breaking news
alex rodriguez
-
షాకింగ్: బ్రేకప్ చెప్పేసిన స్టార్ సింగర్
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ (51)కు సంబంధించి మరో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియుడు, ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్(45)తో తెగదెంపులు చేసుకుందిట. గతకొన్ని రోజులుగా వీరిద్దరి బ్రేక్‌పై పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేయడంతోపాటు, ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. గతవారమే వీరిద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు యూఎస్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను జేఎల్ఓగానీ, అలెక్స్గానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. జెన్నిఫర్,అలెక్స్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కూడా కొనుక్కున్నారు. లోపెజ్ డొమినికన్ రిపబ్లిక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిని రెండుసార్లు వాయిదా వేసుకున్నామని స్వయంగా జెన్నిఫర్ గత డిసెంబర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్తో అలెక్స్ చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నాడన్నకారణంగానే జెలో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) -
ఆ ప్లేయర్‌తో జెన్నిఫర్ డేటింగ్!
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ ఒక కొత్త వ్యక్తితో రొమాంటికల్ లైఫ్‌లోకి దిగింది. ఆమె ప్రస్తుతం ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తూ మీడియాకు చిక్కేసింది. ప్రముఖ బేస్‌బాల్ ప్లేయర్ అలెక్స్ రోడ్రిగ్వెజ్‌తో ప్రస్తుతం ఆమె రొమాన్స్ చేస్తోందని హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. లాస్ వెగాస్‌లో వీరిద్దరు గత నెలలో పలువురి కంటపడ్డారట. అలా కనిపించడంపై వారిని ప్రశ్నించగా ఏదో కొద్ది సమయం సేద తీరేందుకు, కలిసి గడిపేందుకు ఇలా వచ్చామంటూ చెప్పి వెంటనే వెళ్లిపోయారంట. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందంటూ వార్తలు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. ‘ అందరికీ ఇది నిజంగా చాలా చాలా కొత్తది. అయితే, సీరియస్ విషయం మాత్రం కాదు. జెన్నిఫర్, అలెక్స్‌లు రిలేషన్లో ఉన్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారు’ అంటూ రాశాయి. గతంలో 30 ఏళ్ల బ్రేక్‌తో 47 ఏళ్ల జెన్నిఫర్ డేటింగ్ చేయడంపై ప్రశ్నించగా డేటింగ్‌కు వయసుతో పనిలేదని చెప్పారు. ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు అలెక్స్‌కు 41 సంవత్సరాలు. జెన్నిఫర్‌కు తొమ్మిదేళ్ల ట్విన్స్ ఉన్నారు. ఆమె మాజీ భర్త పేరు మార్క్ ఆంటోని.