లక్డీకపూల్లో వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

లక్డీకపూల్లో వ్యక్తి దారుణ హత్య

Oct 3 2015 6:18 AM | Updated on Apr 3 2019 8:29 PM

లక్డీకపూల్లో వ్యక్తి దారుణ హత్య - Sakshi

లక్డీకపూల్లో వ్యక్తి దారుణ హత్య

ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వెంటాడి దాడి చేసిన దుండగులు

సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి లక్డీకపూల్లో
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం మహ్మద్ సోహెల్‌గా అనుమానిస్తున్న వ్యక్తి అర్ధరాత్రి సమయంలో టీఎస్11ఈబీ5112  ద్విచక్ర వాహనంపై రంగారెడ్డి కలెక్టరేట్ వైపు వస్తున్నాడు. వెనుక నుంచి వాహనంలో వెంబడించిన దుండగులు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో సోహెల్‌ కిందపడిపోయూడు. వెంటనే వారు రాడ్లతో దాడి చేయడానికి రాగా అతను తప్పించుకుని ఎదురుగా ఉన్న సంధ్య రెస్టారెంట్‌లోకి పరుగులు తీశాడు.

వెంటవచ్చిన దుండగులు రాడ్లతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, డీఐ ప్రకాశ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని జేబులో ఎఫ్‌ఐఆర్ కాపీ ఉంది. మృతదేహం సమీపంలో సెల్‌ఫోన్ కూడా లభ్యమైంది. బండిలోని డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తున్నారు. హోటల్ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement