సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది కీర్తి సురేశ్.
ఈమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత.
సుమన్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా.. హిందీ భాష తప్పనిసరి అనడాన్ని వ్యతిరేకిస్తూ రూపొందింది.
ఈ నెల 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోరికను బయటపెట్టింది.
హీరో శింబు అంటే తనకు చాలా ఇష్టమని, తనతో జతగా నటించే అవకాశం వస్తే బాగుంటుందని పేర్కొంది.
తాను శింబును ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా కలవలేదని, అయితే కొన్నిసార్లు ఫోన్‌లో మాత్రం మాట్లాడానని తెలిపింది.
మొత్తమ్మీద ఈ బ్యూటీ శింబుతో నటించాలనే కోరికను ఇలా బయటపెట్టేసింది. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి!


