంశాలను చేర్చాలని బృందం సూచించింది. ►ఉద్యోగులు/కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకోవడం, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే ప్రత్యేక కేటగిరీ కింద ప్రాధాన్యత ఇవ్వాలి. ►45 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ►కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీకి గురైన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించాలి. n సొంత జిల్లా, ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాతో పాటు మొదటి నియామక జిల్లాను దరఖాస్తు నమూనాలో చేర్చాలి. ►రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించాలి. ట్రెసా చేసిన ఇతర విజ్ఞప్తులు.. ♦పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. ♦డీపీసీ ఆమోదం పొంది తహశీల్దార్లుగా పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న డిప్యూటీ తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వాలి. 2017–18 నుండి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్ తయారు చేయాలి. ♦సుదూర ప్రాంతాలోని ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలి. ∙వీఆర్వోలకు కూడా బదిలీ ఆప్షన్లు ఇవ్వాలి. ∙వీఆర్ఏలకు స్కేల్ వర్తింప చేయాలి. -
ఉద్యోగుల కేటాయింపుపై మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 మేరకు పోస్టుల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంబంధిత క్యాడర్లకు కేటాయించాల్సి ఉంది. పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించిన నిష్పత్తిలోనే ఆయా పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంజూరైన పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులుగా విభజించిన నిష్పత్తిలోనే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు కేటాయించాలని సూచించింది. లోకల్ క్యాడర్లకు కేటాయింపు కోసం ఉద్యోగుల నుంచి ప్రాధాన్యతలను స్వీకరించాలని ఆదేశించింది. అయితే, సీనియారిటీతో సంబంధం లేకుండా శారీరక వైకల్యం, వితంతువులు, కేన్సర్/కిడ్నీ రోగులు, మానసిక సమస్యలున్న పిల్లలు గల ఉద్యోగులు, జీవిత భాగస్వామి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి అయితే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జీవిత భాగస్వామి ప్రాధాన్యత ప్రయోజనం జీహెచ్ఎంసీ పరిధిలో(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధి)లో వర్తించదు. కేటాయింపులు చేసేదెవరంటే.. ►జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపులను ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కొత్త జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉండే కమిటీ జరపనుంది. ►జోనల్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత విభాగం అధిపతి జరుపనున్నారు. ►మల్టీ జోనల్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత శాఖ కార్యదర్శి చేస్తారు. ప్రక్రియకు గడువు ►వివిధ లోకల్ క్యాడర్లకు ఉన్న క్యాడర్ స్ట్రెంత్‌ను సంబంధిత హెచ్‌వోడీ/కార్యదర్శి 3 రోజుల్లో పూర్తిచేయాలి. ►క్యాడర్లవారీగా ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను కలెక్టర్లు/హెచ్వోడీలు/కార్యదర్శులు 2 రోజుల్లో పూర్తిచేయాలి. ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చేందుకు 3 రోజుల గడువు ఉంటుంది. జిల్లా కమిటీ/ హెచ్‌వోడీ/కార్యదర్శి ద్వారా ఉద్యోగుల కేటాయింపులను 10 రోజుల్లో పూర్తి చేయాలి. -
9న కమల్‌నాథన్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు కేంద్రం నియమించిన కమల్‌నాథన్ కమిటీ ఈ నెల 9న సచివాలయంలో భేటీ కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీ ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఇది 16వ సమావేశం. ఈ నెలాఖరుతో కమిటీ కాల పరిమితి ముగియనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 153 విభాగాలకుగాను 111 విభాగాల్లో విభజన పూర్తయింది. 6 విభాగాల ఉద్యోగుల కేటాయింపు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. మరో 32 విభాగాల్లో తాత్కాలిక కేటాయింపులు పూర్తయినప్పటికీ తుది కేటాయింపులకు మరో నెల సమయం పట్టే అవకాశముంది. ప్రధానంగా కమిటీ భేటీలో ఉద్యోగుల విభజన పూర్తి కాని శాఖలపైనే చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
మాకూ ఆప్షన్లు ఇవ్వాలి
సచివాలయ ఉద్యోగ సంఘం వినతి హైదరాబాద్: ఉద్యోగుల కేటాయింపులో సచివాలయ ఉద్యోగులకూ ఆప్షన్లు ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. అఖిల భారత సర్వీసెస్ అధికారులకు కల్పించినట్టే.. 18 జే క్లాజు ప్రకారం భార్యాభర్తల బదిలీల్లో ఇస్తున్న వెసులుబాటు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులకూ ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఆయన శుక్రవారం సచివాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు సచివాలయ సమన్వయ కమిటీ సెక్రటరీ జనరల్ వెంకటసుబ్బయ్య, ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు వెంకటకృష్ణలతో కలసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. కమలనాథన్ కమిటీ సూచనల మేరకు ఈ నెల 5లోగా అందించాల్సిన నివేదికపై చర్చించారు. స్టేట్ కేడర్ స్థాయే కాకుండా జిల్లా, మల్టీ జోన్, జోన్ స్థాయిల్లో ఈ విధానం అమలు పర్చాలని మురళీకృష్ణ కోరారు. ఇక్కడ పనిచేస్తున్న మహిళలు ఉద్యోగాలు చేసే తమ భర్తలను, పురుషులు తమ భార్యలను రప్పించుకున్నారని, వారిని పంపే క్రమంలో భార్యాభర్తల జీవో తప్పనిసరిగా వర్తింపచేయాలని సూచించారు. 18 ఎఫ్ క్లాజ్ తొలగించాలని తెలంగాణ ఉద్యోగులతోసహా తామూ కోరుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకూ ఆప్షన్లు వర్తింపచేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగులూ.. అపోహలొద్దు ఏపీ ప్రభుత్వం, దాని ఉద్యోగులు చెప్పినట్టు కమలనాథన్ కమిటీ నడచుకుంటోందని తెలంగాణ ఉద్యోగులు అనుమానించడం, పదేపదే కుట్రలు చేస్తున్నారనడం భావ్యం కాదని మురళీకృష్ణ అన్నారు. ప్రతి విషయంలో అపార్థం చేసుకోవద్దన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు అంశంలో ఇక్కడ చదివే ఏపీ విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి ద్వారా కూడా పన్నులు వస్తున్నాయన్న విషయాన్ని మరువరాదని అన్నారు. -
గైడ్‌లైన్స్ జారీ చేసిన కమల్‌నాధన్ కమిటీ
-
అందరికీ ఆప్షన్లు!
ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఖరారు రాష్ట్ర క్యాడర్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులే విభజన మిగతా ఉద్యోగులు ఎక్కడి వారక్కడే ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబంధన మేరకు పంపిణీ కేటాయింపుల్లో సీనియర్లకు ప్రాధాన్యత మార్గదర్శకాలపై అభ్యంతరాలకు 5 వరకు గడువు ఉద్యోగుల విభజనతో తొలుత తాత్కాలిక జాబితా దీనిపై ఫిర్యాదులకు మరో రెండు వారాల గడువు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉద్యోగుల కేటాయింపుపై కమలనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఆ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. పంపిణీకి అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ఆప్షన్ ఇవ్వనున్నారు. ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబం ధన మేరకు ‘స్థానికత’ను నిర్ధారించనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తమ అభిప్రాయూలను తెలియజేశారు. అనంతరం ఉద్యోగుల పంపిణీపై కమిటీ మార్గదర్శకాలు ఖరారు చేసింది. కమిటీ సభ్య కార్యదర్శి పి.వి.రమేష్ పేరిట ఏపీ రీఆర్గనైజేషన్ వెబ్సైట్లో వివరాలను పొందుపరిచింది. మార్గదర్శకాలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పంపించడానికి వచ్చే నెల 5 వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలు, సూచనలను.. ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ, పునర్వ్యవస్థీకరణ (ఎస్ఆర్) విభాగం, ఏపీ సచివాలయం చిరునామాకు పంపించాలని సూచించింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అనంతరం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొని ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేయనున్నారు. తొలుత కేటాయింపుల తాత్కాలిక జాబితా వెల్లడించి.. ఉద్యోగుల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించడానికి రెండు వారాల గడువు ఇవ్వనున్నారు. తుది జాబితా విడుదల చేయనుంది. మార్గదర్శకాలు ఇవీ.. ► 2011 జనాభా లెక్కల మేరకు ఇరు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో పోస్టుల విభజన ఉంటుంది. తెలంగాణకు 41.68 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం పోస్టులు కేటాయించనున్నారు. ► అవిభక్త రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయడానికి వీలున్న ఉద్యోగులు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, రాష్ట్ర క్యాడర్ అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య బదిలీకి అవకాశం ఉన్న మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రాజెక్టుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విభజించనున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఉద్యోగులనూ రెండు రాష్ట్రాలకు పంచనున్నారు. ► చఛగ్రామం, పట్టణం, సర్కిల్, మండలం, డివిజన్, జిల్లా, జోన్, మల్టీ జోన్(సీమాంధ్ర, తెలంగాణకు ఉమ్మడిగా లేని జోన్లు) పోస్టుల్లో పనిచేస్తున్న వారు విభజన పరిధిలోకి రారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారిని ఆ రాష్ట్రానికే కేటాయించినట్లుగా భావించాలి. ► భౌగోళికంగా ఏదో ఒక రాష్ట్రానికే చెందిన ఉద్యోగాలను ఆ రాష్ట్రానికే కేటాయించనున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలి. ► తొలుత మొత్తం పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత ఉద్యోగుల కేటాయింపులు ప్రారంభిస్తారు. కొత్త రాష్ట్రాల ఆవిర్భానికి ముందురోజు (2014 జూన్1) వరకు ఉన్న సీనియారిటీని కేటాయింపులకు ఆధారంగా తీసుకోనున్నారు. దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న, సెలవులో ఉన్న, ఆచూకీ లేని ఉద్యోగులతో పాటు డిప్యుటేషన్, శిక్షణలో ఉన్న ఉద్యోగులనూ కేటాయింపుల్లో పరిగణనలోనికి తీసుకోవాలి. ► ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ‘ఆప్షన్’ ఇవ్వనున్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ప్రయోజనాలు, ఆయా రాష్ట్రాల అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి కేటాయించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అందరి కంటే సీనియర్లు ఇచ్చిన ‘ఆప్షన్’కు ప్రాధాన్యత ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా నిర్దిష్ట క్యాడర్లో పోస్టులు మిగిలిపోతే అందరికంటే జూనియర్లను (రివర్స్ సీనియారిటీ ఆధారంగా) ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు. ► రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబంధన మేరకు స్థానికతను నిర్ధారిస్తారు. సర్వీసు రికార్డులో పేర్కొన్న మేరకు లేదా విద్యాభ్యాసం ధ్రువపత్రాల ఆధారంగా స్థానికతను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించాలి. తప్పుడు పత్రాలు పెట్టినట్లు రుజువయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయితే ఈ నిబంధన ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ స్థానికులు కాని ఉద్యోగుల స్థానికతను వారి స్వస్థలం ఆధారంగా నిర్ణయిస్తారు. ► ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వారిచ్చిన ఆప్షన్ మేరకే కేటాయిస్తారు. ఆప్షన్ ఇవ్వకపోతే వారి స్థానిక రాష్ట్రానికి కేటాయిస్తారు. ► నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఆప్షన్ ఇస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీలయినంతమేర ప్రయత్నిస్తారు. ►అఖిల భారత సర్వీసు అధికారి భార్య/భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారి ఆప్షన్ మేరకే కేటాయింపు ఉంటుంది. ► దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే వారిచ్చే ఆప్షన్ మేరకు ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయిస్తారు. ► ఒంటరి మహిళలు (వితంతువులు, విడాకులు తీసుకున్నవారు), 40 శాతానికి మించి అంగ వైకల్యం ఉన్న వారి ఆప్షన్లకు ప్రాధాన్యత ఇస్తారు. ► ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్, మూత్రపిండాల సమస్య, ఇతర తీవ్రమైన రోగపీడితులుంటే.. వారి ఆప్షన్ ప్రకారమే కేటాయింపులు జరుపుతారు. ► స్థానికత అర్హత ఉన్న ఉద్యోగులుంటే తప్ప ఖాళీ పోస్టులను ఉద్యోగుల పంపిణికీ వాడకూడదు. ► క్యాడర్ కూర్పులో డెరైక్ట్ రిక్రూటీలు, ప్రమోటీల శాతాన్ని, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని పంపిణీ చేయూలి. ► కొన్ని శాఖల్లో మంజూరు పోస్టు ఒక్కటే ఉన్నా, అదే క్యాడర్లో చాలామంది ఉద్యోగులు ఉంటారు. అలాంటి సందర్భంలో ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తారు. ► బోధన, వైద్య రంగంలో స్పెషలైజేషన్ వారీగా పోస్టులను విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి. సీనియారిటీని కూడా స్పెషలైజేషన్ వారీగానే నిర్ధారించాలి. ► ఇతర శాఖలు, విభాగాలు, సంస్థల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నా.. మాతృశాఖలోనే చూపించాలి. ► సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రాజెక్టుల్లో డిప్యుటేషన్ లేదా టెన్యూర్ మీద పనిచేస్తున్న లోకల్ క్యాడర్ ఉద్యోగులను వారి మాతృశాఖకు పంపిస్తారు. ► ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల ద్వారా రాష్ట్రాల ఆవిర్భావానికంటే ముందే కేటాయించి ఉంటే.. వారి ప్రాధాన్యతను అడుగుతారు. కానీ ఏ రాష్ట్రానికి కేటాయించినా పని చేయాల్సిందే. ► ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు-9, 10లో పేర్కొన్న సంస్థలు, సంఘాల ఉద్యోగుల విభజననూ కమలనాథన్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది. ► రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రమైనా కొత్త పోస్టులు సృష్టించి ఉంటే, ఉద్యోగుల తుది కేటాయింపులో వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. కేటాయింపు ప్రక్రియ ఇలా.. ► ‘ఆప్షన్’ తెలియజేయూల్సిందిగా విభజన జాబితాలో ఉన్న ఉద్యోగులందరినీ కోరతారు. ఇందుకు నిర్దిష్ట ఫార్మాట్‌ను కమిటీ రూపొందించింది. మార్గదర్శకాలు, ఫార్మాట్‌ను.. జ్ట్టిఞ://ట్ఛౌటజ్చజీట్చ్టజీౌ.్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందుపరిచారు. పూర్తి చేసిన ఆప్షన్ పత్రాలను సంబంధిత శాఖాధిపతికి సమర్పించాలి. ► ఆప్షన్ పత్రాల్లో పేర్కొన్న అంశాలను శాఖాధిపతి పరిశీలించి ధ్రువీకరించాలి. ధ్రువీకరించిన పత్రాలను ‘సభ్య కార్యదర్శి, సలహాసంఘం, ఎస్ఆర్ డిపార్ట్మెంట్, ఏపీ సచివాలయం’కు సంబంధిత శాఖాధిపతి ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో పంపించాలి. ► నిర్దారిత గడువులోగా ఆప్షన్ పత్రం సమర్పించకుంటే.. ఏ రాష్ట్రంలో అయినా పనిచేయడానికి ఉద్యోగి సిద్ధంగా ఉన్నారని భావిస్తారు. స్థానికత, ఇతర అంశాల ఆధారంగా వారి కేటాయింపు జరుగుతుంది. ► ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్పునకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. ► కేటాయింపు విషయంలో ఏ ఉద్యోగికైనా అభ్యంతరం, అయిష్టత ఉంటే ఆ విషయంపై తాను పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాలి. ఒక ప్రతిని ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ విభాగానికి పంపించాలి. ► ఉద్యోగుల అభ్యంతరాలపై నిబంధనల మేరకు అధికారిక వ్యాఖ్యలను జోడించి తుది నిర్ణయం కోసం కమిటీకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ విభాగం పంపించాలి. కమిటీ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించి, తుది సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుంది. కేటాయింపుల విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రమే తీసుకుంటుంది.తుది జాబితా విడుదల చేయనుంది. ‘కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు ఫైనల్ అయ్యాయి. పది రోజుల్లో అభ్యంతరాలు తీసుకున్న తర్వాత తుది మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఆతర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ ఉంటుంది’ అని కమిటీతో భేటీ అనంతరం ఏపీ సీఎస్ కృష్ణారావు మీడియూకు చెప్పారు. మార్గదర్శకాలు ఇవీ.. ► 2011 జనాభా లెక్కల మేరకు ఇరు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో పోస్టుల విభజన ఉంటుంది. తెలంగాణకు 41.68 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం పోస్టులు కేటాయించనున్నారు. ► అవిభక్త రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయడానికి వీలున్న ఉద్యోగులు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, రాష్ట్ర క్యాడర్ అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య బదిలీకి అవకాశం ఉన్న మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రాజెక్టుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విభజించనున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఉద్యోగులనూ రెండు రాష్ట్రాలకు పంచనున్నారు. ళీఙ్ట్చఛగ్రామం, పట్టణం, సర్కిల్, మండలం, డివిజన్, జిల్లా, జోన్, మల్టీ జోన్(సీమాంధ్ర, తెలంగాణకు ఉమ్మడిగా లేని జోన్లు) పోస్టుల్లో పనిచేస్తున్న వారు విభజన పరిధిలోకి రారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారిని ఆ రాష్ట్రానికే కేటాయించినట్లుగా భావించాలి. ► భౌగోళికంగా ఏదో ఒక రాష్ట్రానికే చెందిన ఉద్యోగాలను ఆ రాష్ట్రానికే కేటాయించనున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలి. ► తొలుత మొత్తం పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత ఉద్యోగుల కేటాయింపులు ప్రారంభిస్తారు. కొత్త రాష్ట్రాల ఆవిర్భానికి ముందురోజు (2014 జూన్1) వరకు ఉన్న సీనియారిటీని కేటాయింపులకు ఆధారంగా తీసుకోనున్నారు. దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న, సెలవులో ఉన్న, ఆచూకీ లేని ఉద్యోగులతో పాటు డిప్యుటేషన్, శిక్షణలో ఉన్న ఉద్యోగులనూ కేటాయింపుల్లో పరిగణనలోనికి తీసుకోవాలి. ► ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ‘ఆప్షన్’ ఇవ్వనున్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ప్రయోజనాలు, ఆయా రాష్ట్రాల అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి కేటాయించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అందరి కంటే సీనియర్లు ఇచ్చిన ‘ఆప్షన్’కు ప్రాధాన్యత ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా నిర్దిష్ట క్యాడర్లో పోస్టులు మిగిలిపోతే అందరికంటే జూనియర్లను (రివర్స్ సీనియారిటీ ఆధారంగా) ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు. ► రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబంధన మేరకు స్థానికతను నిర్ధారిస్తారు. సర్వీసు రికార్డులో పేర్కొన్న మేరకు లేదా విద్యాభ్యాసం ధ్రువపత్రాల ఆధారంగా స్థానికతను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించాలి. తప్పుడు పత్రాలు పెట్టినట్లు రుజువయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయితే ఈ నిబంధన ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ స్థానికులు కాని ఉద్యోగుల స్థానికతను వారి స్వస్థలం ఆధారంగా నిర్ణయిస్తారు. ► ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వారిచ్చిన ఆప్షన్ మేరకే కేటాయిస్తారు. ఆప్షన్ ఇవ్వకపోతే వారి స్థానిక రాష్ట్రానికి కేటాయిస్తారు. ► నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఆప్షన్ ఇస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీలయినంతమేర ప్రయత్నిస్తారు. ► అఖిల భారత సర్వీసు అధికారి భార్య/భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారి ఆప్షన్ మేరకే కేటాయింపు ఉంటుంది. ► దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే వారిచ్చే ఆప్షన్ మేరకు ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయిస్తారు. ► ఒంటరి మహిళలు (వితంతువులు, విడాకులు తీసుకున్నవారు), 40 శాతానికి మించి అంగ వైకల్యం ఉన్న వారి ఆప్షన్లకు ప్రాధాన్యత ఇస్తారు. ► ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్, మూత్రపిండాల సమస్య, ఇతర తీవ్రమైన రోగపీడితులుంటే.. వారి ఆప్షన్ ప్రకారమే కేటాయింపులు జరుపుతారు. ► స్థానికత అర్హత ఉన్న ఉద్యోగులుంటే తప్ప ఖాళీ పోస్టులను ఉద్యోగుల పంపిణికీ వాడకూడదు. ► క్యాడర్ కూర్పులో డెరైక్ట్ రిక్రూటీలు, ప్రమోటీల శాతాన్ని, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని పంపిణీ చేయూలి. ► కొన్ని శాఖల్లో మంజూరు పోస్టు ఒక్కటే ఉన్నా, అదే క్యాడర్లో చాలామంది ఉద్యోగులు ఉంటారు. అలాంటి సందర్భంలో ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తారు. ► బోధన, వైద్య రంగంలో స్పెషలైజేషన్ వారీగా పోస్టులను విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి. సీనియారిటీని కూడా స్పెషలైజేషన్ వారీగానే నిర్ధారించాలి. ► రాష్ట్రాల ఆవిర్భావం జరిగిన తర్వాత పదవీ విరమణ చేసిన లేదా మరణించిన ఉద్యోగులను కూడా పంపిణీ చేయాలి. ► ఇతర శాఖలు, విభాగాలు, సంస్థల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నా.. మాతృశాఖలోనే చూపించాలి. ► సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రాజెక్టుల్లో డిప్యుటేషన్ లేదా టెన్యూర్ మీద పనిచేస్తున్న లోకల్ క్యాడర్ ఉద్యోగులను వారి మాతృశాఖకు పంపిస్తారు. ► ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల ద్వారా రాష్ట్రాల ఆవిర్భావానికంటే ముందే కేటాయించి ఉంటే.. వారి ప్రాధాన్యతను అడుగుతారు. కానీ ఏ రాష్ట్రానికి కేటాయించినా పని చేయాల్సిందే. ► ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు-9, 10లో పేర్కొన్న సంస్థలు, సంఘాల ఉద్యోగుల విభజననూ కమలనాథన్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది. ► రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రమైనా కొత్త పోస్టులు సృష్టించి ఉంటే, ఉద్యోగుల తుది కేటాయింపులో వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. స్థానికతపై వివరణేది? ఉద్యోగ సంఘాల నేతల పెదవి విరుపు ప్రభుత్వ ఉద్యోగుల విభజన విషయంలో కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల్లో అన్ని అంశాలు బాగున్నప్పటికీ స్థానికతపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం ప్రధాన లోపమని ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షులు కె.వి. కృష్ణయ్య, వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షులు విజ్డం చౌదరి పేర్కొన్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనకు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ ఆర్టికల్ 371 డి ,తదనుగుణంగా వచ్చిన ప్రెసిడెన్షియల్ నియమాలను అనుసరించి స్థానికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఆప్షన్ అనే పదం మార్గదర్శకాలలో ఎక్కడా లేదన్నారు. సచివాలయం, హెచ్ఓడిలలో పనిచేసే ఉద్యోగులకు స్థానికత అనే అంశం వర్తించదనే విషయాన్ని విస్మరించి మార్గదర్శకాలను రూపొం దించడం ప్రధాన లోపమని వారు పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా నిర్దిష్ట క్యాడర్లో పోస్టులు మిగిలి పోతే.. అందరి కంటే జూనియర్లను (రివర్స్ సీనియారిటీ ఆధారంగా) ఆ రాష్ట్రానికి కేటాయిస్తారంటూ మార్గదర్శకాల్లో పెట్టిన నిబంధనపట్ల మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పోస్టులు సృష్టించి ఉంటే వాటిని తుది కేటాయింపుల్లో పరిగణనలోనికి తీసుకుంటామంటూ ఉన్న మరో నిబంధన కొంత ఊరట కలిగిస్తోందన్నారు. -
ఉద్యోగుల కేటాయింపు వివాదంపై 28న కీలక సమావేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు వివాదాలపై ఈ నెల 28న ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమలనాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల విభజనకు శాశ్వత మార్గదర్శకాలపై చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాతే ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదటిదశలో సుమారు 20 వేల మంది రాష్ట్రస్థాయి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేందుకు వర్క్ టు సర్వ్ ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలోని వివిధ శాఖల డైరెక్టరేట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు.