breaking news
Abstract Painting
-
ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్‌స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్‌తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre) -
గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం వరకు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట కొమ్ములవంచకు చెందిన ప్రముఖ చిత్ర కారుడు కందునూరి వెంకటేశ్ గీసిన ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్ బాల్యం, విద్యా భ్యాసం మొదలు వివాహం, వ్యాపారం, రాజకీయ ప్రస్థానం దాకా... తండ్రి వైఎస్సార్ అకాల మరణం మొదలుకొని నాటి ప్రభుత్వం అక్రమ కేసులు మోపడం, ఓదార్పు యాత్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, సీఎంగా ఏపీని అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు వరకు అనేక అంశాలను ఒకే చిత్రంలో వెంకటేశ్ ఆవిష్కరించారు.జగన్ పాలనను చిత్రిక పట్టి..ఐదున్నర అడుగుల పొడవు, ఐదున్నర అడుగుల వెడల్పు ఉండే కాన్వాస్‌పై సుమారు 2 నెలలపాటు ఆయిల్ కలర్స్‌తో ఈ ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్‌కు వెంకటేశ్ ప్రాణప్రతిష్ట చేశారు. ‘ధర్మాన్ని ఆచరించేవాళ్లు భయాన్ని ఎరుగరు. ధర్మమే ధైర్యంగా జగన్ పరిపాలిస్తున్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఆశయాలను, కలలను సాకారం చేసిన జననేత స్ఫూర్తి దాయక జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ గీయడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తా’ అని వెంకటేశ్ చెప్పారు. గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం దిశగా రాష్ట్రాన్ని నడిపించడమే ధ్యేయంగా సాగుతున్న వైఎస్ జగన్ పరిపాలనకు చిత్రిక పట్టినట్లు చెప్పారు.సచివాలయ పల్లకీ.. సంక్షేమ బోయలు‘రాజకీయ రంగంలో మాట తప్పడం, మడమ తిప్పడం సహజంగా కనిస్తాయి. కానీ వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ ఫలాలను సామాన్యుల దరికి చేర్చారు. అందుకే ఈ చిత్రంలో గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా సచివాల యం అనే పల్లకీని మోసేందుకు సంక్షేమ పథకాల బోయలను ఏర్పాటు చేశా. ఈ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరుస్తున్న వాలంటీర్లను పథకాలకు కాపలాగా ఉన్న సైనికుడికి ప్రతీకగా పెట్టా. గాంధీ మహాత్ముడి అడుగు జాడల్లో నడుస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్లుగా సమసమాజం దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు’ అని వెంకటేశ్ చెప్పారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి జగన్ అందిస్తున్న పథకాల స్ఫూర్తితో..‘వై.ఎస్. జగన్ జీవితాన్ని ఆవిష్కరిస్తూ గీసిన చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని. ముఖ్యమంత్రిగా జగన్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు నేను ఈ చిత్రం గీసేందుకు స్ఫూర్తినిచ్చాయి.’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిస్ట్ వెంకటేశ్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల చిత్రాలను గీశారు. అగ్ర హీరోలు అమితాబచ్చన్, రజనీ కాంత్, ప్రభాస్ వంటి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్‌లో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. పగిడిపాల ఆంజనేయులు -
పిడికిలి బిగిస్తే... రంగు పడుద్ది
ఈ ఫొటోలో కిక్బ్యాగును బాదేస్తూ కనిపిస్తున్నాడే... ఇతగాడు మామూలోడు కాదు. ఇతగాడు గనుక పిడికిలి బిగించి పిడిగుద్దులు కురిపించాడంటే రంగు పడాల్సిందే! రింగులోకి దిగినప్పుడు పిడిగుద్దులు కురిపిస్తే, ప్రత్యర్థి ముఖంపై రంగు పడుద్ది. కిక్బ్యాగుపై కురిపించాడంటే, దానికి ముందే చుట్టిన కేన్వాస్పై రంగు పడుద్దంతే! ఆ తర్వాత అది ఎవరికీ అర్థంకాకున్నా, చూడచక్కని ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్‌గా తయారవుతుంది. ఇతగాడి పేరు బార్ట్ వాన్ పోలానెన్ పీటెల్. ఈ డచ్ వీరుడు ఉండేది నెదర్లాండ్స్‌లో. స్వతహాగా ఇతగాడు బాక్సర్. కాకపోతే ‘కుంచె’ం కలాపోసన ఎక్కువ. బాక్సింగ్ గ్లోవ్స్‌నే కుంచెలా వాడుకుంటూ, కిక్బ్యాగ్నే కేన్వాస్‌గా చేసుకుని ఇతగాడు సృష్టిస్తున్న కళాఖండాలు అంతర్జాతీయ ఆర్ట్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇవి ఒక్కొక్కటి వెయ్యి పౌండ్ల మేరకు పలుకుతున్నాయి.