
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు.

వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే మహేశ్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు.

అమెరికాలోని ఓ యాక్టింగ్ స్కూల్‌లో నటనపై శిక్షణ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే గౌతమ్‌కు సంబంధించిన ఓ యాక్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన అభిమానులు లిటిల్ ప్రిన్స్ మహేశ్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






