breaking news
ADO
-
దేవుడా దొరక్కుండా చూడు.. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన పేపర్ లీక్ జంట
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్లో చేసిన తప్పుల సవరణ కోసం వెళ్తే బేరం కుదిరి డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ దక్కింది... ఇక జాబ్ గ్యారంటీ అంటూ ఆనందంలో మునిగితేలుతున్న వేళ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చి అరెస్టులు మొదలవడంతో వారిలో వణుకు పుట్టింది... దాదాపు 25 రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ తప్పును కాయాలని మొక్కుకున్నా చివరకు నేరం బట్టబయలైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ‘సిట్’పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఖమ్మం జంట సాయి సుస్మిత, సాయి లౌకిక్‌ల వ్యవహారమిది. సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని... కార్ల వ్యాపారి అయిన లౌకిక్ భార్య సుస్మిత వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆ పరీక్షలకు సిద్ధం కావడానికి ఉద్యోగాన్నీ వదిలేసింది. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసినప్పటికీ ఓఎంఆర్ షీట్లో రాంగ్ బబ్లింగ్ (ఒకే కాలమ్‌లో రెండు చోట్ల మార్కింగ్ చేయడంతో) ఆమె ఫలితం ఆగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పలుమా ర్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి వెళ్లే క్రమంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పలు పరీక్షల ప్రశ్నపత్రాల విక్రయాలు మొదలెట్టిన అతను సుస్మి త డీఏఓ పరీక్షకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుసుకొని బేరం పెట్టాడు. దీంతో లౌకిక్ రూ. 6 లక్షలు చెల్లించి ఫిబ్రవరి 23న డీఏఓ పరీక్ష మాస్టర్ పేపర్ తీసుకొని భార్యకు అందించాడు. దీని ఆధారంగా రెండ్రోజులపాటు పరీక్షకు సిద్ధమైన సుస్మిత... అదే నెల 26న పరీక్ష రాసింది. తన చేతికి వచి్చన పేపర్లోని ప్రశ్నలే కావడంతో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు మార్క్ చేసింది. ఒకవేళ గ్రూప్–1 పరీక్ష ఫలితం తేలకపోయినా డీఏఓ పోస్టు తప్పకుండా వస్తుందని భార్యాభర్తలు భావించారు. లీకేజీ బయటపడటంతో గుబులు... మార్చి 11 వరకు ఆనందంగా గడిపిన దంపతులు... టీఎస్పీఎస్సీలో పరీక్ష పేపర్ల లీకేజీ అంశం మార్చి 12న వెలుగులోకి రావడం, పోలీసులు ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర నిందితులను అరెస్టు చేయడంతో ఆందోళనకు లోనయ్యారు. డీఏఓ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాకూడదని, తాము ఈ కేసులో ఇరుక్కోకూడదని ప్రార్థనలు మొదలెట్టారు. నిద్రలేని రాత్రులు గడిపిన ఈ జంట... ఆ ఒత్తిడిని జయించడానికి తిరుపతి, షిర్డీ సహా అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లింది. అయితే ప్రవీణ్‌కు రూ. 6 లక్షల సొమ్మును లౌకిక్ ఆన్లైన్లో బదిలీ చేయడంతో ఈ క్లూ ఆధారంగా ‘సిట్’పోలీసులు వారిని ఈ నెల 7న అరెస్టు చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
వైఎస్సార్ ‘చేనేత’ సాయం రూ.24 వేలు
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : మగ్గం కలిగివున్న ప్రతి నేతన్నకూ ఏటా వైఎస్సార్ చేనేత సాయం రూ.24 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా జౌళి శాఖ ఏడీవో సుబ్బానాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీవో లీలామాధవి అద్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఏడీవో మాట్లాడుతూ నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, అర్హులైన నేతన్నల ఎంపికను వలంటీర్లు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా మగ్గం ఉన్న నేతన్నలకు ‘వైఎస్సార్ చేనేత సాయం’ అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు వలంటీర్ల ద్వారా చేనేత కుటుంబాలను సర్వే చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 7611 చేనేత కుటుంబాలు ఉండగా మదనపల్లెలోనే 4900 ఉన్నట్లు 2018 నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా తేలిందన్నారు. ఇంకా చేనేత కుటుంబాలు ఉన్నట్లయితే రేపటి నుంచి చేపట్టబోయే రీ సర్వేలో గుర్తిస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక చేపడతామన్నారు. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించినట్లు గుర్తుచేశారు. ఈ కమిటీల ఆమోదం ద్వారా ఇదివరకే జిల్లాలో 6821 మందిని గుర్తించి నివేదికను పంపించామన్నారు. మగ్గం లేనప్పటికీ కూలి, అద్దె మగ్గాలు నేస్తున్న వారు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ, రూరల్ పరిధిలోని వలంటీర్లు, చేనేత జవిళి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
భారత్ వృద్ధి బాట పటిష్టమే: ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు పటిష్టంగానే ఉన్నట్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అవుట్‌టుక్ (ఏడీఓ) 2016 నివేదిక పేర్కొంది. తగిన డిమాండ్, సంస్కరణలే భారత్ వృద్ధికి కీలకమని అధ్యయన నివేదిక వివరించింది. 2016లో దేశం 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. వ్యవస్థాగత సంస్కరణలు, పటిష్టంగా ఉన్న వినియోగ డిమాండ్, తగిన వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయ గణాంకాల వృద్ధికి అవకాశాలు వంటివి భారత్ పటిష్ట వృద్ధి బాట అంచనాలకు కారణంగా వివరించింది. -
ఎల్ఐసీలో కొలువుల మేళా..!
దేశంలో జీవిత బీమా సంస్థల్లో అతిపెద్దదైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా భారీ ఖాళీలతో ప్రకటన విడుదల చేసింది. వివిధ జోన్లలో మొత్తం 5,066 అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (ఏడీవో) ఖాళీలున్నాయి. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పరిధిలో 699 పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానం, విజయానికి వ్యూహాలు తదితరాలపై ఫోకస్... ఖాళీల వివరాలు: వర్గం ఖాళీలు జనరల్ 339 ఎస్సీ 109 ఎస్టీ 48 ఓబీసీ 203 మొత్తం 699 డివిజన్ల వారీగా పోస్టులు కడప- 66; హైదరాబాద్- 53; కరీంనగర్- 15; మచిలీపట్నం- 49; నెల్లూరు- 45; రాజమండ్రి- 41; సికింద్రాబాద్-51; విశాఖపట్నం-41; వరంగల్- 11; బెంగళూరు-1: 67; బెంగళూరు-2: 65; బెల్గాం-34; ధార్వాడ్-34; మైసూర్-39; రాయ్‌చూర్-37; షిమోగ-22; ఉడిపి-29. వేతనాలు ఏడీఓగా ఎంపికైన అభ్యర్థికి అప్రెంటీస్ సమయంలో నెలకు రూ.23,836 స్టైఫండ్‌గా లభిస్తుంది. అప్రెంటీస్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ప్రొబేషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా నియమిస్తారు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.26,736 వరకు అందుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్స్‌లుంటాయి. అర్హతలు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్)లో మాస్టర్ డిగ్రీ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 2015, జూన్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా గరిష్ట వయోపరిమితిలో ప్రత్యేక సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు; ఓబీసీలకు 45 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్లు. ఎల్ఐసీ ఏజెంట్లకు కూడా మినహాయింపు ఉంటుంది. ఎల్ఐసీ ఏజెంట్లకు జనరల్ కేటగిరీ గరిష్ట వయోపరిమితి 37 ఏళ్లు; ఓబీసీ-40; ఎస్సీ, ఎస్టీ-42 ఏళ్లు. ఎంపిక విధానం ఎంపిక పక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలను ఖరారు చేస్తారు. ఏడీఓగా నియమితులైన అభ్యర్థులు కనీసం నాలుగేళ్లపాటు ఎల్ఐసీలో సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను పోస్టులో చేరేముందు రూ.25,000 బాండ్ సమర్పించాలి. పరీక్ష విధానం ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల పాటు జరిగే పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. మూడు పేపర్లు ఉంటాయి. పేపర్ ప్రశ్నల సంఖ్య మార్కులు పేపర్-1 రీజనింగ్ ఎబిలిటీ 25 25 న్యూమరికల్ ఎబిలిటీ 25 25 పేపర్-2 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 25 25 ఇంగ్లిష్ లాంగ్వేజ్ (గ్రామర్, వొక్యాబులరీ) 25 25 పేపర్-3 ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ 50 50 (లైఫ్ ఇన్సూరెన్స్,ఫైనాన్షియల్ సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం) మొత్తం 150 150 ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్లోనూ నిర్దేశ కటాఫ్ మార్కులు సాధించాలి. ఈ కటాఫ్‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి మార్కుల్లో కోత విధిస్తారు. విధులు తమకు నిర్దేశించిన డివిజనల్లో ఎల్ఐసీ పాలసీల సేల్స్‌ను పర్యవే క్షించడం వీరి ప్రధాన విధి. ఏజెంట్లను నియమించుకుని.. వారితో ఎక్కువ సంఖ్యలో పాలసీలను విక్రయించేలా చూడాలి. తాను నియమించుకున్న ఏజెంట్లకు శిక్షణనందించడంతోపాటు ఎల్ఐసీ అందించే వివిధ ఇన్సూరెన్స్ పథకాలను వివరించడం.అవసరమైతే ఏజెంట్లు చేర్చిన పాలసీదారులతో మాట్లాడి.. వారి సందేహాలను నివృత్తి చేయడం.తాము పనిచేసే డివిజన్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ సదుపాయం ఏడీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్షకు సిద్ధం కావడానికి ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కూడా ఎల్ఐసీ అందిస్తుంది. దీనికోసం ఏ డివిజన్ పరిధిలో అయితే దరఖాస్తు చేసుకున్నారో.. ఆ ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్‌ను 2015 జులై మొదటి వారంలో సంప్రదించాలి. ప్రిపరేషన్ ప్రణాళిక రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అభ్యర్థి తార్కిక ఆలోచన శక్తిని, విశ్లేషణా శక్తిని పరిశీలించేలా ఈ విభాగంలో ప్రశ్నలడుగుతారు. నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్స్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలెదురవుతాయి. సంబంధిత ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో నంబర్ సిస్టమ్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, శాతాలు, స్క్వేర్ రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు,డిస్కౌంట్, భాగస్వామ్య వ్యాపారం మొదలైన అంశాలపై ప్రశ్నలడుగుతారు. గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ పుస్తకాలను సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. ప్రతి చాప్టర్‌ను ప్రాక్టీస్ చేయడంతోపాటు వీలైనన్ని మాక్ టెస్ట్‌లను సాధన చేయాలి. సంబంధిత అంశాలలో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లిష్ జీకేలో అత్యధిక మార్కుల కోసం 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు ఏవైనా తెలుగు దినపత్రికలను, ఏదైనా ఒక ఇయర్‌బుక్‌ను చదవాలి. ఈ విభాగంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, వివిధ జాతీయ ఉద్యమాలు, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్స్, వ్యక్తులు-బిరుదులు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు-వ్యక్తులు, క్రీడలు, వ్యక్తులు-నియామకాలు, వివిధ సదస్సులు జరిగిన ప్రాంతాలు, శాస్త్రసాంకేతిక ప్రయోగాలు మొదలైనవాటి నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎల్ఐసీకి చెందిన ఉద్యోగం కాబట్టి ఎల్ఐసీ, ఐఆర్డీఏ తాజా విధానాలు, రిజర్వ్‌బ్యాంక్ వడ్డీరేట్లు, బడ్జెట్ వంటి విషయాలపై కూడా దృష్టి సారించాలి. పేపర్-2లోనే ఎదురయ్యే జనరల్ ఇంగ్లిష్‌లో ప్రధానంగా వొకాబులరీ, గ్రామర్‌పై ప్రశ్నలడుగుతారు. వాక్యాల పునరమరిక, స్పెల్లింగ్, వాక్యాల్లో తప్పులను సరిదిద్దడం, ప్రిపోజిషన్, ఆర్టికల్స్ తదితర అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలలో ఉన్న వ్యాకరణాన్ని సాధన చేస్తే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు. ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ (లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం) 50 మార్కులు కేటాయించారు కాబట్టి విజయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన వర్తమాన సంఘటనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థిక సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలి. బీమా సంస్థలు, జాయింట్ వెంచర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కొత్త చట్టాలు, సంప్రదాయ, ఆధునిక పాలసీలు, రిటర్నులు వంటి వాటిపై అవగాహన అవసరం.