'టైగర్ మెమన్ ను తీసుకొస్తేనే...' | Sakshi
Sakshi News home page

'టైగర్ మెమన్ ను తీసుకొస్తేనే...'

Published Wed, Jul 29 2015 7:30 PM

'టైగర్ మెమన్ ను తీసుకొస్తేనే...'

న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు సుప్రీంకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. మెమన్ ఉరిశిక్ష విధించడంతో బాంబు పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయం జరిగిందని పేర్కొంది.

పాకిస్థాన్ కు పారిపోయిన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ ను ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా వ్యాఖ్యానించారు. తనకు విధించిన ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement