
బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కార్యాలయ ప్రాంగణంలో ‘విద్యార్థులు అండర్-18 మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మాక్ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని తెలిపారు.

రాష్ట్ర అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి

సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. సభలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు





















