breaking news
aerospace industry
-
హైదరాబాద్ కేంద్రంగా హెలికాప్టర్ గేర్స్ బాక్స్‌ల తయారీ..వందల కోట్ల పెట్టుబడులు!
Skanda Aerospace: హైదరాబాద్ కేంద్రంగా హెలికాఫ్టర్ పార్ట్‌లను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రముఖ స్కందా ఏరో స్పేస్ సంస్థ వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రఘు వంశీ మెషిన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్ సంస్థలు సంయుక్తంగా రాజధానిలో స్కందా ఏరో స్పేస్ ప్రొడక్షన్ పేరుతో యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్రొడక్షన్ యూనిట్లో హెలికాఫ్టర్ గేర్స్, గేర్ బాక్స్‌లను తయారు కానున్నాయి. ఇందుకోసం సుమారు రూ.250కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా టెక్సాస్‌లో ఉన్న రేవ్ గేర్స్ తో పాటు రఘు వంశీ మెషిన్ టూల్స్ సంస్థ సైతం ఏవియేషన్ సంస్థలతో పాటు ఇతర ఆటో మోటీవ్ సంస్థలకు కావాల్సిన ఉత్పత్తుల్ని సరఫరా చేస్తుంది. -
ఇజ్రాయెల్‌తో భారీ రక్షణ ఒప్పందం
జెరూసలేం: ఇజ్రాయెల్, భారత్ కు మధ్య రెండు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌లో తయారైన అత్యాధునిక క్షిపణులను భారత్‌కు అందజేయనుంది. ఈమేరకు ఆదేశం అంగీకరిస్తూ ఒప్పందపత్రంపై సంతకం చేసింది. ఇది ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్ పరిశ్రమ (ఐఏఐ) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఒప్పందం ప్రకారం అత్యాధునిక మధ్యతరహా లక్ష్యాలతో పాటు సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల అత్యాధునిక క్షిపణులను భారత ఆర్మీకి అందించనున్నట్లు ఐఏఐ వెల్లడించింది.