breaking news
on 4th
-
4న ఐటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు
అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 4న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ విన్సెంట్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9440073849, 7799274030, 9985343524, 9000627745 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. -
4న బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరణ
కొత్తగూడెం అర్బన్: ఈ నెల 4వ తేదిన బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరించనున్నట్లు బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 సంవత్సరాల పండుగ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, పద్మశ్రీ కొలకలూరి ఎనాక్ హాజరవుతారని చెప్పారురు. 10, 11వ తేదీల్లో 200 మంది విద్యార్థులతో కథలు, కవితలపై వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రల కవులు హాజరవుతారన్నారు. ఈ సంవత్సరం బాలోత్సవ్ నాలుగు రోజుల పాటు జరుగనుందని తెలిపారు. మల్సూర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.