హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ ఏడాదికి ఘనంగా ముగింపు పలకనుంది.
ఈ మధ్యే ప్రియుడు తటిల్ ఆంటోనిని గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది.
అటు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే సినిమా చేసింది.
హిందీలో ఇదే ఆమెకు తొలి చిత్రం కావడం విశేషం.
పెళ్లయిన రెండు రోజులకే సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటొందీ బ్యూటీ.
ఈ క్రమంలో హిందీ బిగ్‌బాస్‌కు కూడా వెళ్లింది.
అంతేకాదు, హీరో సల్మాన్ ఖాన్‌కు సౌత్ పాటపై స్టెప్పులు నేర్పించింది.
అలాగే బేబీ జాన్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మూవీలో వామికా గబ్బి మరో హరోయిన్. బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న విడుదల కానుంది.


