ఆంటోని కమిటీకి, తెలంగాణ నోట్‌కు సంబంధం లేదు: దిగ్విజయ్ | Telangana Note is not related to AK Antony Committee, says Digvijay Singh | Sakshi
Sakshi News home page

ఆంటోని కమిటీకి, తెలంగాణ నోట్‌కు సంబంధం లేదు: దిగ్విజయ్

Published Thu, Sep 26 2013 7:25 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనపై చర్చల కోసం కేంద్ర మంత్రి ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు.. తెలంగాణ నోట్‌కు సంబంధంలేదు అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు.

రాష్ట్ర విభజనపై చర్చల కోసం కేంద్ర మంత్రి ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు.. తెలంగాణ నోట్‌కు సంబంధంలేదు అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో తెలంగాణ నోట్‌ కేబినెట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది అని ఆయన అన్నారు.
 
రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుందని.. నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రెండు ప్రాంతాలకు ఒకే విధంగా వ్యవహరించాలి దిగ్విజయ్ అన్నారు. రాజ్యసభ టీవీకి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఇంటర్య్వూ నేను చూడలేదు అని అన్నారు. ఇంటర్య్యూ ఇవ్వడం మంచిదేనని అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయన ఏం మాట్లాడారో తెలీదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement