టెక్సాస్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు | Telangana Formation day event in Texas San Antonio | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Jul 2 2017 4:45 PM | Updated on Sep 5 2017 3:02 PM

టెక్సాస్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

టెక్సాస్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో(టీఏజీఎస్ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

టెక్సాస్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో(టీఏజీఎస్ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటోనియో నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఏజీఎస్‌ఏ అధ్యక్షుడు శ్రీ సంగిశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ నృత్యం తెలంగాణవాదులను ఎంతో అలరించాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు జోహార్లు ఆర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేశ్ తన కళను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. నూతన తన గాత్రంతో తెలంగాణ ఎన్నారైలలో ఉత్సాహాన్ని తీసుకురాగా, సాన్ ఆంటోనియోకు చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆవిర్భావ దినోత్సవ వేడుక పరిపూర్ణమైంది. ఎన్నారై తెలంగాణ మహిళలు బోనాలు ప్రదర్శించారు. ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ టీఏజీఎస్‌ఏ అధ్యక్షుడు శ్రీ సంగిశెట్టి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement