పాట్నాలో జగన్కు ఘన స్వాగతం | warm welcome to ys jagan mohan reddy at patna air port | Sakshi
Sakshi News home page

పాట్నాలో జగన్కు ఘన స్వాగతం

Dec 13 2013 6:49 PM | Updated on Jul 25 2018 4:09 PM

పాట్నాలో జగన్కు ఘన స్వాగతం - Sakshi

పాట్నాలో జగన్కు ఘన స్వాగతం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు.

పాట్నా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. పాట్నా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా జగన్ ఇక్కడకు వచ్చారు. కాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఆయన కలవనున్నారు. సమైక్యాంధ్ర కోసం నితీష్‌ సహకారాన్ని ఆయన కోరనున్నారు.

ఈ ఉదయం ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలియచేశారు. ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement